.
( గోపు విజయకుమార్ రెడ్డి ) …. అవును, నిజమే… విరాట్ కోహ్లీ పాపులారిటీ, బ్రాండ్ వాల్యూ ఏ స్టార్ హీరోకన్నా తక్కువ..? అసలు తనే ఎక్కువ! తనంటే పిచ్చి..! సేమ్, తోటి క్రికెటర్లు కూడా..! బిగ్‌బాస్ షో నిర్మాతలకు ఇదే తట్టింది… అసలు బిగ్‌బాస్ బంగ్లా ఎందుకు సక్సెస్ కావడం లేదు..? సో, ఈసారి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఒకప్పటి మన కెప్టెన్ సౌరబ్ గంగూలీనే దింపితే పోలా అనుకున్నారు…
అడిగారు, వోకే… నేను రెడీ అన్నాడు తను… తనకు బిగ్‌బాస్ కొత్త కావచ్చుగాక, కానీ టీవీ హోస్టింగ్ కొత్తేమీ కాదు, ఇంతకుముందు దాదాగిరీ (తనను దాదా అంటారు కదా) పేరిట జీ బంగ్లా చానెల్‌కు ఓ స్పోర్ట్స్ క్విజ్ షో చేశాడు…
Ads
15 సంవత్సరాల కాలవ్యవధిలో (2009 నుండి 2011 వరకు, తిరిగి 2013 నుండి 2024 వరకు) దాదాపు 10 పూర్తి సీజన్లకు గంగూలీ హోస్ట్… తిరుగులేని టీవీ రేటింగ్స్ (Unmatched TV Ratings)… ఈ క్విజ్ షో ప్రాంతీయ టెలివిజన్ రంగంలో నిరంతరం అగ్రస్థానంలో కొనసాగింది… గంగూలీ క్రేజ్, స్టార్ పవర్‌ను అంచనా వేయడానికి, 2012లో ప్రసారమైన సీజన్ 3 హోస్ట్‌గా లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తిని తీసుకువచ్చారు. అయితే, ప్రేక్షకులు గంగూలీ విలక్షణమైన శైలిని (స్టైల్‌ను) ఎంతగానో మిస్ అయ్యారు. దాంతో, నిర్వాహకులు సీజన్ 4 కోసం మళ్లీ గంగూలీని వెనక్కి తెచ్చుకున్నారు…
అలాంటి గంగూలీకి ఈ బిగ్‌బాస్ ఓ లెక్కా అంటారా..? కాదు, బిగ్‌బాస్ లెక్కలు, కష్టం వేరు… రకరకాల తిక్క కేరక్టర్లు, అందరినీ మేనేజ్ చేయడం పేద్ద టాస్క్… అంతటి జూనియర్ ఎన్టీయార్, నాని కూడా ఒక సీజన్ చేసి వదిలేశారు… తమిళంలో కమల్ హాసన్ వదిలేశాడు… సేతుపతి వచ్చాడు కొత్తగా… కన్నడంలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ ఫస్ట్ నుంచీ వాళ్లే… ప్రస్తుతం తెలుగులో నాగార్జున ఫిక్స్ అయిపోయినట్టుగా…
హిందీలో మొదటి సీజన్‌కు అర్షద్ వార్సీ చేయగా, ఆ తర్వాత శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కూడా చేశారు… తరువాత సల్మాన్ ఖాన్ దీర్ఘకాలంగా ఫిక్సయ్యాడు… మరాఠీలో రితేష్ దేశ్‌ముఖ్ (గతంలో మహేష్ మంజ్రేకర్ హోస్ట్)…
బిగ్‌బాస్ బంగ్లా విషయానికి వస్తే… ఫస్ట్ మిథున్ చక్రవర్తి చేసాడు (2013 ఈటీవీ బంగ్లా). వర్క్ అవుట్ కాలేదు… తరువాత లాంగ్ బ్యాక్ (2016 కలర్స్ బంగ్లా ) తర్వాత మళ్ళీ ఎవరో లోకల్ యాక్టర్ జీత్ అని చేసాడు… మళ్ళీ డిజాస్టర్.. ఇప్పుడు గుంగూలీతో రీ లాంచ్ చేస్తున్నారు… పదేళ్ల తరువాత… నాలుగేళ్లకు గాను (Star Jalsha) 125 కోట్ల భారీ రెమ్యునరేషన్ అట… గ్రేట్…
త్వరలో మాజీ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సోనీ లివ్ కోసం ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ షో హోస్ట్ చేయబోతున్నాడు… చూస్తూ ఉండండి… సినిమా సెలబ్రిటీలే కాదు… క్రికెటర్లు ఇలాంటి షోల హోస్టింగుకు ఇంకా రాబోతున్నారు… నిజానికి బిగ్‌బాస్ షో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, చాలా భాషల్లో ఉంది కదా, ఎక్కడా స్పోర్ట్స్ సెలబ్రిటీ హోస్ట్ చేయడం లేదు, ఫస్ట్ గంగూలీయే…
అవునూ, బిగ్‌బాస్ హౌజులోకి వచ్చే రకరకాల కేరక్టర్లను గంగూలీ మేనేజ్ చేయగలడా..? భలేవారే… యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ వంటి క్రికెెటర్లనే దారిలోకి తెచ్చుకున్నాడు… నో ప్రాబ్లం ఎట్ ఆల్ !!
Share this Article