Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…

August 12, 2026 by M S R

.

కానీ ఏమాటకామాట… హరీష్ రావు క్రెడిట్ చోరీలో నంబర్ వన్! దేవాదుల పంపులు ఎలాగూ నడిపిస్తారని తెలుసు, ఆ కట్కలు ఆన్ చేయకుముందే తను డిమాండ్ చేస్తాడు… ఆన్ చేయగానే, చూశారా, మేం హెచ్చరిస్తేనే ఆన్ చేశాడు అంటాడు…

ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వైపు నీటిని పంప్ చేయడం మొదలు పెట్టగానే, చూశారా, కాళేశ్వరం ఎంత శ్రేష్టమైన ప్రాజెక్టో అని మొదలు పెడతాడు… పాలమూరు- రంగారెడ్డి బాపతు నార్లాపూర్, ఏదుల పంపుల వెట్ రన్ స్టార్ట్ చేయరేమిటి అనడుగుతాడు… అవెలాగూ స్టార్ట్ చేస్తారని తనకు ముందే తెలుసు…

Ads

సేమ్, ఇప్పుడు గోదావరి రివర్ మేనేజె‌మెంట్ బోర్డుపైనా అంతే… తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపేయాలని చంద్రబాబు లేఖ రాశాడు ఈ బోర్డుకు… తను పక్కా ఆంధ్రబాబే కదా… రాస్తాడు… నథింగ్ డూయింగ్, మీరెవరు? ఏపీ లేఖ రాయగానే ఎజెండాలో ఎలా పెట్టేస్తారు..? అని ఎలాగూ తెలంగాణ ప్రభుత్వం ఎదురుతిరిగి లేఖ రాస్తుందని హరీష్ రావుకు తెలుసు కదా, తను గతంలో ఇరిగేషన్ మినిస్ట్రీ చూసినోడే కదా…

అనుకున్నట్టే తెలంగాణ లేఖ రాసింది… ఇంకేం? వెంటనే హరీశ్ రావు అందుకున్నాడు… ‘‘బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా రేవంత్ రెడ్డి?’’ అని స్టార్ట్ చేశాడు… అంటే, మేం హెచ్చరిస్తే, అలర్ట్ చేస్తే తప్ప వీళ్లకు సోయి రాలేదు అని చెప్పడం..? క్రెడిట్ చోరీ..,!! Credit Theft Politics …

పైగా ‘‘ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు… మీ నామమాత్రపు లేఖలు తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుతాయా? లేఖలతో పనులు కావు. ఏపీ ప్రభుత్వం GRMB ఎజెండాలో పెట్టిన అంశాలను తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలి. అవసరమైతే.. ఆ అంశాలు వెనక్కి తీసుకోకపోతే GRMB సమావేశానికి హాజరు కాబోమని కరాఖండిగా తేల్చి చెప్పాలి…’’ అంటూనే…

ఒకవేళ బోర్డు తన ఎజెండాను ఉపసంహరించకపోతే బీఆర్ఎస్ పార్టీ వేలాది మందితో ఈనెల 18న బోర్డు ఆఫీసును ముట్టడిస్తుందని తాజాగా హెచ్చరించాడు… మళ్లీ ఇక్కడ పొలిటికల్ గెయిన్ కోసం తన్లాట… శుష్క ప్రయత్నం, అదే పాడిందే పాట అన్నట్టుగా… ‘‘కేంద్రం చేతిలో ఉన్న GRMB, చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జల ద్రోహాన్ని అడ్డుకుంటాం…’’ అని తాజా వ్యాఖ్యలు…

ఇంకానయం… థాంక్ గాడ్… గోదావరి బోర్డుకు చంద్రబాబుతో ఆ ఎజెండా లేఖ రాయించిందే మోదీ, రేవంత్ రెడ్డి అని, ఆ లెటర్ డ్రాఫ్ట్ చేసింది తెలంగాణ సాగునీటి సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అనీ ఆరోపించలేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సన్నాసి ? సన్యాసి ? నదిలో వదిలేసిన శవం బతికి తిరిగొచ్చిందా !?
  • Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…
  • నాగదుర్గ – అఖిల్ రాజ్ ! రీల్ జంట కమ్ రియల్ జంట !!
  • Great Escape ! వ్యవస్థలన్నీ విఫలమైనవేళ – ఓ అరుదైన ఎయిర్ ఫీట్ !!
  • పోచారం గాచారమా..? పశ్చాత్తాపమా..? ఏమైంది వీళ్లందరికీ !!
  • సిగ్గుపడ్డ అరవింద్ స్వామి.. నవ్వుకుని దగ్గరికి రమ్మన్న నగ్మా !
  • గంగూలీ సౌరభం ! దాదాగిరీ ఇక బిగ్‌బాస్‌లో ! హోస్ట్‌గా ఫస్ట్ క్రికెటర్ !!
  • ఏజ్ బార్- ఇక డ్రామాలు చాలు ! విరక్తితో త్రిష తననే తిట్టుకుంటోందా ?!
  • 19 నిమిషాలు- 33 సార్లు ఆగిన గుండె… ఓ అసాధారణ వార్త !!
  • అసలు నిజాల లెక్కలు ఇవీ ! థియేటర్‌ దందా కంప్లీట్ పిక్చర్ ఇదిగో !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions