.
( గోపు విజయకుమార్ రెడ్డి ) ….. మీకు ఓ చేదు నిజం తెలుసా..? అధికారికంగా వెల్లడవుతున్న రహస్యం తెలుసా..? సినిమా టికెట్ కంటే పెద్ద బిజినెస్… థియేటర్‌లో ప్రేక్షకుడి ఖర్చు!
సినిమా ప్రేక్షకుడిని తీసుకొస్తుంది… కానీ ఆ ప్రేక్షకుడి ఖర్చు మొత్తం సినిమాకు మాత్రం చేరదు. సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు మనం సాధారణంగా టికెట్ ధర గురించే ఆలోచిస్తాం. ₹200, ₹300, ₹400… టికెట్ ఎంత పెరిగిందనే చర్చే ఎక్కువ. కానీ ఒక ప్రేక్షకుడు థియేటర్‌లో పెట్టే మొత్తం ఖర్చును చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.
Ads
PVR INOX FY26 గణాంకాలు దీనికి మంచి ఉదాహరణ…. కంపెనీకి FY26లో సుమారు ₹6,743 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సినిమా టికెట్ల ద్వారా ₹3,530 కోట్లు వస్తే, Food & Beverages ద్వారా ఏకంగా ₹2,088 కోట్లు వచ్చాయి. అంటే థియేటర్‌లో సినిమా చూపించడం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, అదే ప్రేక్షకుడు థియేటర్‌లో తినే, తాగే వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా ఇప్పుడు భారీ businessగా మారింది.
FY26లో PVR INOXకు సుమారు 15 కోట్ల patrons వచ్చారు. సగటు టికెట్ ధర ₹280 కాగా, ఒక్క ప్రేక్షకుడి F&B ఖర్చు సగటున ₹147. అంటే ఒక ప్రేక్షకుడు సినిమా టికెట్‌కు ₹280 ఖర్చు చేస్తే, మరో ₹147 దాదాపుగా థియేటర్‌లోని F&Bపై ఖర్చు చేస్తున్నాడు.
సింపుల్‌గా చెప్పాలంటే— టికెట్ ₹280. F&B ₹147 … ఒక్క ప్రేక్షకుడి కనీస సినిమా ఖర్చు ₹427 … ఇది travel, parking, online booking charges వంటి ఖర్చులు గాకుండా…! Q4 FY26లో ఈ సంఖ్యలు మరింత పెరిగాయి. సగటు టికెట్ ధర ₹315 కాగా, F&B spend per head ₹165కు చేరింది. అంటే ప్రేక్షకుడు సినిమా చూడటానికి పెట్టే డబ్బులో సగానికి పైగా మరోసారి థియేటర్‌లోనే ఖర్చు చేస్తున్నాడు.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది… ఈ అదనపు ఖర్చులో నిర్మాతకు, content creatorకు ఎంత భాగం వస్తోంది? టికెట్ ఆదాయం సినిమా businessలో producer–distributor–exhibitor revenue-sharing వ్యవస్థలోకి వెళ్తుంది. కానీ ప్రేక్షకుడు థియేటర్‌లో కొనుగోలు చేసే popcorn, beverages, nachos, coffee, combos వంటి వాటి నుంచి వచ్చే ఆదాయం ప్రధానంగా exhibitor సొంత F&B business.
అంటే ప్రేక్షకుడు సినిమా పేరుతో థియేటర్‌కు వచ్చి ₹400–₹500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా, ఆ మొత్తం సినిమా కంటెంట్‌కు revenue కాదు. ఇక్కడే భారతీయ సినిమా exhibition businessలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది.

—
థియేటర్ ఇక సినిమా చూపించే స్థలం మాత్రమే కాదు… ఒకప్పుడు థియేటర్‌కి ప్రధాన product సినిమా. ఇప్పుడు: సినిమా + F&B + Premium Experience + Advertising + Luxury Seating + Large Formats… అన్నీ కలిసిన entertainment businessగా మారింది.
ఇది exhibitorకి చాలా మంచి business model. ఎందుకంటే సినిమా ప్రేక్షకుడిని థియేటర్‌కి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆ ప్రేక్షకుడి నుంచి అనేక మార్గాల్లో revenue generate చేయవచ్చు. అందుకే ఒక పెద్ద స్టార్ సినిమా, ఒక పెద్ద franchise సినిమా లేదా భారీ event film థియేటర్‌కు కేవలం ticket revenueనే కాదు— F&B revenue కూడా తీసుకొస్తుంది.
ఒక showలో 500 మంది ప్రేక్షకులు ఉంటే, 500 tickets మాత్రమే అమ్మబడవు. 500 popcornలు, 500 beverages, hundreds of combos కూడా అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఒక blockbuster theatreకి multiple revenue streams తెస్తుంది.
—
ఇక్కడే చిన్న, మధ్యస్థ బడ్జెట్ సినిమాల సమస్య మొదలవుతుంది… ఒక చిన్న లేదా medium-budget సినిమా చాలా మంచి contentతో వచ్చింది అనుకుందాం. కథ బాగుంది. Reviews బాగున్నాయి. Word of mouth బాగుంది.
కానీ మొదటి రోజు నుంచే అది ఒక స్టార్ హీరో సినిమాలా భారీ crowd తీసుకురాకపోవచ్చు. అప్పుడు exhibitor దృష్టిలో అది కేవలం ticket collection విషయం కాదు. ఆ సినిమా ఎంత footfall తీసుకొస్తుంది? ఎంత F&B sales వస్తాయి? అన్నది కూడా ఒక commercial consideration అవుతుంది.
ఇక్కడ పెద్ద సినిమాకు సహజంగానే advantage ఉంటుంది. ఎందుకంటే పెద్ద సినిమా: ఎక్కువ screens → ఎక్కువ shows → ఎక్కువ audience → ఎక్కువ tickets → ఎక్కువ F&B sales… అనే పూర్తి commercial cycleను సృష్టిస్తుంది.
చిన్న సినిమాకు మాత్రం మొదట audienceని build చేసుకోవాలి. కానీ screen space తక్కువగా దొరికితే audienceని ఎలా build చేసుకుంటుంది?
—
ఇదే ఒక ప్రమాదకరమైన cycle … పెద్ద సినిమా వస్తుంది. దానికి ఎక్కువ screens వస్తాయి. ఎక్కువ shows ఉంటాయి. ఎక్కువ audience వస్తుంది. F&B sales పెరుగుతాయి. Exhibitorకి overall revenue పెరుగుతుంది. అప్పుడు తదుపరి పెద్ద సినిమాకు మరింత preference రావడం సహజం.
ఇక చిన్న సినిమా?… తక్కువ screens. తక్కువ shows. తక్కువ opening. తక్కువ collections. తర్వాత: “సినిమాకు audience లేదు” అనే perception.
ఇదే సమస్య. ఎందుకంటే కొన్ని సినిమాలకు audience లేకపోవడం కాదు— ఆడియన్స్‌ను చేరుకునేంత exhibition అవకాశం లేకపోవచ్చు.

ఇటీవలి Tamil cinema release pattern కూడా ఆలోచించాల్సిన విషయమే … Jana Nayagan, Spider-Man: Brand New Day వంటి భారీ audience-pull ఉన్న సినిమాలు థియేటర్లకు వచ్చినప్పుడు exhibitors వాటికి ఎక్కువ screens ఇవ్వడానికి commercial reasons ఉంటాయి.
అలాంటి సినిమాలు: భారీ footfall తీసుకొస్తాయి, occupancy పెంచుతాయి, premium ticket pricingకు అవకాశం ఇస్తాయి, F&B sales పెంచుతాయి, theatre revenueను అనేక మార్గాల్లో పెంచుతాయి, ఇది exhibitor business perspectiveలో తప్పు కాదు.
కానీ అదే సమయంలో ప్రశ్న: ఒక పెద్ద సినిమాకు ఎక్కువ screens ఇవ్వడం వల్ల ఒక చిన్న సినిమాకు audienceని సంపాదించుకునే అవకాశం ఎంత తగ్గుతోంది? అన్నది.
—
మధ్యతరగతి ప్రేక్షకుడి పరిస్థితి కూడా మారుతోంది… ఒక నలుగురు సభ్యుల కుటుంబం PVR వంటి multiplexకి వెళ్తే, FY26 averageతో:
4 tickets × ₹280 = ₹1,120
F&B: 4 × ₹147 = ₹588
మొత్తం: ₹1,708
ఇంకా travel, parking, booking charges కలిపితే ₹2,000కి చేరడం పెద్ద విషయం కాదు.
Q4 FY26 averageతో చూస్తే:
4 tickets × ₹315 = ₹1,260
F&B = ₹660
అంటే: ₹1,920
ఇది కూడా ఇతర ఖర్చులు గాకుండానే…
అందుకే ఇప్పుడు మధ్యతరగతి ప్రేక్షకుడు ప్రతి సినిమాను థియేటర్‌లో చూడటం లేదు. … అతని ప్రశ్న: “ఈ సినిమా కోసం ₹2,000 ఖర్చు పెట్టి థియేటర్‌కి వెళ్లడం worth అవుతుందా?” అనే స్థాయికి వచ్చింది.
—
అయితే అసలు సినిమా పరిశ్రమకు ప్రమాదం ఏమిటి? … పెద్ద సినిమాలు విజయవంతం కావడం సమస్య కాదు. అవి థియేటర్లను బతికిస్తాయి. Audienceని theatresకి తీసుకొస్తాయి. Cinema-going cultureను బలపరుస్తాయి.
సమస్య ఎక్కడంటే— థియేటర్‌కు ఎక్కువ revenue తీసుకొచ్చే సినిమాలకే ఎక్కువ exhibition space దొరికితే, కొత్త సినిమాలు audienceని build చేసుకునే అవకాశం కోల్పోవచ్చు.
ఇది ముఖ్యంగా:
Small-budget films
Medium-budget films
Content-driven films
New actors / new directors films
పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

—
నా దృష్టిలో అసలు విషయం ఇదే … Indian Cinema Exhibition is no longer just about exhibiting cinema. ఇది ఇప్పుడు audience monetisation businessగా కూడా మారుతోంది. సినిమా ప్రేక్షకుడిని తీసుకొస్తుంది. థియేటర్ ఆ ప్రేక్షకుడి మొత్తం consumptionను monetise చేస్తుంది.
టికెట్ ఒక revenue.
F&B మరో revenue.
Advertising మరో revenue.
Premium formats మరో revenue.
అంటే ఒక ప్రేక్షకుడు థియేటర్‌లో ఖర్చు చేసే మొత్తం విలువ, అతను కొన్న టికెట్ విలువ కంటే చాలా ఎక్కువ. కానీ ఈ మొత్తం economic valueలో content creatorకు ఎంత చేరుతోంది? అది మనం కూడా చర్చించాల్సిన విషయం.
—
చివరికి… Popcorn అమ్మేది థియేటర్. కానీ ఆ popcorn కొనడానికి ప్రేక్షకుడిని థియేటర్‌కి తీసుకొచ్చేది సినిమా. అందుకే థియేటర్ businessలో F&B ఎంత ముఖ్యమైనా, దాని మూలం మాత్రం సినిమానే. పెద్ద సినిమాలకు పెద్ద screens ఇవ్వడం business-wise సరైన నిర్ణయం కావచ్చు.
కానీ చిన్న, medium-budget సినిమాలకు audienceను build చేసుకునేంత exhibition opportunity లేకపోతే, మనం క్రమంగా సినిమాలను కాదు, ఇప్పటికే audience ఉన్న సినిమాలనే ప్రోత్సహించే వ్యవస్థగా మారే ప్రమాదం ఉంది.
సినిమా కేవలం popcorn అమ్మడానికి వచ్చే audience generator కాకూడదు. Popcorn సినిమా విజయానికి అదనపు revenue కావాలి — సినిమా popcorn revenueకి ఒక సాధనం కాకూడదు. అదే సమయంలో Indian cinema exhibitionలో balance అవసరం.
ఎందుకంటే చివరికి—
థియేటర్‌కి ప్రేక్షకుడిని తీసుకొచ్చేది సినిమా.
ప్రేక్షకుడి చేతిలోని మొత్తం walletను monetize చేసేది థియేటర్.
కానీ ఆ walletలోని valueలో content creatorకు ఎంత దక్కుతోంది?
ఇదే ఇప్పుడు భారతీయ సినిమా పరిశ్రమ అడగాల్సిన అసలు ప్రశ్న…
Share this Article