Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!

August 15, 2026 by M S R

.

జాన్ ఓవర్‌డెక్ మరియు లారా ఓవర్‌డెక్ : న్యూజెర్సీ చరిత్రలోనే అతిపెద్ద విడాకుల పోరాటం … ప్రపంచ ప్రఖ్యాత హెడ్జ్ ఫండ్ కో-ఫౌండర్, బిలియనీర్ జాన్ ఓవర్‌డెక్ (John Overdeck), ఆయన సతీమణి లారా ఓవర్‌డెక్ (Laura Overdeck) మధ్య జరుగుతున్న విడాకుల వివాదం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. న్యూజెర్సీ చరిత్రలోనే ఇది అతిపెద్ద విడాకుల పోరాటంగా నిలిచింది.

ఈ భారీ విడాకుల కేసుకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా… లారా ఓవర్‌డెక్ కోరుతున్న ఆస్తి విలువ దాదాపు $6.2 బిలియన్లు. ఇది ప్రపంచంలోని ప్రముఖ క్వాంటిటేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్‌లలో ఒకటైన ‘టూ సిగ్మా ఇన్వెస్ట్‌మెంట్స్’ (Two Sigma Investments) లో జాన్‌కు ఉన్న వాటాలో సుమారు 35% భాగం…

Ads

కేవలం షేర్లే కాకుండా, వందల మిలియన్ల డోర్ల విలువైన బాండ్లు, అలాగే వారి కుటుంబ దాతృత్వ సంస్థ (Family Foundation) పై సమాన హక్కులు ఉండాలని లారా కోరుతోంది… జాన్ ఓవర్‌డెక్ ఇప్పటికే లారాకు పన్ను మినహాయింపుతో కూడిన $723 మిలియన్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాడు. అయితే, ఇది వారి జీవన ప్రమాణాలకు, ఆస్తుల విలువకు సరిపోదని లారా న్యాయవాద బృందం కొట్టిపారేసింది.

ఈ విడాకుల ట్రయల్ ప్రధాన ఉద్దేశ్యం.. జాన్ వద్ద ఉన్న ‘టూ సిగ్మా’ షేర్లు వైవాహిక ఆస్తి (Marital Property) కిందకి వస్తాయా లేదా అని తేల్చడమే.  వీరు 2002లో వివాహం చేసుకునే సమయానికి ‘టూ సిగ్మా’ కేవలం ఒక ఆలోచన మాత్రమేనని, అప్పుడు దానికి వాస్తవ ఆస్తులు ఏవీ లేవని లారా వాదిస్తోంది. కాబట్టి, వివాహం తర్వాత సంపాదించిన ఈ సంపదలో తనకు సమాన వాటా ఉందని ఆమె పట్టుబడుతోంది.

వివాహానికి ముందే ఈ కంపెనీ ద్వారా భారీ మొత్తంలో వ్యాపారం నడుస్తోందని జాన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు చెబుతున్నారు… జాన్ గత కొన్ని సంవత్సరాలుగా తన ఆస్తులను రహస్యంగా దాచిపెట్టాడని లారా తీవ్ర ఆరోపణలు చేస్తోంది…

$80 బిలియన్ల విలువైన ‘టూ సిగ్మా’ సంస్థలో ఇప్పటికే సహ-వ్యవస్థాపకుల మధ్య కొన్ని అంతర్గత వివాదాలు నడిచాయి. ఇప్పుడు ఈ విడాకుల కేసు కారణంగా కంపెనీ నిర్వహణ, నియంత్రణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు….

ప్చ్, అమెరికా మాత్రమే కాదు, ఇండియాలోనూ ఇంతే కదా… నిజానికి అక్కడ స్ట్రెయిట్ ఫైట్… ఇండియాలో అయితే భరణం, మనోవర్తి, గృహహింస, లైంగిక హింస, కట్న వేధింపులు గట్రా కేసులు… మరీ భార్యకు తిక్క రేగితే ఏ ప్రియుడినో పట్టుకుని ఖతం ప్రోగ్రాం కూడా… అందుకే అప్పట్లో ఎవరో సినీకవి రాశాడు… సోలో  బతుకే సో బెటరూ అని…

సంతానవ్యాప్తి, వారసత్వం, కుటుంబ బంధాలు… అంతా ట్రాష్ అట… న్యూజెర్సీ కేసులో ఆమె 60 వేల కోట్ల సెటిల్మెంట్ అడగడం ఏమిటో… అతను 6 వేల కోట్లు ఇస్తానని అనడం ఏమిటో… అంతా మాయ..!

అసందర్భమో, వర్తిస్తుందో లేదో తెలియదు గానీ, మొన్న ఓ రీల్ కనిపించింది… కపిల్ శర్మ కామెడీ షోలో ప్రియాంక చోప్రా అతిథి… ఆమె మంచి స్పాంటేనియస్ పంచ్ ప్లేయర్… కోటి రూపాయలు కావాలా, ఆరుగురు అందగత్తెలతో పటాయాలో వారం రోజుల ప్యాకేజీ కావాలా అని అడుగుతుంది… కోటి రూపాయలే కావాలి అంటాడు కపిల్ శర్మ, అదేమిటని అడుగుతుంది ప్రియాంక…

ఆ ఆరుగురి వారం ప్యాకేజీ అయిదారు లక్షలకే దొరుకుతుంది… మిగతా 95 లక్షలు మిగులే కదా అంటాడు కపిల్..! సో, ఎంపిక ముఖ్యం… కుటుంబం కావాలా..? సోలో మనశ్శాంతి కావాలా..? చాలామంది యువకులు ఇదే ఆలోచనల్లో పడ్డారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !
  • దేవుడు ఆ రహస్యాన్ని చాన్నాళ్లు దాచాడు – కానీ ఇక దాగలేదు !!
  • స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions