Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!

August 15, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి నిజంగా కొన్ని మంచి ఆలోచనలు చేస్తాడు, సంకల్పం- ఉద్దేశం ప్రశంసనీయం… బడ్జెట్‌లో పెడతాడు, ప్రకటిస్తాడు- కానీ తన ఆలోచనల వేగానికి తగినట్టుగా పరుగెత్తే ఉన్నతాధికారులు కరువయ్యారు తన టీమ్‌లో… రేవంత్ ఓసారి సీరియస్‌గా లుక్కేయాల్సిన విషయం ఇది…

ఎందుకంటే, ఒక సంవత్సరం దాటితే ఇక ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెడతాడు కాబట్టి… అప్పటికి జనానికి సత్ఫలితాలు, అవీ కేసీయార్ అస్తవ్యస్త పోకడలకు భిన్నంగా చూపించాల్సి ఉంటుంది కాబట్టి…

Ads

ఇందిరమ్మ బీమా పథకం దీనికి మంచి ఉదాహరణ… కేసీయార్ పాలనకాలంలో దాదాపు ఏడెనిమిదేళ్లు రైతు బీమా అమలైంది… ఎవరైనా రైతు మరణిస్తే గతంలోలాగా పంచనామా, అధికారులకు- దళారులకు కమీషన్లు మన్నూమశానం ఏమీ అక్కరలేకుండా ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారం అందే ఏర్పాటు… కానీ కేసీయార్ ఆలోచనల్లోని అస్తవ్యస్తత ఏమిటంటే..? సేమ్, రైతుభరోసాలాగే…

నిజానికి రాష్ట్రంలో వ్యవసాయం చేసేది సగం మంది కౌలు రైతులే… వాళ్లకు గుర్తింపు ఉండదు, భూమి అద్దె కట్టాలి, బ్యాంకుల రుణాలు రావు, రైతు భరోసా ఇవ్వరు, ఎరువులకు సమస్య, చివరకు వాళ్లు పండించిన పంట కొనుగోలుకూ తిప్పలే… ఆత్మహత్యలకు పాల్పడేది కూడా కౌలు రైతులే… ప్రాణాంతక వ్యవసాయం…

వాళ్లెవరికీ బీమా పథకం వర్తించకపోయేది… మరిక ఆ పథకంతో ప్రయోజనం ఎంత శాతం..? సో, రేవంత్ రెడ్డి కౌలు రైతులు, అసలు రైతులకే కాదు, వ్యవసాయంలో పాలుపంచుకునే కూలీలు, ఇతర వృత్తిపనివారు, అందరికీ ఈ 5 లక్షల బీమా వర్తించేలా ఇందిరమ్మ బీమా పథకం ఆలోచించాడు… నిజానికి ప్రశంసనీయం…

కానీ ఏం జరిగింది..? ఈరోజుకూ అది పట్టాలెక్కలేదు, సీఎంకు తగినట్టు చురుకుగా కదిలే అధికారుల్లేరు… ఈలోపు రైతు బీమా గడువు నిన్నటితో ముగిసింది… ప్రీమియం కట్టలేదు, దాదాపు 1400 కోట్లు… 42 లక్షల మంది రైతులకు ఇప్పుడు బీమా వర్తించదు… మరోవైపు ఇందిరమ్మ బీమా అమల్లోకి రాలేదు, బడ్జెట్‌లో 4 వేల కోట్లు కేటాయించారు…

జూన్ 2 నుంచి అన్నారు మొదట్లో, కాలేదు… ఇప్పుడు ఇందిరమ్మ జయంతి, అంటే నవంబరు 19 నుంచి అంటున్నారు… అసలు ఈ పథకం మీద బేసిక్ సర్వే వంటి కార్యాచరణే స్టార్ట్ కాలేదు… సరైన మార్గదర్శకాలే లేవు… సరే, నవంబరు 19 నుంచి నిజంగానే అమలు ప్రారంభిస్తారు అనుకుందాం, మరి ఈలోపు మరణించేవారికి పరిహారం మాటేమిటి..? అంటూ 3 నెలల కాలం…

రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రం అని తరచూ కేసీయార్ గొప్పలు చెప్పుకునేవాడు, జబ్బలు చరుచుకునేవాడు, కానీ ఆత్మహత్యలు ఏమీ ఆగలేదు… 2018 నుంచి లెక్కేస్తే ఏటా 20 నుంచి 25 వేల రైతు మరణాలు  నమోదు అవుతున్నాయి…

సో, కేసీయార్ శుష్క స్వీయ పొగడ్తలను పగులగొట్టి, నిజంగా వ్యవసాయ కుటుంబాలకు ఆసరాగా నిలవాలంటే, సీఎం ఓసారి ఈ పథకం మీద సీరియస్ లుక్కేయాలి..!! దీన్ని పూర్తిగా భట్టికి వదిలేసినట్టున్నాడు… తనతో కావడం లేదు… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !
  • దేవుడు ఆ రహస్యాన్ని చాన్నాళ్లు దాచాడు – కానీ ఇక దాగలేదు !!
  • స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
  • మళ్లీ గోక్కుంది అనసూయ – అలవాటే కదా – లెంపలేసుకుంది !!
  • శనార్తి ! నాగదుర్గ సినిమా టైటిల్ ఇది ! స్వచ్ఛమైన తెలంగాణ పలకరింపు !!
  • Makutam ! ఓ సోది కథ – నరుకుడు, దంచుడు… పాపం, విశాల్ !!
  • Agadha ! రాజు గారూ… మరోసారి సారీ..! తమరు నిర్మాతగానే బెటర్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions