Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!

August 16, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. ట్రంప్ చైనా పర్యటన!
తొమ్మిది సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకి వచ్చాడు!
2017 లో నవంబర్ 8-10 ల మధ్య రెండు రోజులు చైనాలో పర్యటించిన ట్రంప్ మళ్ళీ తొమ్మిదేళ్ల తరువాత May 13 నుండి 15 వరకూ చైనా పర్యటనకి వచ్చాడు!

ట్రంప్ తో చైనా పర్యటనకి వచ్చిన హై ప్రొఫైల్ డెలిగేషన్ :
1.ఎలన్ మస్క్ ( Tesla & Space X )
2.టిమ్ కుక్ ( Apple )
3.జెన్ సెన్ హాంగ్ ( Nvidia )
కీలకమైన అత్యంత ధనవంతమైన సంస్థలు :
4.బ్లాక్ రాక్ ( Black Rock ), బ్లాక్ స్టోన్ ( Black Stone ), బోయింగ్ ( Boeing ), సిటీ గ్రూప్ ( ( Citigroup ), Meta గ్రూప్.

Ads

చైనాతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన కీలక రంగాలు :
5.ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, సెమికండక్టర్స్, ఫైనాన్స్, ఏరో స్పెస్, కన్స్యూమర్ టెక్నాలజీ.
చైనా పర్యటనకి వచ్చిన ట్రంప్ బృందం జీ జింగ్ పింగ్ నుండి కేవలం హామీలు తీసుకున్నారు తప్పితే ఖచ్చితమైన ఒప్పందాలు జరగలేదు!

కనీసం  700 బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకోవాలని ఆశించిన ట్రంప్ బృందానికి జింగ్ పింగ్ చూద్దాం, చేద్దాం అన్న తరహాలో వ్యవహారించాడు తప్పితే ఒప్పందాలు చేసుకోలేదు!
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఇతర ప్రముఖుల మీద చైనా ఆద్యంతం నిఘా పెట్టింది!
అలన్ మస్క్ తోసహా ఎవరి మొబైల్ ఫోన్లు పనిచేయలేదు పర్యటన ముగిసి తిరిగి విమానం ఎక్కే వరకూ! అంటే దీనర్ధం చైనా అమెరికన్ డెలిగేషన్స్ ఫోన్లు నిలిపివేసిందని కాదు!
అమెరికన్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు ట్రంప్ తో సహా అందరికీ ఖచ్చితంగా పాటించాల్సిన నియమావళిని సూచిస్తూ ట్రంప్ కి నివేదిక ఇచ్చింది!

అమెరికన్ సైబర్ సెక్యూరిటీ ఇచ్చిన సూచనలు :
1.ట్రంప్ తో పాటు డిప్లొమాట్స్, కార్పొరేట్ సంస్థల అధిపతులు అందరూ కూడా తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, టాబ్స్, లాప్ టాప్స్, స్మార్ట్ వాచెస్ ఎట్టి పరిస్థితులలోనూ చైనాలో వాడకూడదు! చైనా తన అతిధులకి ఇచ్చే వసతి, డైనింగ్ హల్స్ లలో ఉండే Wi -Fi , మొబైల్ నెట్వర్క్ ద్వారా డాటాని దొంగిలిస్తుంది!
ట్రంప్ తో సహా అందరూ తమ తమ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని Air Force 1 లోనే వదిలేసి వచ్చారు!

మరి అమెరికన్ బృందానికి కమ్యూనికేషన్ ఎలా?
2. అమెరికన్ సైబర్ సెక్యూరిటీ బృందం తాత్కాలిక మొబైల్, లాప్ టాప్స్ లని ఇస్తూ వాటిలో బేసిక్ సాఫ్ట్వేర్ లని ఇంస్టాల్ చేసింది!
వీటిని ‘ క్లీన్ డివైసెస్ ’( Clean Devices ) అంటారు.
మరో పేరు కూడా ఉంది అది ‘బర్నర్ ఫోన్స్ ’ ( burner phones ) అని. ప్రీ లోడెడ్ మొబైల్ డాటాతో వస్తాయి కానీ తాత్కాలికంగా వాడి పారేసే రకం. కేవలం మాట్లాడుకోవడానికి, text మెసేజెస్ కోసం పనికివస్తాయి. వీటిని ట్రాకింగ్ చేయడం వీలుకాదు! అఫ్కోర్స్ 1995 నుండి 2004 వరకూ మన దేశంలో వాడబడ్డ నోకియా బేసిక్ ఫోన్లు లాంటివి. కాకపోతే చాలా తక్కువ హార్డ్ వేర్ తో ఉంటాయి. లాప్ టాప్స్ లలో కూడా బేసిక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇచ్చారు!

3.హోటళ్ళలో, పబ్లిక్ ప్రదేశాలలో ఉండే Wi -Fi తో పాటు USB ఛార్జింగ్ పాయింట్స్ ని వాడవద్దని, అలా చేస్తే ఫోన్ లో డయల్ చేసిన నంబర్లు చోరీ చేసే అవకాశం ఉంటుంది. లాప్ టాప్ అయితే బ్రౌజింగ్ హిస్టరీ ( వాడిన వెంటనే హిస్టరీ డిలీట్ చేసినా సరే ) చైనా దొంగిలించి అనలైజ్ చేస్తుంది అని హెచ్చరిక చేశారు. వీలున్నంత వరకూ రెండు రోజుల పర్యటనలో బ్యాటరీ పొదుపుగా వాడుకొని ఎక్కడా ఛార్జింగ్ కి పెట్టకుండా జాగ్రత్త పడమని సూచనలు చేసింది సైబర్ సెక్యూరిటీ టీమ్!

us china

ఇవేవి చైనా విధించిన ఆంక్షలు కావు! చైనా తమ మీద గూఢచర్యానికి పాల్పడుతుందేమో అని భయపడి అమెరికన్స్ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు!
చైనా పర్యటనకి వచ్చే ముందు Fox న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విలేఖరి ట్రంప్ ని ఉద్దేశించి ప్రశ్నిస్తూ ‘‘అమెరికా, ఇజ్రాయేల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తూ, చైనాకి ఇరాన్ లో ఉన్న ప్రయోజనాలని దెబ్బతీయడం, మీరు వాణిజ్య ఒప్పందాలని చేసుకోవడానికి బీజింగ్ వెళ్లడం వలన ఉపయోగం ఉంటుందా’’  అని అడిగినప్పుడు సమాధానంగా ట్రంప్ మాట్లాడుతూ ‘‘అవేవి అమెరికా చైనాల మధ్య వాణిజ్య సంబంధాలని ప్రభావితం చేయలేవు, ఎందుకంటే చైనాకి తమ ఉత్పత్తులని అమెరికాలో అమ్ముకోవాలి, అదే సమయంలో అమెరికా ఉత్పత్తులని చైనా కొనాల్సిన అవసరం ఉంది’’ అని బదులు ఇచ్చాడు ట్రంప్!

తీరా చైనా రెండు రోజుల పర్యటనలో ఎలాంటి కీలక ప్రకటనలు వెలువడలేదు సరి కదా చైనా సెంట్రల్ హాల్ లో ట్రంప్ బృందానికి జింగ్ పింగ్ ఇచ్చిన విందులో ట్రంప్ తో సహా ఇతర డిప్లొమాట్స్, కార్పొరేట్ అధిపతులకి సహాయంగా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులని మొహరించింది చైనా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి!

పర్యటన ముగించుకొని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం దగ్గరికి వెళ్లే ముందు అంతర్జాతీయ విలేఖరులకి ఇచ్చిన ఇంటర్వూ లో జింగ్ పింగ్ అమెరికా నుండి 200 బోయింగ్ విమానాలని, సోయా బీన్స్ ని కొనడానికి ఒప్పుకున్నారని అన్నాడు కానీ చైనా నుండి ట్రంప్ వ్యాఖ్యలని సమర్ధిస్తూ లేదా ఖండిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు!

ఇదంతా చెప్పడానికి కారణం ఉంది :
4.ట్రంప్ చైనా పర్యటన ముగించిన ఏప్రిల్ నెలలోనే భారత్ నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ( FDI ) లు భారీ మొత్తాలలో ఉపసంహరించబడ్డాయి!
5. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలలో భాగంగా రెండు స్థానాలు దిగజారి 6వ స్థానానికి పడిపోయింది భారత్!

6.FDI లు తమ పెట్టుబడులని లాభాల స్వీకరణ నెపంతో భారత మార్కెట్ల నుండి ఉపసంహరించడం వలన పెట్టుబడిదారులకి డాలర్లలలో చెల్లింపులు జరపడంతో, రూపాయి మీద ఒత్తిడి పెరిగి, తద్వారా రూపీ డాలర్ వాల్యూ లెక్కల వలన 6వ స్థానానికి పడిపోయింది.

7.మార్కెట్లలో విదేశీ పెట్టుబడులని లెక్కలోకి తీసుకుంటే ఎకానమీ గొప్పగా ఉన్నట్లు కాదు! భారత్ అభివృద్ధి రేటు 6% నుండి 7% మధ్య స్థిరంగా దూసుకుపోతున్నది కాబట్టి లార్జెస్ట్ ఎకానమీలో ఎన్నో స్థానంలో ఉన్నది అన్నది లెక్కలోకి రాదు. స్థిరమైన వృద్ధి రేటు కావాలి! అది భారత్ లో కొనసాగుతున్నది!

ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తరువాతే భారత మార్కెట్ల నుండి భారీ స్థాయిలో ఉపసంహరణ జరిగి ఆ పెట్టుబడులు ఇంగ్లాండ్, జపాన్ దేశాలకి తరలి వెళ్లిపోవడం వెనుక చైనా అమెరికాని డిమాండ్ చేసి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి!

చైనా డిమాండ్ : మీరు భారత మార్కెట్ల నుండి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటేనే సోయా బీన్స్, బోయింగ్ విమానాలు కొంటాము అని కండిషన్ పెట్టి ఉండవచ్చు! అఫ్కోర్స్ ఇది బలూచిస్తాన్, PoJK లలో భారత్ జోక్యాన్ని తగ్గించే దిశగా అనుకోవచ్చు!

May 23, 2026 – May 26, 2026!
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ( Marco Rubio ) భారత్ లో పర్యటించాడు!
మార్కో రుబియో భారత్ లో పర్యటించిన నగరాలు.. కోల్ కత్తా, ఆగ్రా, జైపూర్, న్యూ ఢీల్లీ !
మార్కో రుబియో భారత్ పర్యటనకి వచ్చింది క్వాడ్ (QUAD – INDIA, AMERICA, AUSTRALIA, JAPAN ) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి.

మార్కో రుబియో మొదట దిగింది కోల్ కత్తాలో! నేరుగా మదర్ థెరిసాకి చెందిన మిషనరీస్ అఫ్ ఛారిటీకి వెళ్లి పరామర్శించాడు. అటు నుండి చిల్డ్రన్ హోమ్ కి వెళ్లి అక్కడి సిస్టర్స్ తో మాట్లాడాడు. అక్కడి నుండి నేరుగా న్యూ ఢిల్లీ చేరుకున్నాడు మార్కో రుబియో!

మొదట మదర్ థెరిసా ఇంటికి వెళ్ళినప్పుడు చుట్టూ భద్రతా అధికారులు, విలేఖరులు ఉండడంతో ప్రైవసీ లేకపోవడంతో చిల్డ్రన్ హోమ్ కి వెళ్ళినప్పుడు సిస్టర్స్ తో మాట్లాడి ఏదో సందేశం ఇచ్చాడు మదర్ థెరిసా ఇంట్లో ఉండేవాళ్లకి చేరవేయమని. మార్కో రుబియో చిల్డ్రన్ హౌస్ నుండి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళాడు న్యూ ఢిల్లీకి రావడానికి. మార్కో రుబియో ఇటు విమానాశ్రయానికి వెళ్ళగానే చిల్డ్రన్ హోమ్ నుండి సిస్టర్స్ నేరుగా మదర్ థెరిసా హోమ్ కి వెళ్లి రుబియో సందేశాన్ని అక్కడి సిస్టర్స్ కి చేరవేయడం మీడియా కవరేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయింది.

FRCA .2 బిల్లు వల్ల నిధులు ఆగిపోతాయానే భయంతో మార్కో రుబియో మదర్ థెరిసా హోమ్ కి వెళ్లాడా?
విషయం వేరే ఉంది!
FRCA -2 బిల్లు ఆమోదం పొందితే అనాధలకి అందే సహాయం ఆగిపోతుంది అనేది అబద్ధం!
గత ఏడు దశబ్దాలుగా వేల కోట్ల రూపాయలు పశ్చిమ దేశాల నుండి భారత్ లోకి వచ్చాయి కానీ పేదరికం పోయి ధనవంతులు అయ్యారా?
నిజానికి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి!

FCRA 2 బిల్లు హడావిడిగా లోక్ సభలో ప్రవేశపెట్టబడలేదు. ఇరాక్, లిబియా, ఇరాన్ లలోలాగా డబ్బుతో కృత్రిమ ఉద్యమాలు సృష్టించి మోడీ చేత రాజీనామా చేయించాలనే ఉద్దేశ్యం ఉంది చైనాకి. అమెరికాకి చైనా నుండి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి, అమెరికన్ ఉత్పత్తులు చైనా కొనాలి.
మోడీ పదవిలో ఉన్నంతవరకు బలూచిస్తాన్, JoPK ల సమస్య అలా నిత్యం వార్తలలో ఉంటూనే ఉంటాయి!

చైనా, అమెరికాలు కలిసిపనిచేస్తున్నాయి అనడానికి సాక్ష్యాలు……
April 18, 2026, బెంగుళూరు కేంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం..
8.అమెరికా కేంద్రంగా పనిచేసే ‘తిమోతి ఇనిషియేటివ్ ’ (The Timothy Initiative ) సంస్థ కి చెందిన మికా మార్క్ ( Micah Mark ) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు బ్యూరో అఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు.
9.మికా మార్క్ గురుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED ) అంతకు ముందే లుక్ ఔట్ నోటీస్ లు ఇచ్చి ఉండడం వలన బెంగుళూరు విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి ED కి అప్పచెప్పారు.

10. మికా మార్క్ దగ్గర 24 డెబిట్ కార్డులు దొరికాయి ED కి. అన్ని డెబిట్ కార్డులు ‘ట్రూస్ట్ బ్యాంక్ ’ అమెరికా ( Truist Bank, USA ) కి చెందినవి.
11.మికా మార్క్ ని అరెస్ట్ చేసిన తరువాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో సోదాలు నిర్వహించింది ED.
12. ED నిర్వహించిన సోదాలలో దొరికిన మొత్తం 1000 విదేశీ డెబిట్ కార్డుల ద్వారా 92 కోట్ల 55 లక్షల రూపాయలు విత్ డ్రా చేశారు!
13.డెబిట్ కార్డులు ఒకే ఒక్క పేరుతో జారీ చేయబడ్డాయి అది ‘ సంతోష్ కుమార్ ’.

14.నవంబర్ 2025 నుండి ఏప్రిల్ 2026 ల మధ్య 92 కోట్ల 55 లక్షల రూపాయలు ATM ల నుండి నగదు విత్ డ్రా చేశారు!
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ మొత్తం 6 గురిని అరెస్ట్ చేసింది, తిమోతి ఇనిషియేటివ్ (USA ) ని కూడా FIR లో చేర్చింది!
15. ED నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసినవారి పేర్లు…. జోనాథన్ S రాజన్, మికా మార్క్, అజిత్ వర్ఘిస్ మత్తయి, వర్ఘీస్ చాకో, బబ్లు కుర్మీ, సుప్రీం జాయ్ .

16. ED The Timothy Initiative ( TTI ) మాతృ సంస్థ అమెరికాతో పాటు భారత్ లో TTI కి అనుబంధంగా పనిచేస్తున్న NGO లని కూడా FIR లో చేర్చింది.
TTI , భారత్ లోని అనుబంధ NGO లు కలిసి Truist Bank, USA డెబిట్ కార్డుల ద్వారా విత్ డ్రా చేసిన డబ్బుని బెంగుళూరు నుండి నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అయిన ఛత్తిస్గడ్, అస్సామ్ ( బహుశా అస్సాం నుండి మణిపూర్ కి అయిండవచ్చు )లకి తరలించినట్లు ప్రాధమిక దర్యాప్తులో బయటపడ్డది!
లెఫ్ట్ వింగ్ మేధావులకి కూడా డబ్బు ముట్టి ఉండవచ్చు కానీ వివరాలు బయటికి రాలేదు!

నక్సల్ ప్రభావిత ప్రాంతాలకి అమెరికా కేంద్రంగా ఉన్న తిమోతి ఇనిషియేటివ్ అనే క్రైస్తవ మత ప్రచార సంస్థ డబ్బులు పంచడం చైనాని సంతృప్తి పరచడానికా?
లింక్ ఎక్కడ ఉంది అంటే రిపబ్లికన్ పార్టీ సెనేటర్స్ లలో 99% ఇవాంజలిస్టులే అంటే క్రైస్తవ మత ప్రచారకులు అని!

తిమోతి ఇనిషియేటివ్ సంస్థ అరెస్ట్ చేసేంత నేరం తమ మనుషులు చేయలేదని, బెయిల్ ఇవ్వమని పదే పదే కోరుతూ కర్ణాటక హై కోర్టులో పిటిషన్లు వేయడంతో విసిగిపోయిన హై కోర్టు TTI మీద లక్ష రూపాయల జరిమానా విధించింది!
కర్ణాటక హై కోర్టుకి ED చూపించిన ప్రాధమిక సాక్ష్యాలు అమెరికన్ బ్యాంక్ డెబిట్ కార్డ్ తో అక్రమంగా 92 కోట్ల 55 లక్షల రూపాయలు విత్ డ్రా చేయడమే కాక ఆ డబ్బుని మనీ లాండరింగ్ ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాలకి తరలించడం చూసి హై కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది!

TTI కి సంతోష్ కుమార్ పేరుతో 1000 డెబిట్ కార్డులు అమెరికన్ బ్యాంక్ ఇవ్వడం, ఆ కార్డులని ఉపయోగించి విదేశీయుడు మన దేశంలో వాడడం నేరం కాదుట!
CONTD….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!
  • ANR – VaniSri – తెలుగు వెండి తెరపై ఓ సూపర్ హిట్ పెయిర్ !
  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions