.
అక్కడికక్కడ ఓ నైన్టీ వేసుకుని వస్తారో, లేక ఒరిజినల్ గుణమే అది కావచ్చు… కొందరు సినిమా సెలబ్రిటీల (?)కు బుర్రలు దెబ్బతిని, నాలుకలు సరిగ్గా పలుకక, మేం బహిరంగవేదికలపై మాట్లాడుతున్నాం, లక్షల మంది చూస్తున్నారు అనే సోయి కూడా తప్పి ఏవేవో బూతులు మాట్లాడేస్తున్నారు…
చాలామంది ఇలాగే బూతులు వదులుతున్నారు, తరువాత సారీలు చెప్పి లెంపలేసుకుంటున్నారు… అంతా తూచ్, మేం అనేది అంటాం, తరువాత సారీ చెబుతాం అన్నట్టుగా… వీళ్లలో ప్రథముడు కమ్ అథముడు రాజేంద్ర ప్రసాద్… ఏదేదో కూస్తున్నాడు… చివరకు అమెరికా వెళ్లినా అదే భాష, అదే దరిద్రం…
Ads
అసలు తనను స్టేజ్ మీదకు ఎందుకు పిలుస్తున్నారు… ఈమధ్య నోరిప్పితే కంపు కదా… పైగా పద్మశ్రీ అట… ఆ పురస్కారమే సిగ్గుపడుతోంది ఇప్పుడు..! తనకు తాత, తననే స్పూర్తిగా తీసుకున్నట్టున్నాడు, అజయ్ ఘోష్ అనే నటుడు …
ఇరుముడి సినిమా ఫంక్షన్‌లో, ఒరేయ్ నాన్నా, అంత మంచి పవిత్రమైన పదం టైటిల్‌గా పెట్టుకున్నారు కదా, తండ్రీ బిడ్డల అనుబంధం ఎమోషన్ అని చెబుతున్నారు కదా… మరి ఆ సినిమా ఫంక్షన్‌లో ఇదేం దిక్కుమాలిన ప్రసంగంరా బాబూ…
‘‘రవితేజ మాస్ జాతర సినిమా షూటింగ్, అది తన సొంత పొలం, 26 ఎకరాలు, అప్పట్లో 12 లక్షలు, ఇప్పుడది వందల కోట్లు, ఇదే అడిగితే రవితేజ ఒరేయ్ వెర్రి పు-, ఇది ఇలాగే ఉంటుంది, మనమే పోతాం, పనిచేయాలిరోయ్ అన్నాడు’’ అని ఏదో భజన, కీర్తన ప్రసంగం, అందులో ఈ పువ్వు… అంతేకాదు…
రెచ్చిపోతూ ‘‘హిట్టూ ఫట్టూ, ఇవన్నీతీసి అవతల దెం-వోయ్’’ అనీ ఏదేదో కూస్తూ పోయాడు… రవితేజ నవ్వుతూ చూస్తుండిపోయాడు… తనూ అదే టైపు కదా… ఎందుకంటే, ఈ సినిమాలో నటించిన నక్షత్ర అనే అమ్మాయికి నువ్వేం నిక్ నేమ్ పెడతావు అనడిగితే… ముదురుముం- అని పెడతానని అన్నాడు… నీ భాష పాడుగాను…
యాణ్నుంచి వచ్చార్రా మీరంతా..? అని సగటు ప్రేక్షకుడు అందుకే తిట్టుకుంటూ ఉంటాడు… సరే, రాజేంద్ర ప్రసాద్ అనే సంస్కారిని కాసేపు వదిలేస్తే… పద్దతిగా ఉన్నట్టు కనిపించే, కొన్నాళ్లుగా దారితప్పిన నాని కూడా అంతే… ఆమధ్య బాంచెత్ అనే పదాన్ని పదే పదే వాడాడు… అయ్యా, మరో సంస్కారి నాని గారూ, బాంచెత్ అంటే తెలుగులో నీయమ్మ, నీయక్క వంటి పరమబూతు పదమే నాయనా…
అదేదే మెచ్చుకోలు పదం అయినట్టు ఆహా ఓటీటీలో ఆమధ్య ఏదో సింగింగ్ షోకు అతిథిగా వెళ్లి అదే పదం వాడాడు… ప్యారడైజ్ సినిమా ట్రెయిలర్‌లో లంజకొడుకు అనే పదాన్ని విరివిగా వాడారు కదా, చేయి మీద పచ్చబొట్టు కూడా పొడిచి ఉంటుంది, దాన్ని మెచ్చుకుంటూ ఓదెల శ్రీకాంత్ ఓ ట్వీట్ కొట్టాడు ‘బాంచెత్ ఏం కొట్టావురా’ అంటూ… ఏడాది క్రితం…
ది గ్రేట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా అంతే… కింగ్‌డమ్ సినిమా అనుకుంటా… ‘వానెక్క, మనల్ని ఏ నాకొడుకూ ఆపేదేలే’… అని కూశాడు ఓ బహిరంగ వేదికపై… వానెక్క అంటే కూడా బాంచెత్, నీయక్క అనే బూతు పదమే… ఆ సోయి లేదా విజయ్‌కు… మరెందుకీ కుసంస్కారం..? టీవీల్లో, మీమ్స్‌లో, రీల్స్‌లో ఓ వాక్యం పదే పదే వినిపిస్తూ ఉంటుంది… రేయ్, ఎవుర్రా మీరంతా…!!
Share this Article