.
మొన్న నటి అనుపమ పరమేశ్వరన్ ఏం చెప్పింది..? ‘‘వాడిని ప్రేమించాను, కానీ నాకు రెండేళ్లుగా నరకం చూపించాడు… మానసికంగా, శారీరకంగా బాగా దెబ్బతిన్నాను… వాడు ఓ అపరిచితుడు, అప్పుడే రెమో, అప్పుడే రాము, అప్పుడే మస్తు మంచివాడిలా కనిపిస్తాడు, వెంటనే ఓ సైకో అవుతాడు…
ఆ నార్సిస్టిక్ పీడన నుంచి ఎట్టకేలకు బయటపడ్డాను, ఒక దశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి, ఇప్పుడిక బ్రేకప్, నాకిప్పుడు పెద్ద రిలీఫ్, హమ్మయ్య’’ ఇదే కదా ఆమె చెప్పింది… ఎవరు అతను..? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే… హీరో విక్రమ్ కొడుకు ధ్రువ.., తను కూడా హీరోయే… అనుపమ, తను కలిసి సినిమా చేశారు కూడా…
Ads
అసలు ఏమిటి వీళ్ల కథ..? తండ్రి హీరో విక్రమ్ చేసిన అపరిచితుడు సినిమా ఎంత బ్లాక్ బస్టరో తెలుసు కదా, అందులోని తన పాత్రకు ఉన్న మానసిక లక్షణాన్ని Dissociative Identity Disorder (DID) అంటారు. పూర్వం దీనిని Multiple Personality Disorder అనేవాళ్లు… ఒకే వ్యక్తిలో ఇద్దరు పరస్పర భిన్న పోకడలున్న వ్యక్తులు ఉండటం, సందర్భాన్ని బట్టి బయటపడటం!
సేమ్, విక్రమ్ కొడుకు ధ్రువ నిజజీవితంలో అదే టైపు అని అనుపమ సూత్రీకరించేసింది… అసలు ధ్రువ, విక్రమ్ కుటుంబం ఏమిటో ఓసారి చూద్దాం… (నిన్న ఇండియాటుడే కాంక్లేవ్‌లో ధ్రువ మాట్లాడుతూ ‘నా వ్యక్తిగత జీవితంపై జరిగే చర్చ నాపై ప్రభావం చూపదని చెప్పలేను అని స్పందించాడు…)
– ధ్రువకు ఓ సోదరి, పేరు అక్షత… ఈమె తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మునిమనవడిని పెళ్లి చేసుకుంది…
– ధ్రువ తాత వినోద రాజు కూడా సినిమా పిచ్చోడే, రామనాథపురం నుంచి చెన్నైకి పారిపోయి వచ్చి, చిన్నాచితకా పాత్రలు చేసుకునేవాడు… తనను చూసి తమ్ముడు త్యాగరాజన్ కూడా వచ్చి చేరాడు, తనూ సినిమాల్లో విలన్ వేషాలు వేసేవాడు…
– ఈ త్యాగరాజన్ కొడుకు ప్రశాంత్, తను కూడా తమిళ హీరో… వినోద రాజు పెద్ద కొడుకే విక్రమ్, అంటే, ధ్రువ తండ్రి… సో, మొత్తం ఆ కుటుంబం అంతా తమిళ ఇండస్ట్రీయే…
విక్రం ధ్రువను అమెరికన్ ఇంటర్నేషన్ స్కూల్‌లో చదివించాడు… స్కూలింగులోనే ధ్రువకు సినిమా చాన్సులు వచ్చినా విక్రం వద్దన్నాడు, తరువాత లండన్ వెళ్లిన ధ్రువ మ్యూజిక్ అండ్ ఫిలిమ్ మేకింగు కోర్సు చేశాడు… ఏవో షార్ట్ ఫిలిమ్స్ చేశాడు కానీ నువ్వు హీరోవు మాత్రమే కావాలని ధ్రువను న్యూయార్క్ లో ఉన్న ప్లీజ్ స్టార్ట్ వర్క్ థియేటర్‌లో యాక్టింగ్ కోర్స్‌లో జాయిన్ చేశాడు…
ఇండియాకు వచ్చాక మాంచి సబ్జెక్టుతో కొడుకును గ్రాండ్‌గా లాంచ్ చేయాలనుకున్నాడు… విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డినే రీమేక్ చేయించాలని అనుకున్నాడు, మొదటి దర్శకుడు బాలా సరిగ్గా తీయలేకపోతే ఇక దర్శకుడిని మార్చి, టైటిల్ మార్చి,, హీరోయిన్‌ను మార్చి, సీన్లు మార్చి, దాదాపు పూర్తయిన సినిమాకు రిపేర్లు చేయించాడు…
ఇది తన కెరీర్… ఫ్లాప్ హీరో ఏమీ కాదు… మొదట్లో తన మొదటి మూవీ హీరోయిన్ బనిత సంధూతో పరిచయం, ప్రణయం, ఇక పెళ్లి చేసుకుంటారు అన్నంతగా అల్లుకుపోయారు… కానీ ఎప్పుడైతే బైసన్ మూవీలో అనుపమతో యాక్ట్ చేశాడో, అప్పటి నుంచీ ఆమెవైపు అట్రాక్టయ్యాడు… ఇది చూసి బనిత నాలుగేళ్ల రిలేషన్‌ను బ్రేక్ చేసింది, తనను వదిలేసింది…
ఇక అనుపమతో డేటింగు, పబ్లిక్ కిస్సులు, రేపోమాపో ఎంగేజ్‌మెంట్, పెళ్లి అనుకునే దశలో… ఆమె ఇవన్నీ బయటపెట్టి ధ్రువను బజారుకీడ్చింది… (ధ్రువకన్నా అనుపమ పెద్దది వయస్సులో)… (సో, ఒక రీల్ అపరిచితుడి కొడుకు రియల్ అపరిచితుడు… బాధితురాలు అనుపమ… కానీ ఆమె చెప్పిందంతా నిజమేనా..? ఈ డౌట్ తమిళ ఇండస్ట్రీలో చాలామందికి ఉన్న సందేహం)…
Share this Article