Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!

August 23, 2026 by M S R

.

అనసూయకు హేమ భలే తగులుకుంది.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు!  వివాదం లేకుండా అనసూయ అస్సలు ఉండలేదు… ఏదో ఒకటి గోక్కోవడం, వివాదాల తెరపై ఉంటూ, పబ్లిసిటీ పొందడం అలవాటే కదా… ఎవరైనా ఏమైనా అంటే పెద్ద నోరేసుకుని పడిపోతూ ఉంటుంది… ఆ నోటికి భయపడి కావచ్చు, ఎహె, ఆమె నోట్లో నోరు పెట్టడం దేనికనే భావన కావచ్చు, పెద్దగా ఆమెను కౌంటర్ చేయరు చాలామంది…

నవ్వి లేదా జాలిపడి వదిలేస్తుంటారు… కానీ ఎప్పుడూ అలా ఉండదు కదా, ఈసారి నటి హేమ తగులుకుంది… తను కూడా బడబడా మాటలు వదిలే రకమే కదా… అనసూయకు మంచి కౌంటర్ పంచులు వేసే కేరక్టర్ దొరికింది అన్నట్టుగా ఓ వీడియోలో అనసూయకు ఎడాపెడా క్లాస్ పీకింది…

Ads

అనసూయ తెలిసీ తెలియని జ్ఞానంతో ‘జై శ్రీరామ్’ నినాదం, సనాతన ధర్మంపై ఏవో వ్యాఖ్యలు చేసింది… ఆ డీపీలు పెట్టుకుని, ఆ పోస్టులు వాళ్లంతా దాడులు చేసేవాళ్లే అన్నట్టుగా ఏవో కామెంట్లకు దిగింది… చాలామంది తిట్టిపోసేసరికి… ఎప్పుడూ తను కేసులు పెడుతూ ఉంటుంది కదా, ఈసారి తన మీదే పోలీసులకు ఫిర్యాదు వచ్చింది… (అఫ్‌కోర్స్, ఆమెపై కేసు నమోదు చేయరు, కారణాలేమిటో తెలియదు)…

అయ్యో, ఈసారి కథ ఎదురుతన్నేట్టుగా ఉంది అనుకున్న అనసూయ వెంటనే, నో, నో, నా ఉద్దేశం అది కాదు, నేనన్నది అందరినీ కాదు అని ఏదో వివరణ ఇచ్చుకునే విఫల ప్రయత్నం చేసింది… ఇప్పుడు హేమ రంగంలోకి వచ్చింది… దమ్ముంటే, తెలివి ఉంటే, ఆ కొందరి పేర్లు బయటపెట్టి విమర్శించు, అంతేతప్ప ఏకంగా శ్రీరాం మంత్రాన్నే కించపరుస్తావా అంటూ దాడి స్టార్ట్ చేసింది…

View this post on Instagram

అనసూయ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ రెండో వీడియోలో వివరణ ఇచ్చింది కదా. తాను హనుమంతుడి భక్తురాలినని, శ్రీరాముడి పేరును కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ఆన్‌లైన్‌లో వేధిస్తున్న కొందరినే ఉద్దేశించి మాట్లాడానని చెప్పింది కదా… కానీ అప్పటికే మాట బయటికి వెళ్లిపోయింది. వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది కదా…

ఇక్కడే హేమ ఎంట్రీ ఇచ్చి…  ‘మనమంతా అద్దాల మేడల్లో బతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాటను ప్రజలు భూతద్దంలో చూస్తారు. అలాంటప్పుడు ఎందుకు పదేపదే మాట జారుతావు?’ అంటూ అనసూయకు హితవు పలికింది… ఇది సాధారణ సలహా కాదు. నేరుగా గుండెల్లోకి దూసుకు వెళ్లే కౌంటర్.

అసలు హేమ చెప్పిన పాయింట్‌లోనే ఈ పంచ్ మొత్తం దాగి ఉంది. ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ఇబ్బంది పెడితే.. వారిని నేరుగా ప్రశ్నించవచ్చు. వారి పేర్లు చెప్పవచ్చు. చట్టపరంగా ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఆ కోపాన్ని దేవుడి పేరు, దేవుడి ఫొటోలు, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపెట్టడం ఎందుకన్నదే ప్రశ్న.

anasuya

అందులోనూ ‘జై శ్రీరామ్’ అనేది ఒక సాధారణ నినాదం కాదని హేమ చెప్పడం ఈ మొత్తం వ్యవహారంలో ఆమె మాటలకు బలం ఇచ్చింది. భక్తులకు అది ఒక నినాదం కంటే ఎక్కువ. భావోద్వేగం. విశ్వాసం. ఆరాధన. మంత్రం… హేమ వ్యాఖ్యల్లో అత్యంత పదునైన మాట మరొకటి.

‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… మనుషులు చెప్పే మాటలకంటే ఈ ఒక్క వాక్యమే ఈ వివాదంలో ఎక్కువగా చర్చకు వస్తోంది. ఎందుకంటే ఎదుటివారిని హెచ్చరించడానికి కర్మను గుర్తు చేసిన హేమ.. ఒక రకంగా అనసూయకు ‘మాటలకు కూడా మూల్యం ఉంటుంది’ అనే మెసేజ్ ఇచ్చింది…

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది… హేమ కూడా ఎప్పుడూ కొలిచిమాట్లాడే నటి కాదు. తనకు అనిపించింది నేరుగా బడబడా చెప్పడం ఆమెకూ అలవాటే. వివాదాలు వచ్చినా వెనక్కి తగ్గని స్వభావం ఆమెది. అందుకే హేమ నుంచి వచ్చిన ఈ కౌంటర్ మరింత ఆసక్తికరంగా మారింది…

ఒక బడబడా కేరక్టర్‌కు మరో బడబడా కేరక్టర్ ‘కొంచెం ఆలోచించి మాట్లాడు’ అని బుద్దిచెప్పడం విశేషమే… హేమ చెప్పిన మాటల్లో ఒక వాస్తవం మాత్రం ఉంది. సినీ పరిశ్రమలో ఉన్నవారికి సాధారణ వ్యక్తుల కంటే మాటల ప్రభావం ఎక్కువ. వాళ్లు చెప్పే ఒక్క వాక్యం గంటల్లో లక్షల మందికి చేరుతుంది. ముఖ్యంగా మతం, దేవుడు, విశ్వాసం వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం.

అనసూయకు కూడా అదే సమస్య. ఆమెకు తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. తనను వేధించే వారిని ప్రశ్నించే హక్కూ ఉంది. కానీ ఒక మాట చెప్పిన తర్వాత అది ఎలా వినిపిస్తుంది? ఎవరిని తాకుతుంది? ఎలాంటి అర్థం వచ్చే అవకాశం ఉంది? అనే ఆలోచన కూడా అవసరం. ఆ సోయి ఉండదు అనసూయకు…

ఇప్పుడు బంతి అనసూయ కోర్టులో ఉంది. ఊరుకునే రకం కాదు… ఏం కౌంటర్ ఇస్తుంది, మళ్లీ హేమ ఇంకా బలంగా తగులుకోవడమూ గ్యారంటీ… చూద్దాం… కర్మ ఎవరిని ఎక్కడి దాకా తీసుకుపోతుందో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!
  • రేవంత్‌ రెడ్డిపై బహుముఖ కుట్ర ! జగన్ కూడా ఓ పాత్రధారేనా ?
  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions