Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో, నో – ఆ కోర్టు ఆర్డర్లు టాక్సిక్ రివ్యూలను అడ్డుకోలేవు… ఇదీ క్లారిటీ !!

August 27, 2026 by M S R

.

టాక్సిక్ సినిమా మీద వచ్చే నెగెటివ్ సమీక్షలకు కోర్టు చెక్ పెట్టిందని ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది… తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంటును ప్రచురించడాన్ని నిషేధిస్తూ బెంగుళూరులోని ఒక కోర్టు ‘జాన్ డో’ ఆర్డర్ జారీ చేసిందనేది ఆ వార్త సారాంశం… దీన్నే ‘అశోక్ కుమార్ ఆర్డర్స్’ అని కూడా అంటారు…

సినిమా నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ కోరిక మేరకు ఈ ఆర్డర్స్ జారీ అయ్యాయి… ఇంకేం, నెగెటివ్ రివ్యూలు రాస్తే బుక్ చేస్తారు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి… కొందరైతే జాన్ డో ఆర్డర్స్ అలియాస్ గాగ్ ఆర్డర్ అనీ రాసేస్తున్నారు… అన్నీ తప్పే… జానో డో ఆర్డర్స్ రివ్యూలను అడ్డుకోలేవు… తేడా చూద్దాం…

Ads

న్యాయ పరిభాషలో (Legal Terminology) John Doe order, Gag order అనేవి పూర్తిగా భిన్నమైన ఉద్దేశాలతో కోర్టులు జారీ చేసే రెండు వేర్వేరు ఆదేశాలు… రెండూ ఒకటి కాదు… చాలా స్పష్టమైన తేడా ఉంది…

1. జాన్ డో ఆర్డర్ (John Doe Order / Ashok Kumar Order) కాపీరైట్ ఉల్లంఘనలు (Copyright Infringement), పైరసీ లేదా ట్రేడ్‌మార్క్ దొంగతనాలను అడ్డుకోవడానికి ఈ ఆర్డర్‌ను ఇస్తారు. నేరానికి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరో కచ్చితంగా తెలియనప్పుడు (అజ్ఞాత వ్యక్తులు లేదా వెబ్‌సైట్ నిర్వాహకులు) ఈ ఆదేశాలు జారీ అవుతాయి. భారతదేశంలో వీటిని సాధారణంగా “అశోక్ కుమార్ ఆర్డర్స్” అని కూడా అంటారు.

ఉదాహరణకు, ఒక కొత్త సినిమా విడుదలకు ముందే పైరసీ వెబ్‌సైట్లు దానిని ఆన్‌లైన్‌లో లీక్ చేస్తున్నట్లయితే, ప్రొడ్యూసర్ కోర్టును ఆశ్రయించి ‘జాన్ డో’ ఆర్డర్ తెచ్చుకుంటారు. దీనివల్ల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) ఆ తెలియని వ్యక్తులు లేదా సైట్లు పైరసీ కంటెంట్‌ను షేర్ చేయకుండా బ్లాక్ చేయడానికి వీలవుతుంది.

తప్పు చేస్తున్న వ్యక్తులు ఎవరో ఖచ్చితంగా తెలియనప్పుడు, అజ్ఞాత వ్యక్తులపై (Anonymous Persons) చర్యలు తీసుకోవడానికి కోర్టు ఈ ఆర్డర్ ఇస్తుంది. Legal భాషలో పేరు తెలియని పురుషుడిని ‘జాన్ డో’ అని, స్త్రీని ‘జేన్ డో’ అని పిలుస్తారు.

థియేటర్లలో సినిమా సీన్లను చిత్రీకరించి, సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే… అది నిర్మాతకు నష్టం కలిగించేలా ఉంటే సదరు సర్వీస్ ప్రొవైడర్లు ఆ కంటెంటును తొలగించాల్సి ఉంటుంది, మరి గ్యాగ్ ఆర్డర్..?

toxic

2. గ్యాగ్ ఆర్డర్ (Gag Order) … సమాచార ప్రసారాన్ని లేదా బహిరంగ ప్రకటనలను నిరోధించడానికి, పరువు నష్టం జరగకుండా లేదా విచారణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు, సాక్షులు, లాయర్లు లేదా మీడియా సంస్థలపై కోర్టు లేదా ప్రభుత్వం ఈ ఆంక్షలు విధిస్తుంది…

ఒక హై-ప్రొఫైల్ కేసు విచారణ దశలో ఉన్నప్పుడు, ఆ కేసుకు సంబంధించిన వివరాలు, రహస్యాలు లేదా తీర్పును ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయకూడదని, లేదా ఎవరికీ ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని కోర్టు ఈ “నోరుమూయించే” (Gag) ఆదేశాలు జారీ చేస్తుంది…

అయితే ఈ ఆర్డర్లపై లీగల్ సర్కిళ్లలోనే పెద్ద చర్చ సాగుతోంది… ఏదీ రాయకూడదు, ఏదీ చెప్పకూడదు, ఏదీ జనంలోకి తీసుకుపోకూడదు అనేది రాజ్యాంగపరమైన కీలక భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధం, ఐనా పలు ధనిక కంపెనీలు, సెలబ్రిటీలు ఈ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారనే చర్చ నడుస్తోంది…

సో, జానో డో ఆర్డర్ రివ్యూలను అడ్డుకోలేదు… కాకపోతే సినిమా కాపీ రైట్‌ను ఉల్లంఘించే చర్యలను అడ్డుకుంటుంది… గ్యాగ్ ఆర్డర్ వేరు, టాక్సిక్ సినిమాకు ఈ ఆర్డర్లు ఏమీ లేవు..!! ఐనా ఓ చెత్త, రోత సినిమాపై మౌత్ టాక్‌ను కోర్టులు అడ్డుకోలేవు కదా… ఆ టాక్ టాక్సిక్ అనే ఓ విషచిత్రాన్ని బీభత్సంగా ఆల్రెడీ దెబ్బతీసేసింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో, నో – ఆ కోర్టు ఆర్డర్లు టాక్సిక్ రివ్యూలను అడ్డుకోలేవు… ఇదీ క్లారిటీ !!
  • ఆ పాటలోని తాత్వికత, వైరాగ్యం… సినారె, వేటూరి పట్టుకోగలిగారా ?!
  • డెడ్లీ కాంబో ! *ఆపరేషన్ గ్రేటర్ బంగ్లాదేశ్* కుట్ర విచ్ఛిన్నం !!
  • Nakshatra – ఈ మణెమ్మను అలా స్వచ్ఛంగా ఉండనివ్వండర్రా…
  • అప్పట్లోనే రాఘవేంద్రరావు కంట్రాక్టు పెళ్లిని చూపించాడు !!
  • వెకిలి రాఖీ యాడ్‌ను నగల కంపెనీ తీసేసింది ! ఎవరి పరువు పోయింది ?!
  • మతం మా విశ్వాసం – ఓనం మా సంస్కృతి – కేరళ కొత్త తరం అభిమతం !!
  • ఏమండోయ్ ఇది విన్నారా..? ష్, ఆ చెవి ఇటు పడేయండి ఓసారి..!!
  • Very Toxic – పక్కా విషస్వభావి – Not for Grown-Ups also !!
  • అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions