.
దిల్ రాజు… తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న నిర్మాత కమ్ ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ పాలసీ మేకర్ కమ్ ఫైనాన్షియర్, వాట్ నాట్..? ఎవరీ థింగ్..! ఒక సినిమా హిట్టో ఫ్లాపో చెప్పగలడు రిలీజుకు ముందే, సక్సెస్ ఫుల్ ప్రిడిక్టర్, సక్సెస్ ఫుల్ వ్యాపారి అనే పేరు… కానీ ఆ మబ్బుల్లో నుంచి నేలకు దిగొచ్చాడు…
అసలు టాక్సిక్ అనబడే మూడుంబావు గంటల టార్చర్, నైట్ మేర్ సినిమాను తను రిలీజుకు ముందు ప్రివ్యూ చూశాడా అనే డౌట్ వస్తుంది… ఓ పాన్ ఇండియా హీరో, వందల కోట్ల ఖర్చు, అయిదుగురు హీరోయిన్లు, ఫైట్లు, మన్నూమశానం అనేసరికి బోల్తాకొట్టాడా… దాదాపు 120 కోట్లకు కొన్నాడట… మటాష్… నష్టాల లెక్కలు వేసుకుంటున్నాడు…
Ads
ఈ టాక్సిక్ జనం నెత్తిన రుద్దిన అదే నిర్మాత వెంకట్ నారాయణ విజయ్ చివరి సినిమా జననాయగన్ తీశాడు కదా, అది దిల్ రాజుకు కొంత నష్టాల బురదను రుద్దింది… అంతకుముందు విజయ్‌తో తీసిన వారసుడు అంతే… సో, దిల్ రాజు బిగ్ షాట్స్ కోసం వెళ్తున్నాడు, మునుగుతున్నాడు… ఇప్పటికి ఎంత నష్టపోయోడో తెలియదు, తన అపారమైన సాధనసంపత్తిలో ఈ నష్టాలు జుజుబీ కావచ్చు…

- సో, ఇప్పుడిక పోగొట్టుకున్న ప్రతి పైసా రామాయణం ద్వారా సంపాదించాలని ఆలోచన… ఏకంగా 100 కోట్లకు అడుగుతున్నాడట ఆ తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం… 5 వేల కోట్ల సినిమా అని చూస్తున్నాడేమో గానీ అసలు నిర్మాణ వ్యయం అంత కాదు, అంతర్జాతీయ స్థాయి ప్రమోషన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గ్రాఫిక్స్, హాలీవుడ్ రిలీజ్ ఖర్చు, రెండు పార్టులు… అన్నీ కలిపి 5 వేల కోట్లు…
100 కోట్లు అనేది సేఫ్ బెట్ కాదు, రిస్కీ పందెం అనే అభిప్రాయాలున్నాయి… కానీ రీసెంటుగా రామాయణంలోని కొన్ని పార్ట్స్ 15 నిమిషాల క్యాప్సూల్‌లాగా మార్చి, సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు Chennaiలో జరిగిన Big Cine Expo 2026లో చూపించారట…. మొబైల్స్ ముందే తీసేసుకుని! హాలీవుడ్ రేంజ్‌లో ఉందని ఒకరిద్దరు సినిమా ప్రముఖ ఫైనాన్షియర్స్ అభిప్రాయపడ్డట్టు వార్తలొచ్చాయి…

- ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని విధంగా ఒంటికన్ను దైత్యుడు (One-eyed daitya), ఎలుగుబంటి లాంటి ఒక విచిత్రమైన పాత్రకు సంబంధించిన గ్రాఫిక్స్ విజువల్స్ ఈ 15 నిమిషాల ఫుటేజ్‌లో చూపించారట… అదిరిపోయాయట… ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ (The Lord of the Rings) స్థాయి భారీతనంతో ఉందని ఆ క్యాప్సూల్ చూసిన వాళ్ల అభిప్రాయం… గుడ్…
సో, దిల్ రాజు అందుకే అంత ఆసక్తి చూపిస్తున్నట్టున్నాడు… ప్రజెంట్ ట్రెండ్ పురాణాలు… అందుకే హొంబలే ఫిల్మ్స్ తీసిన యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ కూడా బోలెడు డబ్బు ఆర్జించింది… సో, రామాయణం మీద కూడా చాలామందికి ఆశలున్నాయి…

- ఎందుకోగానీ కేజీఎఫ్, కాంతార వంటి భారీ హిట్లు తీసిన హొంబలె ఈమధ్య వెనకబడ్డట్టు కనిపిస్తోంది… కానీ వెంకట్ నారాయణకు చెందిన కేవీఎన్ దూసుకుపోతోంది… ఈ టాక్సిక్‌ల్ యశ్ కాళ్లూవేళ్లూ పెట్టి చెడగొట్టాడు తన కేజీఎఫ్ హ్యాంగోవర్‌తో… స్క్రిప్టులో ఉన్నాడు, సహనిర్మాత కూడా… హీరో..! ఇప్పుడు నేల మీద పడ్డాడు హఠాత్తుగా… రామాయణంలో కూడా సహనిర్మాత..! ఆదుకోవాల్సింది, నిలబెట్టాల్సింది అదే..!
అన్నట్టు ఇదే కేవీఎన్ చిరంజీవితో కాకా, అక్షయ కుమార్- సైఫ్ ఆలీ ఖాన్‌తో హైవాన్, మరో భారీ కన్నడ చిత్రం నిర్మిస్తోంది… పెద్ద పైప్ లైన్… అదే బెంగుళూరు బేస్డ్ హొంబలె, కేవీఎన్ ఈ రేంజుకు చేరుకోవడం మీద ఈడీ కన్ను కూడా ఉన్నట్టు చెబుతున్నారు… సరే, ఆల్ ది బెస్ట్ దిల్ రాజూ..!! ఫర్ రామాయణ !!
Share this Article