.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చీ, అధికారం పొందలేక, దొర దెబ్బలకు కకావికలైన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడమే ఓ అపురూపం… దొరా, ఇక చాలు అని తెలంగాణ సమాజం యావత్తూ తనను తిరస్కరించి, కుర్చీ దింపేయడం మరో అపురూపం… తరువాత కాంగ్రెస్ పార్టీ అయి ఉండీ 1000 రోజులు సజావుగా ప్రజాపాలన సాగడం ఇంకో అపురూపం…
నచ్చింది… అడ్డదిడ్డం డిజైన్లతో లక్ష కోట్లు గోదావరిలో పోసిన కాళేశ్వరాలు లేవు… కాలం చెల్లిన సబ్ క్రిటికల్ భద్రాద్రి ప్లాంట్లు లేవు… ఫార్ములా వన్ నుంచి అడ్డగోలు కబ్జాల దాకా అక్రమాల్లేవు… గొర్లు, బర్లు, చేపలు, మిల్లులు… సమాజంలోని ప్రతి రంగాన్ని అవినీతితో పొల్యూట్ చేసిన పోకడల్లేవు… సచివాలయం వెళ్లకుండా రోజుల తరబడీ సీఎం అంతర్ధానమైన రోజుల్లేవు… నేను పీఎం అవుతానహో అనే గాలిలో మేడల్లేవు… చెబుతూ పోతే 1000 అక్రమాలు, అబద్ధాలు, అరాచకాల ఉదాహరణలు…
Ads
మరి ఇప్పుడు… రోజుకొకటి… ఫ్రీ బస్సు, సన్నబియ్యం, బోనస్ ప్రైస్, ఫ్రీ కరెంటు, సబ్సిడీ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, పెరిగిన పింఛన్ల దగ్గర నుంచి భవిష్యత్తును దర్శించే ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ ప్రక్షాళన, ఆర్ఆర్ఆర్ దాకా అనేకం… ఇవేవీ దొరకు ఆలోచనల్లోకి కూడా రాలేదు… అన్నీ కాదు గానీ… మచ్చుకు కొన్ని చెప్పుకుందాం…
పాలకుడికి సంకల్పం ఉండాలి, ఆ సంకల్పంలో దరిద్రం ఉండకూడదు… అది చెప్పడానికే ఇది… ప్రత్యేకించి సీఎం పోస్టులో ఉన్నవాడు ఎంతసేపూ క్షుద్ర రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పడానికే ఇది… ప్రణాళికలు, విజయాలు… కొన్ని ఉదాహరణలు…
– 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరిక; దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం… ఇది పక్కాగా ప్రభుత్వ పనితీరుకు సూచిక…
– రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ; రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అమలు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు…
– వరి సాగు, ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి దేశంలో నంబర్–1గా తెలంగాణ. గత యాసంగిలో 81 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు…
– తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ, ఇందిరా సౌర గిరిజల వికాసం కింద 2.10 లక్షల గిరిజన రైతులకు ప్రయోజనం…
– తెలంగాణ వరప్రదాయినిగా తుమ్మడిహెట్టిపై ప్రణాళికలు, ప్రయత్నాలు… 4.5 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజీ…
– మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ, పెట్రోలు బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వంటి ఆదాయ వనరుల కల్పన…. 15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డుల జారీ…
– తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం. హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణం…
– సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ. కేసీయార్ కలలో కూడా ఆలోచించలేదు… బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం; కేంద్రానికి సమర్పణ…
– పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి… ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లక్ష్యంతో 105 స్కూళ్ల మంజూరు… ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం….
– ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం… ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం….
– యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు… 65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడం…
– రాజీవ్ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు…. గోషామహల్‌లో2,000 పడకల నూతన ఉస్మానియా… సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం. అల్వాల్, ఎల్బీనగర్‌లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు… తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం; మరో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం…
– అక్రమాల ధరణి స్థానంలో భూభారతి… 8 వేల ఇంటిగ్రేటెడ్ మహిళా శక్తి భవనాలకు శ్రీకారం. ఆర్ఆర్ఆర్ సహా రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల అభివృద్ధి… హైదరాబాద్ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణ ప్రణాళిక. హైదరాబాద్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణ.
– మూసీ పరిధిలో 39 కొత్త ఎస్టీపీల నిర్మాణం. 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరిక… హైదరాబాద్‌లో 355కిపైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు; 2026లోనే మరో 40 కొత్త కేంద్రాలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం…
– ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి అధికారిక గౌరవం. తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ వరకు చెబుతూ పోతే అనేకం… ఖచ్చితంగా దొరలపాలనకు భిన్నమైన పాలన ఇది..!!
Share this Article