Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…

September 3, 2026 by M S R

.

ఒకాయన అడిగాడు, అబ్బే, సీపీఐ నారాయణ కాదులెండి… ఈ బిగ్‌బాస్ విజేతలకు జీవితంలో ఆ ట్రోఫీతో ఫాయిదా ఏమైనా ఉంటుందా అని..! మంచి ప్రశ్న… నిజాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఫాయిదా ఈజ్ జీరో…!

బయట రేటింగు కోసం, వోట్ల కోసం నానా గడ్డీ కరిచి, సోషల్ మీడియా టీమ్స్ మెయింటెయిన్ చేసి, ఖర్చు పెట్టాలి కంటెస్టెంట్లు… విజేత అయ్యేంతవరకు నానా చావూ తప్పదు… తీరా సెకండ్, థర్డ్ ప్లేసులో ఉన్నోడు బిగ్‌బాస్ దిక్కుమాలిన స్కీమ్‌ ప్రకారం సగం తనే ఎత్తుకుపోతే (సొహెయిల్ తరహాలో) విజేతకు మిగిలేది హళ్లికిహళ్లి…

Ads

ఆ టాక్సులు మన్నూమశానం, సోషల్ మీడియా మెయింటెనెన్స్ ఖర్చు పోను మిగిలేది నాలుగు జ్ఞాపకాలు, ఒక ట్రోఫీ… కాకపోతే కంటితుడుపుగా స్టార్ మా రియాలిటీ షోలకు పిలుస్తారు, తోచింది చేతిలో పెడతారు, బట్, విజేతలకే కాదు, మెయిన్ కంటెస్టెంట్లు అందరికీ ఈ సౌలభ్యం ఉంటుంది…

పాపం, ఈ క్రేజుతో గతంలో బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసి, మస్తు సంపాదించి, ఇళ్లు కూడా కట్టేసుకున్నారు కొందరు, ఇప్పుడు అదీ లేదు… ఏవేవో ఇన్‌స్టా రీల్స్ చేసుకుని లేదా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ పెట్టుకుని చిల్లర ఏరుకోవడమే…

సరే, ఇప్పటివరకు అయ్యాయి… మధ్యలో ఓటీటీ లేడీ విజేత బిందుమాధవి… తను సినిమా నటి, ఇప్పుడు ఇదే బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్‌కు, జెమినిలో మాస్ జాతర అనే కామెడీ షోకు జడ్జి… అంతే, వేరే చాన్సులే లేవు పాపం… (రెగ్యులర్ షోలలో లేడీ కంటెస్టెంట్లను విజేతల్ని చేయరు… శ్రీముఖి దగ్గర నుంచి శోభాశెట్టి, మొన్నటి తనూజ వరకూ అంతే…)

రెగ్యులర్ షోలకు వస్తే ఫస్ట్ విజేత శివ బాలాజీ… అంతకుముందు తెరపై అప్పుడప్పుడూ కనిపించేవాడు… బిగ్‌బాస్ గెలిచక అవీ కరువయ్యాయి… ఏమో, తమిళంలో ఏమైనా చేస్తున్నాడో తెలియదు గానీ తెలుగులో కనిపించడం లేదు పాపం…

BB10TELUGU

కౌశల్ మందా… తనకు ఓ ఆర్మీ, పెద్ద హడావుడి, ఏమైంది..? ఏమీ లేదు… ప్రస్తుతానికి ఎక్కడా కనిపించడం లేదు… తరువాత రాహుల్ సిప్లిగంజ్, అప్పటికే తను సింగర్, బిగ్‌బాస్‌తో వచ్చింది అదనంగా ఏమీలేదు… ఆస్కార్ దాకా పోవడానికి ఇదేమీ ఉపయోగపడలేదు, ఈమధ్య ఏదో కేసులో ఇరుక్కున్నట్టున్నాడు…

అభిజిత్, తనకూ వచ్చిందేమీ లేదు, ఈ సీజన్ అగ్నిపరీక్షకు జడ్జిల్లో తనూ ఉన్నాడు… వీజే సన్నీ, అనుకోకుండా విజేత… అవో ఇవో సినిమా చాన్సులు అన్నాడు గానీ వర్కవుట్ అయింది లేదు, తను తెరపై ప్రముఖంగా కనిపించిందీ లేదు… తరువాత సింగర్ రేవంత్… తనకూ దక్కిన ప్రైజ్ మనీ తక్కువే… విజేతగా నిలిచినా తనకు తన ప్రొఫెషన్‌లో ఫాయిదా లేదు, ఆ దక్కిన కాసింత ప్రైజ్ మనీ తప్ప…

పల్లవి ప్రశాంత్… ఇదో విఫల చరిత్ర… రైతు బిడ్డగా ఫోకసయ్యాడు, గెలిచాడు, గెలిచి బయటికి వచ్చాక తన టీమ్ బస్సులపై, ఇతర కంటెస్టెంట్ల కార్లపై రాళ్లతో దాడులు చేశారు, పక్కా అసాంఘిక శక్తులుగా… కేసులు పడ్డాయి, తిరుగుతున్నాడు… రైతులకు ఏమీ ఇచ్చింది లేదు హౌజులో చెప్పినట్టుగా… పెద్దగా చెప్పుకోవడం కూడా వేస్టున్నర…

నిఖిల్… తెలుగు టీవీ సీరియళ్ల నటుడు… బిగ్‌బాస్ ట్రోఫీతో కొత్తగా నాలుగు సీరియళ్లు వచ్చింది లేదు, ప్రియురాలు కావ్యతో బ్రేకప్‌తో బదనాం కూడా అయ్యాడు… మొన్నటి సీజన్ విజేత పడాల కల్యాణ్, కామనర్… గెలిచాక మళ్లీ పెద్దగా ఎక్కడా కనిపించలేదు… సో, ఏతావాతా తేలిందేమిటి..? బిగ్‌బాస్ ట్రోెఫీ ఎందుకూ పనికిరాదు..!! అదీ అసలు రియాలిటీ !!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…
  • Dear You – రూపాయి పెడితే 150 రూపాయలు – గ్లేసియర్ బ్రేక్ బస్టర్ !!
  • ఇది మునుపటి ఇండియా కాదు ! రెండు బలమైన తాజా తార్కాణాలు !!
  • నెహ్రూకు ఓ ఆదివాసీ భార్య… ఆమెది కలిచివేసే ఓ విషాద కథ…
  • ప్రశాంత్ రెడ్డి ! అంతటి కేసీయార్‌కే హితవు చెప్పేంత ‘పెద్దరికమా !?
  • ఎడారిలో దారితప్పిన ఓ మనిషి… దూరంగా కనిపిస్తున్న ఓ శిథిల గుడిసె…
  • గడీ పాలన నుంచి ప్రజాపాలన దిశలో… చెప్పుకోదగిన ఈ 1000 రోజులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions