Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !

September 3, 2026 by M S R

.

అభినందన్ వర్దమాన్… గుర్తున్నాడా..? మిగ్ ఫైటర్ నడిపిస్తూ పాకిస్థాన్‌లో కూలిపోయి, పాక్ ఆర్మీ చేతుల్లో  చిక్కి, తరువాత విడిపించబడిన పైలట్… ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు మళ్లీ… ఈసారి సాహసం, దేశభక్తి ఎట్సెట్రా పదాల్లో కాదు… ఎయిర్‌ఫోర్స్ వదిలేసి, ఓ కమర్షియల్ పైలట్‌‌గా మారిపోవడంపై!!

దేశం కోసం… ఓ జెట్ ఫైటర్ నడిపించడంలో ఆ మీసాలకు పౌరుషపు మెరుపు ఉంటుందా..? ఓ వ్యాపారాత్మక విమానం నడపడంలో ఆ జోష్, ఆ అడ్రినలిన్ రష్, ఆ కీర్తి ఉంటుందా..? డిబేటబులేనా..? తను మాత్రం ఎయిర్‌ఫోర్స్ వదిలేశాడు…  43 ఏళ్లకే గ్రూప్ కెప్టెన్ హోదా నుంచి రిటైర్ అయిపోయాడు స్వచ్ఛందంగా… 22 ఏళ్ల సర్వీస్ నుంచి…

Ads

సీనియర్ మిలిటరీ అధికారులు 40 ఏళ్లు దాటగానే సాహసోపేత ఆపరేషన్ల నుంచి లేదా కాక్‌పిట్ విధుల నుంచి తప్పుకుని తమ మార్గాన్ని మళ్లించుకుంటారని అంటారు, అభినందన్ కూడా అదే ఎంచుకున్నాడని అంటారు కానీ… నిజానికి ఒక గ్రూప్ కెప్టెన్‌కు ఫ్లయింగ్ బ్రాంచ్ అయితే 54 ఏళ్ల వరకు, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ అయితే 57 ఏళ్ల వరకూ సర్వీసులో ఉండొచ్చు…

ఎయిర్ వైస్ మార్షల్ (Air Vice Marshal) 58 సంవత్సరాలు, ఎయిర్ మార్షల్ (Air Marshal) 60 సంవత్సరాలు, ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) 62 సంవత్సరాలు (లేదా 3 సంవత్సరాల పదవీకాలం, ఏది ముందైతే అది)…

తమ కనీస అర్హత సేవా కాలం పూర్తి చేసుకున్న తర్వాత, సివిల్ రంగాలు లేదా కమర్షియల్ ఏవియేషన్‌లోకి మారడానికి ముందస్తు పదవీ విరమణ (Premature Retirement) పొందే వెసులుబాటు కూడా ఉంది…

అభినందన్ గోవా కేంద్రంగా ఉన్న FLY91 సంస్థలో చేరాడు… ఎందుకు కమర్షియల్ పైలట్..? 1) ఎక్కువ జీతం 2) పనితీరును బట్టి బోనస్ 3) కుటుంబానికి తక్కువ రేట్లు 4) నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్లయిట్ల డెస్టినేషన్లలో హోటల్ వసతి, మెరుగైన ప్యాకేజీలు 5) నిర్ణీత పనిగంటలు 6) కావల్సినంత విశ్రాంతి 7) పెద్దగా ఉండని పెత్తనాల బెడద 8) ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ టెక్నాలజీకి యాక్సెస్ 9) కుటుంబ జీవనంపై కాన్సంట్రేషన్ 10) రిలాక్స్ మోడ్… ఇలా బోలెడు…

ఐనా సరే, దేశ రక్షణ కోసం యుద్ధరంగంలో పనిచేయడంలో ఉన్న ఓ ఖదర్ మామూలు పైలట్‌గా ఉంటుందా..? ఎప్పుడూ డిబేటబులే..!! టిపికల్ వీరప్పన్ తరహా మీసాలు అలాగే ఉంచుతాడని మాత్రం అనుకోవద్దు… కమర్షియల్ ఫ్లయిట్ల పైలట్లకు డ్రెస్ కోడ్ వేరే ఉంటుందట!! గ్రూమింగ్ స్టాండర్డ్స్ పాటించాల్సి ఉంటుంది… చాలా ఎయిర్‌లైన్స్ కంపెనీలు పైలట్లు, సిబ్బంది క్లీన్-షేవ్ లేదా చక్కగా ట్రిమ్ చేసిన గడ్డంతో, ఒకే రకమైన ప్రొఫెషనల్ లుక్‌లో ఉండాలని స్పష్టమైన రూల్స్ పెడతాయి!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !
  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…
  • Dear You – రూపాయి పెడితే 150 రూపాయలు – గ్లేసియర్ బ్రేక్ బస్టర్ !!
  • ఇది మునుపటి ఇండియా కాదు ! రెండు బలమైన తాజా తార్కాణాలు !!
  • నెహ్రూకు ఓ ఆదివాసీ భార్య… ఆమెది కలిచివేసే ఓ విషాద కథ…
  • ప్రశాంత్ రెడ్డి ! అంతటి కేసీయార్‌కే హితవు చెప్పేంత ‘పెద్దరికమా !?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions