.
నిన్న అనాలోచితంగా కొండా సురేఖ మీడియాతో ఓ మాట చెప్పింది… ‘‘నన్ను తొలగించకపోతే నేనే రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేశాడు, వాళ్లకు నామీద యాక్షన్ తీసుకునే ఉద్దేశమే లేదు… రేవంత్ రెడ్డి బెదిరింపు కారణంగా, నన్ను తప్పించారు…’ ఇదీ ఆమె మాట…
ఆమె ఏదో రేవంత్ రెడ్డిని తక్కువ చేయటానికి ఈ మాట అని ఉంటుంది… కానీ అక్కడ క్లీన్ బౌల్డ్ అయింది… కాదు, ఇన్నిరోజులు ఆడుతున్న ఆటలో హిట్ వికెట్… చేజేతులా వికెట్ పోగొట్టుకోవడం..! ఆమె పరోక్షంగా రేవంత్ రెడ్డికి ఎనలేని క్రెడిట్ తెచ్చిపెట్టింది ఆ ఒక్క వ్యాఖ్యతో… వివరంగా చెప్పాలంటే..? (ఆమె వ్యాఖ్యలు నిజమేనని అనుకుంటే…)
Ads
1) అవసరమైతే నేను సీఎం పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను గానీ నా ఆత్మాభిమానాన్ని వదులుకోలేను అని ఓ సీఎం పోస్టులో ఉన్న నాయకుడు చెప్పడం అంటే మామూలు విషయం కాదు… సో, సురేఖ వ్యాఖ్య రేవంత్ రెడ్డికి మంచి క్రెడిట్ తెచ్చిపెట్టింది… ఏ పార్టీ అయినా సరే, సీఎం పదవి అనేది ప్రతి నాయకుడికి ఓ కల… దాన్ని కూడా ఇజ్జత్ కోసం వదిలేయడానికి సిద్దపడ్డాడు అని సురేఖ సర్టిఫికెట్ ఇచ్చినట్టయింది…
2) పదే పదే కాంగ్రెస్‌లో సీనియర్లు కావచ్చు, బీఆర్ఎస్ ప్రాపగాండిస్టులు కావచ్చు, అయిపోయింది, రేవంత్ పని అయిపోయింది, హైకమాండ్ వదిలేసింది, ఎవరూ టైమ్ కూడా ఇవ్వడం లేదు అని శుష్క ప్రచారం చేస్తుంటారు కదా… కాదు, నిజం కాదు అని హైకమాండ్ రేవంత్ చెప్పిన మాటకు నిర్మొహమాటంగా, నిష్కర్షగా వోకే చెప్పింది… హైకమాండ్ దగ్గర రేవంత్ మాటకు మంచి విలువ ఉంది అని కూడా సురేఖ మరో సర్టిఫికెట్ ఇచ్చినట్టయింది…
3) ఒకరిని చూసి మరొకరు తలలు ఎగరేస్తున్నారు కదా కాంగ్రెస్‌లో ఈమధ్య… సురేఖ బర్తరఫ్, చిన్నారెడ్డి తొలగింపుతో ఇక చాలా నోళ్లు మూతపడతాయి… రేవంత్ జోలికి పోతే నష్టపోతాం అనే భావన వస్తుంది, అదీ రేవంత్ రెడ్డికి అదనపు ప్రయోజనం… క్రమశిక్షణ అనే పెద్ద పదం అవసరం లేదు గానీ రేవంత్ రెడ్డిని గోకితే మనకే నష్టం అనే ఓ భావనను క్రియేట్ చేసినట్టయింది…
4) పార్టీలో సీనియర్ నాయకులు, మంత్రులకు కూడా ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డిని ఏం చేద్దాం అని అవకాశం కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే… ఇహ లాభం లేదు, ఈ టరమ్ మొత్తం రేవంత్ రెడ్డిని ఏం గోకినా వేస్ట్ అనే వాతావరణాన్ని క్రియేట్ చేసింది… ఇదీ రేవంత్ కే ఉపయోగకరం…
5) అన్నింటికీ మించి రాను రాను రేవంత్ చెబితే తప్ప టికెట్లు రావు, పదవులు రావు, నిలబడలేం అనే భావన కేడర్‌లో, నాయకగణంలో ఏర్పడింది… పార్టీ మీద మంచి పట్టు పెరగడానికి ఇది ఉపయుక్తం… రేప్పొద్దున కేబినెట్ విస్తరణ తీరు నచ్చకపోయినా ఎవరూ ఏమీ మాట్లాడలేని సిట్యుయేషన్ ఏర్పడుతుంది…
6) ఇది కాంగ్రెస్, ఏమైనా మాట్లాడొచ్చు అని నాయకగణంలో ఎవరైనా అనుకుంటే, అది భ్రమే అని అని హైకమాండ్ తేల్చిపారేసింది… పార్టీ మీద పట్టు సహజంగానే ప్రభుత్వం మీద పట్టుకు కూడా ఉపయోగం…
…… వెరసి కొండా సురేఖ ఎపిసోడ్ సీఎం రేవంత్ రెడ్డికి బహుముఖంగా ప్రయోజనకరం అయిపోయింది… నిజం చెప్పాలంటే, నిష్కర్షగా… నిజంగానే కొండా సురేఖ చెబుతున్నట్టు రేవంత్ గనుకె కాడి కింద పడేస్తే కాంగ్రెస్ పార్టీకి జరగబోయే నష్టం అంతా ఇంతా కాదు…
జగన్- కేసీయార్- బీజేపీ కలిసి ప్లే చేస్తున్న కుట్ర భగ్నమై… ఆ మూడు పార్టీల బాధ్యులు తెల్లమొహాలు వేశారంటారా..? అవుననే అనిపిస్తోంది… ప్రత్యేకించి ఫామ్ హౌజ్ దొర !! రేవంత్ రెడ్డి మొన్న కేసీయార్‌ను టార్గెట్ చేస్తూ ‘ఎహె రాజీనామా చేయి’ అని దాడికి దిగడం ఎందుకో అర్థమైంది కదా !! ఒక నిజం… ఎన్నికల ముందు నుంచి, ఈరోజు దాకా రేవంత్‌ను అంచనా వేయడం కేసీయార్ వల్ల కావడం లేదు !!!
చివరగా… మురళి మీసాలు తిప్పుతున్నాడు అంటూ బోలెడు కథనాలు… అది తన అలవాటు, అంతకుమించి చేసేదేమీ లేదు !! సీఎం కుర్చీలో ఉన్నది రోశయ్య కాదు… రేవంత్ రెడ్డి..!!!
Share this Article