Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏదీ వదలడు- పుల్ల ఐస్ కూడా అమ్మగలడు… కానీ దానికీ ఓ లెక్కుంది !!

September 4, 2026 by M S R

.

(  Gopu Vijay Kumar Reddy  ) … ప్రముఖ FMCG బ్రాండ్ యూనీలీవర్ సాధించలేనిది రిలయన్సు సాధిస్తుందా? దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఇండియన్ ఐస్ క్రీం మార్కెట్ నుండి HUL వైదొలగడం వెనుక బలమైన మార్కెటింగ్ కారణాలు ఉన్నాయ్. ముఖ్యంగా సప్లై చైన్, ఇన్ఫ్రా స్ట్రక్చర్.. దానికి బలమైన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి..

రెగ్యులర్ FMCGలో దాదాపు అన్ని కేటగిరీలో నెంబర్ వన్‌గా ఉన్న HUL తనే లాస్ట్ క్వార్టర్‌లో ఐస్ క్రీం బిజినెస్ మీద లాస్ వచ్చింది అని.. పోర్ట్‌ఫోలియోని చేంజ్ చేసింది. ఎందుకంటే ఐస్ క్రీం అనేది రెగ్యులర్ FMCG లాంటి ప్రోడక్ట్ కాదు, తయారీ నుంచి రవాణా, నిల్వ, అమ్మే వరకు ప్రత్యేక వనరులు కావాలి. అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి.

Ads

అలా అని ఐస్ క్రీం బిజినెస్ ఇయర్ మొత్తం ఉండేది కాదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 3 క్వార్టర్స్ లాస్‌లో ఉండే దందా. అందుకే తెలివిగా తప్పుకుంది. మరి అటువంటి మార్కెట్లోకి రిలయన్సు తన ట్రేడ్‌మార్క్ స్ట్రాటజీ అయిన 10 Rs ఫార్ములాతో (Jio 10 Rs రీఛార్జి, Campa 10 Rs బాటిల్) ఐస్ క్రీం మార్కెట్లోకి రావడం కొంచెం ఆశ్చర్యం కలిగించేదే కానీ…?

ambani icecream

Relianceకి ice creamలో అసలు advantage ice cream తయారు చేయడంలో కాదు; Campa, Independence లాంటి FMCG brandsతో ఇప్పటికే నిర్మించుకున్న distribution, retailer relationships, freezer infrastructure మీద మరో high-volume product categoryని ఎక్కించడంలో ఉంది. ఇది కొత్త business కంటే product expansion play…

స్వతహాగా ఐస్ క్రీం కేటగిరీ చాలా అన్- ఆర్గనైజ్డ్. అందుకే 10 Rs రేటుతో చిన్న ప్లేయర్ లా మార్కెట్ షేర్‌ని లాక్కునే ఎత్తుగడ… No 1 ప్లేయర్ అమూల్‌కి మిల్క్ ప్లస్ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూషన్ అడ్వాంటేజ్ ఉంది.  No 2 ప్లేయర్ అన్- సీజనల్ ప్రొడక్ట్ అని కాడి వదిలేసిండు.. ఇంకా మార్కెట్‌లో పెద్ద ప్లేయర్లు లేరు..

అలాగే రిలయన్సు పోటీ పాత ప్లేయర్స్‌తో కాదు.. భారత్‌లో ఒక్కో వ్యక్తి సంవత్సరానికి తినే ఐస్‌క్రీమ్ పరిమాణం ఇప్పటికీ ఒక లీటర్ కంటే తక్కువే. అంటే రిఫ్రిజరేషన్ సౌకర్యాలు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, ప్రజల ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ ఐస్‌క్రీమ్ వినియోగం మరింత పెరగడానికి భారీ అవకాశం ఉంది.

అది 150 కోట్ల గ్రోత్ మార్కెట్లో, ఒక్కసారి బయట దేశాలలో, అమెరికాలో సగటున ఒక వ్యక్తి 11 లీటర్ల ఐస్ క్రీం తింటే మన దగ్గర అది అర లీటరు. అర్థం అయ్యింది కదా.. బడే భాయ్ చోట ఐస్ క్రీం స్ట్రాటజీ.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏదీ వదలడు- పుల్ల ఐస్ కూడా అమ్మగలడు… కానీ దానికీ ఓ లెక్కుంది !!
  • మంధానా ! ఈ పేరులోనే ఏదో వైబ్ ! ఇద్దరూ ఇద్దరే… నేషనల్ క్రష్ !!
  • Konda Family – ప్రస్తుతానికి ఎటూ వెళ్లే దారి లేదు! ప్లాన్-బి సస్పెన్స్ !!
  • మరేమనుకున్నారు? చేతికీ పగలుంటాయి! దిక్కుమాలిన ఫాంటసీ!!
  • గణితంలో తిర్యగ్రేఖ – రాజకీయ గణితంలో కొండా సురేఖ !!
  • అన్నీ మంచి శకునములే ! తలనొప్పులూ తలెత్తుకునేలా చేశాయి !!
  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…
  • ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!
  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు
  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions