Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Konda Family – ప్రస్తుతానికి ఎటూ వెళ్లే దారి లేదు! ప్లాన్-బి సస్పెన్స్ !!

September 4, 2026 by M S R

.

సరే, కొండా సురేఖ వ్యవహారంలో ఒక ఘట్టం ముగిసింది… మంత్రి పదవి ఊడినా సరే, పార్టీని వదిలేది అని చెబుతోంది… పైకి అలా చెబుతున్నా సరే, ఏదో ప్లాన్-బి ప్రకారమే భవిష్యత్తు కార్యాచరణ ఉండనుందని అందరూ ఊహిస్తున్నదే… ప్రస్తుతానికి ఆమె ప్లాన్-బి ఎలా ఉండనుందో అంచనాల్ని కాసేపు వదిలేస్తే… ఒకవేళ వెళ్లాలనుకుంటే ఆమె ఎదుట ఉన్న ప్రత్యామ్నాయ పార్టీ ఏది..?

తాడూబొంగరాల్లేని జనసేన, ప్రజాశాంతి వంటి పార్టీలను వదిలేస్తే… ఫస్ట్ కనిపిస్తున్నది బీజేపీ… కానీ అనేక అవరోధాలుంటాయి… 1) కొండా కుటుంబ వ్యవహారశైలి బీజేపికి సూట్ కాదు.., బీజేపీ చట్రంలో వాళ్లు ఇమడలేరు… 2) రాజీనామా చేసి రమ్మంటారు అనుకుందాం, ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉంది, రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లే సీన్ ప్రస్తుతానికి లేదు, రీసెంట్ ఓ సర్వేలో ఆమెకు మరీ 11 – 12 శాతం వోట్లు వచ్చాయని ఓ సమాచారం…

Ads

3) ఫ్యామిలీ ప్యాకేజీ బీజేపీలో కుదరదు… రెండు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీ అనేది సాధ్యం కాదు… 4) అన్నింటికీ మించి ఇప్పటికే గ్రూపులుగా తన్నుకుంటున్నారు తెలంగాణ బీజేపీలో, హైకమాండే వదిలేసింది, చక్కదిద్దడం చేతగాక… కొండా ఫ్యామిలీ వస్తే మరో గ్రూపు, మరో కుంపటి… 5) ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు హేపీ… వాళ్లెవరూ ఆమెను కాంగ్రెస్‌లో కుదురుగా ఉండనివ్వరు ఇక… ఉపఎన్నిక వచ్చినా గరిష్ట స్థాయిలో ఆమె గెలుపును అడ్డుకుంటారు…

6) మరో ప్రధానాంశం… ఆమె బీజేపీలోకి వెళ్తే బీజేపీలో ఆల్రెడీ చాన్నాళ్లుగా బాగా వర్క్ చేసుకుంటున్న కొందరు నాయకులు బీజేపీని వదిలేసి బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ వైపు వెళ్తారు… నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి బహుశా కాంగ్రెస్‌లోకి వెళ్తారేమో… 7) వరంగల్ ఈస్ట్‌లో 3% ఉన్న BJP ని 30% vote share కి తీస్కొచ్చిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా Congress లోకి వచ్చేస్తాడేమో… 8) Parkala లో 1% ఉన్న bjp ని 20% కి తీస్కొచ్చిన ప్రసాద్ రావు కూడా బీజేపీలో కొనసాగడం సందేహమే…

అంటే… కొండా సురేఖను బీజేపీలోకి తీసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాస్తో కూస్తో పెరిగిన బీజేపీ వోట్లు కుదుపుకి గురవుతాయి, పాత నాయకులను వదిలేసుకున్నట్టు అవుతుంది… మరోవైపు మురళి ఫ్యామిలీ బీజేపీలో కుదురుగా ఇమడలేదు… సో, ఎలా చూసినా కష్టమే… మరి టీడీపీ..? సవాలే లేదు, అసలు దాని ఉనికే నామమాత్రం ఇప్పుడు… పైగా రేవంత్‌కు కోపమొచ్చే నిర్ణయం టీడీపీ తీసుకోదు ఇప్పట్లో…

వైసీపీ..? మళ్లీ తెలంగాణలో మూసేసిన దుకాణం తెరవాలనే ఆలోచనయితే జగన్‌కు ఉన్నట్టు చెబుతున్నారు… వారంలో రెండు రోజులు హైదరాబాదులో ఉంటాననీ అంటున్నాడట… జగన్‌కు అత్యంత సన్నిహితులు మురళి, సురేఖ… పాత వైఎస్ లెగసీ వోట్లు కూడా కొన్ని ఉంటాయి… కానీ గెలిపించేంత సీన్ లేదు… కాంగ్రెస్ వోట్లు చీల్చి బీఆర్ఎస్‌కు సాయపడటం తప్ప…

అలాంటప్పుడు బీఆర్ఎస్‌లోనే చేరితే..? ఇదీ ఓ చిక్కు ప్రశ్నే… ఏ పదవిలో లేని జీవన్‌రెడ్డిని  చేర్చుకున్నంత ఈజీ కాదు… ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని ఫైట్ చేస్తూ… తామే కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడం సులభసాధ్యం కాదు, అది బీఆర్ఎస్‌కే నష్టం… అందుకే ప్రస్తుతానికి ఏ నిర్ణయమూ ప్రకటించడం లేదు సురేఖ… ఆమె ప్లాన్-బి ఏమిటో తెలియాలంటే రాజగోపాలరెడ్డి తదితరులు మూవ్‌మెంట్స్‌పై స్పష్టత రావాలి… ఒకవేళ తను కోరిన మంత్రి పదవి ఇస్తే..? కథ మరింత రక్తికడుతుంది !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Konda Family – ప్రస్తుతానికి ఎటూ వెళ్లే దారి లేదు! ప్లాన్-బి సస్పెన్స్ !!
  • మరేమనుకున్నారు? చేతికీ పగలుంటాయి! దిక్కుమాలిన ఫాంటసీ!!
  • గణితంలో తిర్యగ్రేఖ – రాజకీయ గణితంలో కొండా సురేఖ !!
  • అన్నీ మంచి శకునములే ! తలనొప్పులూ తలెత్తుకునేలా చేశాయి !!
  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…
  • ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!
  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు
  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!
  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions