Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!

September 9, 2026 by M S R

.

‘‘భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆటలు…, తిరుపతి ముంతాజ్ హోటల్ స్థలం కేటాయింపు రద్దు ఓ బూటకం… అంతకంటే విలువైన భూముల్ని స్వర హోటల్ పేరిట అప్పగింత… దీనిపై న్యాయపోరాటం’’ …. ఇదీ భూమన కరుణాకర్‌రెడ్డి తాజా ప్రకటన…

ఏపీ పాలిటిక్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే… ప్రజల కళ్లకు గంతలు అలవోకగా కట్టేస్తారు, ఆ జనమే నవ్వుతారని కూడా ఆలోచించకుండా…! ఒక అధర్మారెడ్డి, ఒక భూమన, ఒక సుబ్బారెడ్డి తదితరుల హయాంలో తిరుపతి- తిరుమలను ఎంత భ్రష్టుపట్టించారో నేతి లడ్డూలు, పట్టు శాలువాలు సహా ఎన్నో అక్రమాలు నిరూపించాయి…

Ads

అంటే ఇక్కడ భూమన మాత్రమే బాధ్యుడని కాదు… జగన్ హయాం అని!! అసలు నిజం ఏమిటి..?  జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్ హోటల్ నిర్మించేందుకు భూమి కేటాయించి, Mumtaz Hotels Ltd. తో ఒప్పందం చేసుకున్నారు.

పేరులో మాత్రమే ముంతాజ్… దాంతో కొన్ని సంఘాలు గట్రా ఆందోళన చేశాయి, ఓ ముస్లిం హోటల్‌కు భూకేటాయింపు ఏమిటంటూ..! నిజానికి ఈ Mumtaz Hotels ఒబెరాయ్ గ్రూప్‌కు చెందిన కంపెనీ. ఒబెరాయ్ గ్రూప్‌ను 1934లో రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్ స్థాపించాడు, ఇప్పుడు ఆయన కుటుంబమే నడుపుతుంది…

కానీ Mumtaz అనే పేరు ఉందని, దానికి మతం అంటగట్టి, తిరుపతి పవిత్రత, హిందువుల మనోభావాలు అంటూ రాద్ధాంతం చేశారు. తిరుపతిలో ప్రైవేటు హోటల్స్ లేవా..? కానీ చంద్రబాబు డీల్ చేసే విధానాలు వేరు కదా… తన ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చింది…

దీంతో ఒబెరాయ్ తిరుపతి వదిలి ఏమీ పారిపోలేదు… కొత్తగా Svara Hotels పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి, హిందూ పేరు పెట్టి, వేరే ప్రదేశంలో కొత్త హోటల్ కోసం కొత్త MOU చేసుకుంది… దటీజ్ చంద్రబాబు, దటీజ్ ఒబెరాయ్…

ముంతాబ్ పేరుతో జరిగిన భూకేటాయింపులు జగన్ హయాంలోనే కదా జరిగాయి, అప్పుడు కూడా భూమన జగన్ పార్టీలోనే కదా ఉన్నది, తిరుపతి వ్యవహారాలన్నీ తను, చెవిరెడ్డే కదా చూసుకున్నది… మరిప్పుడు అదే గ్రూపుకి చంద్రబాబు భూమిని వేరేచోట కేటాయిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు..? న్యాయపోరాటం దేనికి..?

సమస్య ముంతాజ్ అనే పేరా..? భూమి ఇస్తున్న ప్రదేశమా..? భూకేటాయింపా..? ఇక్కడ బేసిక్ ప్రశ్న… వాడెవడో హోటల్ కట్టుకుంటానంటే అది వ్యాపారం… దానికి ప్రభుత్వం భూమిని ఎందుకు కేటాయించాలి..? ఏపీలో ఎడాపెడా భూముల్ని కేటాయిస్తున్నారు, అడ్డికిపావుశేరు తరహాలో… అందుకని ఒబెరాయ్‌ను ఎందుకు వదులుకుంటారు…

సో, పేరు మార్చారు… మరోచోట భూమి ఇచ్చేశారు… జగన్, చంద్రబాబు బోత్ ఆర్ సేమ్… అదే గ్రూపు, అదే వ్యాపారం, జస్ట్, ముంతాజ్ నుంచి స్వర అని పేరు మారింది, అంతే తేడా… అప్పుడు అధికారంలో ఉన్న భూమన ఇప్పుడు వ్యతిరేకిస్తాడు… అప్పటి ఆందోళనల్ని గమనంలోకి తీసుకున్న చంద్రబాబు మాత్రం పేరు మార్చుకొమ్మని చెప్పి, అదే గ్రూపుకి, అదే వ్యాపారానికి కొత్తచోట భూమి ఇస్తాడు… అంటే టైటిల్ మారింది, సినిమా అదే… కథ అదే… నిర్మాత ఒకడే…



ఇప్పుడు మొత్తం కథను ఒకే లైన్లో చూస్తే… 

.

2021
జగన్ ప్రభుత్వం → 20 ఎకరాలు → Mumtaz Hotels/Oberoi

⬇️

2024 నవంబర్
టీటీడీ బోర్డు → “పవిత్ర భూమి, కేటాయింపు రద్దు చేయాలి”

⬇️

2025 ఫిబ్రవరి
హిందూ సంస్థల ఆందోళనలు → మతభావోద్వేగం

⬇️

2025 మార్చి
చంద్రబాబు → “ముంతాజ్ భూమి రద్దు”

⬇️

2025 జూలై
టీటీడీ → ప్రత్యామ్నాయ భూమికి ఆమోదం

⬇️

2025 ఆగస్టు 7
ప్రభుత్వం → పాత 20 ఎకరాల కేటాయింపు అధికారికంగా రద్దు

⬇️

2025 ఆగస్టు 22
Investment Promotion Committee → కొత్త ఏర్పాటుకు ముందడుగు

⬇️

2026
ప్రభుత్వ పత్రం → “Oberoi (Revised Allotment) – Tirupati” → 100 rooms → ₹250 కోట్లు.



మరి చివరికి మారింది ఏమిటి?

కంపెనీ కాదు.
పెట్టుబడిదారు కాదు.
హోటల్ ప్రాజెక్టు కాదు.

మారింది భూమి లొకేషన్. అంతే… ముంతాజ్ హిందూ పేరు పెట్టుకుంది కాబట్టి హిందూ సంస్థలకు కూడా ఇక అభ్యంతరాల్లేనట్టేనా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!
  • అగ్రవర్ణ దురహంకార మనువాద శుష్క బాష్యాలూ డౌన్ డౌన్ !!
  • హమారా హైదరాబాద్… ఓ కొత్త ముఖం! ఐటీ, ఫార్మా దాటేసి డిఫెన్స్ హబ్!!
  • బుల్లెట్ల భయాన్ని వదిలి- కాశ్మీరంలో సినిమా మళ్లీ ప్రాణం పోసుకుంది!
  • డామిట్, స్కెచ్ అడ్డం తిరిగింది ! బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ బొక్కబోల్తా !!
  • పుట్టపర్తి మిస్టరీ ! ఏకంగా సాయిబాబాపైనే ఎక్కుపెట్టిన ఓ సినిమా !!
  • కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి అంతే – అవి అనూహ్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions