Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

KCR ‘మైల దారి’ … గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది !!

September 10, 2026 by M S R

.

అవును, అలవిమాలిన ఫ్రస్ట్రేషన్ కేసీయార్ అనబడే ఓ లీడర్‌ను పూర్తిగా దిగజార్చేస్తోంది… చరిత్ర కాలగతిలో చాలామంది పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారనే సోయి లేకుండా పోయినట్టుంది… ఒకప్పటి ఆయుత చండీయాగాల కేసీయార్ ఇప్పుడు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయి… క్షుద్రపూజలు, పిండప్రదానాలు, పసుపు నీళ్ల శుద్ది వంటి మధ్యయుగాల ఫాసిస్ట్, ఆటవిక ధోరణిలోకి ప్రవేశించినట్టు కనిపిస్తోంది…

దక్షిణాచారం నుంచి వేగంగా వామాచారంవైపు… ఓ ధార్మికుడు మరింత వేగంగా మంత్రాలు, తంత్రాల తంతుల వైపు… దీపాలు, వత్తులు, కుంకుమల నుంచి నిమ్మకాయలు, పిండాల వైపు… పడిపోతున్న దశ కనిపిస్తోంది…

Ads

1. దళిత స్పీకర్‌ను తన అనుచరగణం లం-కొడుకు అని దూషించినా, పశ్చాత్తాపం ఎలాగూ ఎక్స్‌పెక్ట్ చేయలేం, కానీ ఈరోజుకూ తన నుంచి సారీ లేదు, ఖండన లేదు… అంటే పరోక్షంగా ఆ తిట్లను తను కూడా ఎండార్స్ చేస్తున్నట్టే కదా…

2. తన గడీ వద్దకు ఓ నిరసనగా దళిత నేతలు చావుడప్పులు మోగిస్తూ వస్తే… ఆ దారిని పసుపు నీళ్లతో శుద్ధి చేయించాడు… దొరహంకారం అనే పదం వాడటానికి ఏమాత్రం సందేహం అక్కర్లేదు ఇక్కడ… తన డీఎన్ఏ బయటికి వస్తోంది… మొత్తం దళిత సమాజాన్నే అవమానించడం ఇది…

కేసీయార్

3. నా చావు కోరుతున్నారు, అది బూతుల అసెంబ్లీ అంటూనే… తన అనుచరులు రేవంత్ రెడ్డికి సిరిసిల్లలో పిండప్రదానం పెడితే కిమ్మనడు… తన ప్రజాప్రతినిధులే ఏకంగా స్పీకర్‌నే బండబూతులు తిడితే చలనం లేదు… దీన్నే గంగ పూర్తిగా చంద్రముఖిగా మారడం అంటారు…

4. రాష్ట్రంలో కరవుకాటకాలు రావాలనీ, తద్వారా జనం రేవంత్ రెడ్డిని తిట్టిపోయాలని హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించాడని కాంగ్రెస్ ఆరోపణ… (వివాదం ఎన్‌హెచ్ఆర్‌సీ దాకా వెళ్లింది)…

5. కేసీయార్ అప్పుడే చెప్పాడు కదా… ఉద్యమపార్టీ కాదు, అహోబిలం మఠం కాదు, మాది ఫక్తు రాజకీయపార్టీ అని… ఈ క్షుద్రోపాసనలతో బీఆర్ఎస్ పార్టీని నిజంగానే యండమూరి రాసిన ఓ దార్కా, కాద్రాల బాటలోకి తీసుకుపోతున్నట్టున్నాడు వేగంగానే…

6. మహిళ ప్రజాప్రతినిధులను ముందుబెట్టి, పోలీసులను రెచ్చగొట్టి గాయిగత్తర లేపాలనే ప్రణాళిక కూడా క్షుద్రమే… నిజమో, అబద్దమో… సుస్మిత తిట్లు, సురేఖ ధిక్కారం వెనుక కూడా దొరవారి ఆలోచనలేనట…

…. ఉద్యమాలకు, పోరాటాలకు, సాహసాలకు, త్యాగాలకు అడ్డా తెలంగాణ… దాన్ని చివరకు ఈ స్థాయికి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ..! ఇప్పటివరకు గలీజు, రోత, జుగుప్స రాజకీయాలకు ఏపీ పాలిటిక్స్‌ పరాకాాష్ట అనుకుంటున్నాం కదా… తెలంగాణ రాజకీయాల్ని ఏపీ పాలిటిక్స్‌ను దాటించి, బురదబాటలో పరుగులు తీయిస్తున్నారు…

చొక్కాలు విప్పడం, పోలీసులపైనే దాడి, బూతులు దగ్గర నుంచి… చావు డప్పు బాట శుద్ధి దాకా… రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఓ ఉన్నత స్థాయి కమిటీతో విచారణకు రేవంత్ ఆదేశించాడు…

అబ్బే, దాంతో తేలేదేమిటి..? శిక్షించేది ఏముంటుంది..? ఇప్పటిదాకా బయటపడ్డ అనేక కేసీయార్ రేంజ్ అక్రమాలపై తనకు తెలంగాణ సమాజం వేసిన శిక్షలేమున్నాయి అంటారా..? పోనీ, కనీసం కేసీయార్ దళిత వ్యతిరేక ధోరణి, తన పాత గడీస్వామ్య పోకడలను తెలంగాణ జనానికి స్పష్టంగా తేటతెల్లం చేయడానికి ఉపయోగపడుతుంది కదా..!! అవునూ, బీఆర్ఎస్ పట్టిన ఈ మైల దారికి శుద్ధి ఎలా..? దేంతో !!

brs

  • మహిళా ప్రజాప్రతినిధులకు అవమానం పేరిట ఓ కుటిల ప్రణాళికను రచించి, ఓ సీన్ క్రియేట్ చేసి, గత్తర లేపుదామనుకుంటే… అది కాస్తా ఎలా ఎదురుతన్నిందంటే..? దెబ్బకు ఫుల్లు డిఫెన్సులో పడిపోయింది… ఏమీ సేతుర లింగా అనుకుంటూ… ఇదుగో ఇలా… మా దొరవారు దళితద్రోహి కాదు, ప్లీజ్ నమ్మండి అని పేజీల కొద్దీ కథనాలను సొంత కరపత్రంలో ముద్రించుకునేంత..! అలాగే దళిత ద్రోహి కాంగ్రెస్ అనే ముద్రలూ అచ్చుకొట్టారు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • KCR ‘మైల దారి’ … గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది !!
  • KBC … దేవియో ఔర్ సజ్జనో… బిగ్‌బీ ఇక సెలవు తీసుకుంటాడట !!
  • ‘‘అంత బిజీ అయితే- థియేటర్ వెళ్లి సినిమా ఎవడు చూడమన్నాడు’’
  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions