Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిడ్డ అడిగిన బర్త్‌డే గిఫ్ట్ … బడ్జెట్ లెక్కలేసి బావురుమన్న తండ్రి!

September 10, 2026 by M S R

.

బర్త్‌డే గిఫ్ట్ అడిగిన కూతురు… తండ్రి బడ్జెట్ చూసి గుండె పట్టుకున్నాడట! “బిడ్డా… బర్త్‌డేకి ఏం కావాలి?” ఓ మోస్తరు ధనిక తండ్రి ప్రేమగా అడిగాడు. “ఐఫోన్ కావాలి డాడీ…” “అదేం కొత్త కోరిక? ఆరు నెలల క్రితమే కదా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనిచ్చాను!”

“అది వద్దు డాడీ… పాతబడిపోయింది… ఇప్పుడు కొత్తది వచ్చింది కదా!” “18 ప్రో మ్యాక్సా?” “కాదు… ఫోల్డబుల్!” అక్కడితో ఆ తండ్రికి విషయం అర్థమైంది… ఈ గిఫ్ట్ ఖర్చు ఈసారి వాచిపోతోందని… చాలామంది ధనికుల ఇళ్లల్లో పిల్లలకు విలాసం, సంపద ప్రదర్శన, లెవల్ మెయింటెనెన్స్ అంటే ఇష్టం…

Ads

Apple తాజాగా తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను iPhone Duo పేరుతో తీసుకొచ్చింది. 7.6 అంగుళాల లోపలి స్క్రీన్, 5.4 అంగుళాల బయటి స్క్రీన్, టైటానియం డిజైన్, A20 Pro చిప్… అన్నీ కలిపి ఇది సాధారణ ఫోన్ కాదు, Apple ప్రపంచంలోనే ఒక చిన్న విలాస వస్తువు. భారత్‌లో దీని ధర 256 GBకి ₹2,99,900 నుంచి మొదలై, 512 GBకి ₹3,24,900, 1 TBకి ₹3,74,900, 2 TBకి ఏకంగా ₹4,49,900 వరకు వెళ్తుంది.

అయితే మన కథలోని అమ్మాయికి 256 GB ఎందుకు? “డాడీ… 2 TB తీసుకోండి. ఒకసారి కొంటే మళ్లీ మళ్లీ మార్చుకోవాల్సిన పని ఉండదు!” తండ్రి కాసేపు మౌనంగా ఉన్నాడు. “బిడ్డా… నీకు అంత స్టోరేజ్ ఎందుకు?”

“ఫొటోలు, వీడియోలు, రీల్స్, ట్రావెల్ మెమరీస్… భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలుసు డాడీ! ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ లోటు దేనికి?”  తండ్రి ఏదో చెప్పబోయాడు. “ఇంకో విషయం… ఫోన్ ఒక్కటే కాదు.”

“ఇంకేంటి?” “Apple Watch కూడా కావాలి.” అది కూడా సాధారణ Apple Watch కాదు. కొత్త Apple Watch Ultra 4. టైటానియం బాడీ, 49 mm డిస్‌ప్లే, కొత్త S11 చిప్, కొత్త హెల్త్ సెన్సర్లు, 50 గంటల వరకు సాధారణ బ్యాటరీ బ్యాకప్… Apple వాచ్‌లలో ఇదే అల్ట్రా ఎండ్.

“ఇంకా?” “AirPods.” “అవి ఇంట్లో లేవా?” “అవి పాతవి డాడీ!” కొత్త AirPods 5 తీసుకోవాలి. అది కూడా Wireless Charging Case ఉన్న వెర్షన్ అయితే ₹17,900.

“ఇంకా ఏమైనా?” “ఛార్జర్?” “ఫోన్‌తో రాదా? పాత అడాప్టర్ పనికిరాదా?” ‘‘నాన్నా కొంటే మొత్తం హైఎండ్ ఎకోసిస్టమ్ తీసుకోవాలి, అప్‌డేటెడ్ వేరియెంట్స్..’’

“హైస్పీడ్ ఛార్జింగ్ కోసం కొత్త 40W Dynamic Power Adapter తీసుకోవాలి. అది ₹4,490.” తండ్రి ఇప్పుడు కాలిక్యులేటర్ తీసుకున్నాడు. అమ్మాయి మాత్రం ఇంకా చెబుతూనే ఉంది… “టైటానియం స్క్రీన్ ప్రొటెక్టర్ కావాలి…” “సరే.” “హైఎండ్ ప్రీమియం కవర్ కావాలి…” “సరే.” “మంచి MagSafe యాక్సెసరీస్ కూడా…” “అది కూడా సరే.”

ఇప్పుడు తండ్రి ముఖంలో మాత్రం ఒక ప్రశ్న. “బర్త్‌డే నీదా? లేక Apple Storeదా?”

 

  • ఒక్క ఫోన్ కాదు… ఒక చిన్న Apple సామ్రాజ్యం!

    2TB iPhone Duo — ₹4,49,900

    Apple Watch Ultra 4 — సుమారు ₹1.10 లక్షల స్థాయి

    AirPods 5 with Wireless Charging Case — ₹17,900

    40W Dynamic Power Adapter — ₹4,490

    ఇక ప్రీమియం కవర్, స్క్రీన్ ప్రొటెక్షన్, MagSafe యాక్సెసరీస్ అన్నీ కలిపితే…

అమ్మాయి బర్త్‌డే గిఫ్ట్ బిల్లు సులభంగా ₹ 6 లక్షల దాకా వెళ్లిపోవచ్చు… అంటే ఒక కుటుంబంలో ఒక అమ్మాయి బర్త్‌డేకి ఇచ్చే కానుక విలువే ఒక చిన్న కారు ధరకు సమానం!

ఇక్కడ అసలు సరదా ఏమిటంటే… ఆ అమ్మాయి అడిగింది “ఫోన్” మాత్రమే. కానీ Apple ఎకోసిస్టమ్‌లో ఒక ఫోన్ కొంటే… వాచ్ కావాలి. AirPods కావాలి. ఛార్జర్ కావాలి. కవర్ కావాలి. స్క్రీన్ ప్రొటెక్టర్ కావాలి. MagSafe కావాలి. అంటే చివరకు మనం ఫోన్ కొనడం కాదు… ఒక బ్రాండ్‌కు చెందిన జీవనశైలినే కొనేస్తున్నాం!

ఇక తండ్రి చివరకు అడిగాడు… “బిడ్డా… ఈసారి బర్త్‌డేకి ఇంకేమైనా కావాలా?” అమ్మాయి నవ్వుతూ… “ఏమీ వద్దు డాడీ…” తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. “…వచ్చే ఏడాది మాత్రం Apple Vision Pro కొత్త మోడల్ వస్తే చూద్దాం!” తండ్రి వెంటనే కాలిక్యులేటర్ ఆఫ్ చేసి నిట్టూర్చాడు… 

కొందరికి డబ్బు ఏం చేసుకోవాలో, ఏం ఖర్చు పెట్టాలో కూడా తెలియడం లేదు… అమ్మాయి మళ్లీ చెప్పింది… అన్నట్టు డాడీ, ఐక్లౌడ్ స్టోరేజీ కూడా తీసుకుంటా, 12 టీబీ… డాడీ గుండెళ్లో రాళ్లు, రైళ్లు…

“ఫోన్‌లో 2TB ఉంది కదా?” అని అడిగాడు. “అది ఫోన్‌లో ఉంటుంది డాడీ… iCloudలో బ్యాకప్ కూడా ఉండాలి కదా!” తండ్రి అన్నాడు… “అంటే ఇంట్లో అల్మారా నిండా బట్టలున్నా… గోదాములో కూడా వాటి బ్యాకప్ పెట్టుకోవాలన్నమాట!” 12 TB iCloud plus AppleID — ₹7,500 నెలకు, అంటే ఏడాదికి ₹90,000…

ఏదైనా పల్లెలో నలుగురు పేదవాళ్లకు ఓ గూడు కట్టించి ఇవ్వవచ్చు అంటారా..? భలేవారే… Apple విలాసం చౌకగా రాదు కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సర్దార్-2 … మిషన్ పెద్దదే… కానీ ఇంజన్‌లో దమ్ములేదు – ఇది కార్తి టాక్సిక్ !!
  • ప్రతి కథా ఇరుముడి కాలేదు – మారెమ్మలా తుస్సుమనొచ్చు కూడా!!
  • బిడ్డ అడిగిన బర్త్‌డే గిఫ్ట్ … బడ్జెట్ లెక్కలేసి బావురుమన్న తండ్రి!
  • లడఖ్ మారుతోంది ! ప్రకృతి వనరుల్నే ఇంధనంగా మార్చుకుంటూ !!
  • టీవీ ఆఫ్ కాలేదు – వింటోంది, చూస్తోంది, రికార్డ్ చేస్తోంది… అన్నీ !!
  • జియోథర్మల్ పవర్ ! ఇండియాలో తొలి ప్రయోగం ! కొత్త ఎనర్జీ సోర్స్ !!
  • KCR ‘మైల దారి’ … గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది !!
  • KBC … దేవియో ఔర్ సజ్జనో… బిగ్‌బీ ఇక సెలవు తీసుకుంటాడట !!
  • ‘‘అంత బిజీ అయితే- థియేటర్ వెళ్లి సినిమా ఎవడు చూడమన్నాడు’’
  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions