.
మీడియాలో చాలా రూఢీ కాని వార్తలు వినిపిస్తుంటాయి… చాలావరకూ నిజాలే… అంతేనా..? మీడియాపై కూడా చాలా రూఢీ కాని వార్తలు వినిపిస్తుంటాయి… అవీ చాలావరకూ నిజాలే… తెలుగుదేశం మనిషిగానే ముద్రపడిన చాగంటి సతీష్ వాల్ మీద ఓ ఫోటో కనిపించింది… టీవీ9 పచ్చరంగులో మిలమిలమెరుస్తోంది…
అంటే, చెప్పకుండానే చెప్పేసినట్టు… టీవీ9 తెలుగుదేశం క్యాంపులో చేరిపోయింది అని..! సులభంగా అర్థమయ్యేట్టుగానే చెప్పబడింది… ఇదీ ఆ మార్ఫ్డ్ లోగో…
Ads

పార్టీల నడుమ నాయకులు జంపుతుంటారు, కామన్ అయిపోయింది ఇప్పుడు… నిన్నమొన్ననే కదా ఏపీలో ఎవరో శీనయ్య బలమైన బొత్స క్యాంపు వదిలేసి జై లోకేష్ మహారాజ్‌కీ జై అని జంపైపోయాడు… తెరవెనుక కథల గురించి ఇక్కడెందుకులే గానీ… నాయకులు అటూఇటూ జంపడం పెద్ద వార్త కాదిప్పుడు…
సేమ్, మీడియా కూడా కండువాలు మార్చుకోవడం కూడా పెద్ద విశేషమే కాదు… ఇదే టీవీ9 మొదట్లో కేసీయార్ క్యాంపు, తరువాత బీజేపీ, ఇప్పుడు టీడీపీ అనుకోవాలా..? ఏమోలే, వాళ్ల చానెళ్లు వాళిష్టం, ఏవో లెక్కలుంటాయి… దానికితోడు రజినీ మాయాజాలంతో బయటికి వెళ్లిన జర్నలిస్టులూ బోలెడు మంది అట…
అవునూ, ఈ పచ్చరంగు ఏమిటి అని ఆరా తీస్తే… పక్కా తెలుగుదేశం కేరక్టర్, పచ్చ జర్నలిస్టు ఇనగంటి వెంకట్రావు కొడుకు అనిల్ టీవీ9లో ఓ కీలకమైన బాధ్యతలో చేరాడట… అనిల్ మొదట్లో మహా న్యూస్ బాధ్యతలు చూసినా తరువాత అది అమ్మేసుకున్నాక తెలుగుదేశం బ్యాక్ ఎండ్ ఆఫీసులో టీడీపీ వీడియోలు, డిజిటల్ ప్రసారాల కీలకబాధ్యతల్లో ఉన్నాడు చాన్నాళ్లుగా…
తను టీవీ9లో చేరాడంటేనే చానెల్ విధేయతలోనో, పొలిటికల్ లైన్లోనో ఏదో భారీ తేడా వచ్చిందని లెక్క… అసలే పక్కా ధనిక వ్యాపారుల అడ్డా అది… పైగా ఇప్పుడు నడుస్తున్నది చంద్రబాబు జమానా కాదు, లోకేష్ బాబు జమానా…
తెలుగు మీడియా కంపెనీలన్నీ ఏదో ఒక పార్టీల ఓనర్షిప్ కింద లేదా ఏదో ఒక పార్టీ విధేయతతో పనిచేస్తున్నవే కదా… టీవీ9 ఏమీ నిష్పక్షపాత, పరిశుద్ధ, నిఖార్సైన కంపెనీ ఏమీ కాదు కదా… ఇవి చూస్తుంటే బిగ్‌టీవీ వార్తలు కనిపిస్తున్నాయి…
ఓ తెలంగాణ రెడ్డి గారి క్యాంపును హఠాత్తుగా వదిలేసి, నిష్పక్షపాతం అనే టాటూ వేయించుకుని, వెంటనే మరో ఏపీ రెడ్డి గారి క్యాంపులోకి చేరి లోకేష్ బాబు గారి డీఎస్సీ బాగోతాలన్నీ తవ్వి పోయడం ప్రారంభించింది… దెబ్బకు ఎక్కడో స్విచ్చులు నొక్కబడ్డాయి… ముగ్గురు నలుగురు జర్నలిస్టులు థూదీనెమ్మజీవితం అని నిట్టూరుస్తూ సదరు టీవీ చానెల్‌ను వదిలేసి బయటపడ్డారు…
సో, ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే… మీడియా కంపెనీలు కలర్ రహితాలు కావు… వాటికీ ఏదో ఓ పార్టీ కలర్ ఉండును… అవి సమయానుకూలంగా, తమ ప్రయోజనాల, పొలిటికల్ లెక్కలకు అనుగుణంగా కండువాలు మార్చుకుంటాయి… ఇదీ అసలు లెక్క..!!
Share this Article