Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం కేసీయార్ ! ప్లాన్ ఎదురుతన్ని తెలంగాణ సమాజంలో అభాసుపాలు !!

September 11, 2026 by M S R

.

ప్రతిపక్షాల కుట్రను బలంగా తిప్పికొట్టాం అంటున్నాడు రేవంత్… భేష్ అని భుజాలు చరుచుకుంటున్నాడు కానీ నిజం ఏమిటంటే… ప్రధాన ప్రతిపక్షం తను తీసుకున్న గోతిలో తను పడిపోయింది… నిజానికి కాంగ్రెస్ పార్టీని మనం హరాకిరీ పార్టీ అంటుంటాం కదా… ఎవరో హత్య చేయాల్సిన అవసరం లేకుండా తనే ఆత్మహత్య చేసుకుంటుందీ అనే భావనతో…

కానీ గత మూణ్నాలుగు రోజుల పరిణామాల్లో పక్కాగా బీఆర్ఎస్ స్వయంగా సూసైడల్ స్ట్రాటజీతో బొక్కబోర్లాపడింది… అసలే అది కిరికిరి పార్టీ… ఏదో గాయిగత్తర చేస్తుందని ముందస్తుగా అంచనా వేసి పోలీసు బలగాలను అసెంబ్లీ ఎదుట మొహరించారు… అక్కడి వరకూ వోకే… కానీ పాపం, ఎప్పుడూ పద్దతిగా, హుందాగా,, సంస్కారయుతంగా కనిపించే పాత కాంగ్రెస్ నెత్తురు సబిత, సునీతలను ముందుబెట్టి… ఏదో డ్రామాలు ఆడారు బీఆర్ఎస్ పెద్దలు…

Ads

brs

కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు… దాంతో ఇంకా టెన్షన్ రెయిజ్ చేయడానికి హరీష్ రావు షర్ట్ విప్పి పోలీసులపైకి విసరడం, కేటీయార్ పోలీసులను నెట్టేయడం ఎట్సెట్రా జరిగిపోయాయి… అసలే ప్లాన్ ఫెయిలైంది, ఫామ్ హౌజులో ప్లాన్ చేసిన పెద్ద దొర క్లాస్ పీకుతాడనే ఫ్రస్ట్రేషన్‌లో ఉండగా, ఆ మంటలో పెట్రోల్ పోసినట్టు తాతా మధు స్పీకర్‌ను లం- కొడుకు అని తిట్టడం, నవీన్ దుందుడుకు పోకడ…

బీఆర్ఎస్ అడ్డగోలుగా బుక్కయిపోయింది… వీళ్లకు ప్రచారం, మైలేజీ అనే యావ తప్ప మరేమీ పట్టదు అని జనంలోకి ఫుల్లు నెగెటివ్‌గా వెళ్లిపోయింది… ఎప్పుడైతే దళిత సంఘాలు చావుడప్పు ప్రోగ్రాం పెట్టాయో… ఇదంతా తన చరిత్రకే మైల పట్టినట్టు అవుతున్నదనే సోయి కేసీయార్‌కు కలిగి ఉండాల్సింది, కానీ దొరతనం తనను నోరువిప్పనివ్వలేదు…

brs

దీనికితోడు బీఆర్ఎస్ కేడర్ ఆ చావుడప్పు మోగిన బాటను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఫోటోలు, వార్తలు, వీడియోలు బయటికి రావడంతో బీఆర్ఎస్ మరింత కూరుకుపోయింది… బీఆర్ఎస్ అంటే దళిత వ్యతిరేకి అనే ముద్ర బలంగా పడిపోయింది… ఇక పీక్కోలేక, లాక్కోలేక… మీరు గమనించండి, ఈరోజుకూ కేసీయార్, కేటీయార్, హరీష్ రావు నోళ్ల వెంట దళిత సమాజానికి క్షమాపణ లేదు… అదే డీఎన్ఏ కదా…

ఇక పోలీసు కేసులు, ఎథిక్స్ కమిటీకి అప్పగింతలు, రెండు సభల్లోనూ చర్చలు… అధికార కాంగ్రెస్ అప్పుడు అందుకుంది చాన్స్… ఏకిపారేసింది… కానీ కేసీయార్ చావు కోరుకుంటున్నాం అని షాద్‌నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్య కాంగ్రెస్ క్యాంపు నుంచి బ్లండర్… అనాలోచితం…

కేసీయార్

పెద్ద జోక్ ఏమిటంటే..? బీఆర్ఎస్ పార్టీలోని దళిత నేతలు కూడా సభలో రేవంత్ చదివి వినిపించిన ఏదో ట్వీట్ ఓనర్ సంధ్యారావు అనే ఖాతా ఫేక్ అని రాద్దాంతం చేయడానికి ప్రయత్నించారు, నిజంగానే రేవంత్ టీమ్ బ్లండర్ అది… కానీ అసలు మా దళిత జాతిని మా పార్టీ అవమానించింది, మా అగ్రవర్ణ పెద్ద తలకాయలు ఈరోజుకూ క్షమాపణ చెప్పలేదనే సోయి ఏది ఆ బీఆర్ఎస్ నేతల్లో..?

ఎస్,  అరయగ కర్ణుడీల్గె అనేకుల చేతన్ అన్నట్టుగా బీఆర్ఎస్ రథం బురదలో కూరుకుపోయింది కదా… మరిక ఇది కాంగ్రెస్ చేసిన హత్యా, బీఆర్ఎస్ ఆత్మహత్యా..? మరొకటి గమనించాలి… నిన్న సోకాల్డ్ కేసీయార్ వారసులిద్దరూ ఫ్యూచర్ సిటీకి వెళ్లి, ఎవడైనా పెట్టుబడిదారు వస్తే బహుపరాక్ అన్నట్టు మాట్లాడటం అత్యంత గర్హనీయం…

రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే వద్దని బెదిరించిన పార్టీ బహుశా దేశంలో బీఆర్ఎస్ మాత్రమేనేమో… ఇవన్నీ వరుసగా బీఆర్ఎస్ పట్ల జనంలో ఏవగింపును పెంచుతున్నాయి… రేవంత్  చెప్పాడు కదా, ఫ్లాష్ సర్వే చేయించాను అని..! చేయించాడో, లేక ఓ ఝలక్ వదిలాడో తెలియదు గానీ, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగింది అనేది మాత్రం నిజం…

tpcc

వీళ్లకు రాజకీయాలు, రాద్దాంతాలు తప్ప హుందాతనం, రాజకీయ సంస్కారం లేవనే భావన జనంలో పెరిగింది… కానీ అప్పుడే అయిపోలేదు, పట్టు సడలొద్దు… ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు, క్రిమినల్ కేసులు పక్కాగా బిగించాలి… అవి చట్టసభ సభ్యులను ఓ నైతిక- బాధ్యాతయుత కట్టడిలో ఉంచేలా ఓ కఠిన సంకేతం కావాలి…

namaste

కానీ ఎటొచ్చీ రేవంత్ రెడ్డితో ఓ సమస్య, క్షమించేస్తాడు… ఆ క్షమాగుణంతోనే కదా ‘ఆ ముగ్గురు’ ఇప్పుడు ఇవన్నీ చేస్తోంది..? అన్నట్టు… ఏదో ఓ పత్రికలో చదివినట్టు గుర్తు, రేవంత్ ఫ్లాష్ సర్వే కాదు… ప్రస్తుత పొలిటికల్ స్థితిగతులపై ఏదో ప్రధాన పార్టీ సర్వే చేయిస్తే, కాంగ్రెస్‌కు ఎడ్జ్ కనిపించి, బీఆర్ఎస్ పట్ల జనం వ్యతిరేకత కనిపించి… సదరు పార్టీ పెద్దలు సామూహికంగా జుత్తు పీక్కున్నారట… ఆ పార్టీ ఏది..? ఆ సర్వే ఏం చెప్పింది..? (సమాచారం ఏమిటంటే ఫాఫం, నమస్తే తెలంగాణ చేయించిందట ఆ సర్వే… కళ్లు తేలేశారట ఫలితాలు చూసి)…

చెప్పనే లేదు కదూ… అసలే వర్గాల కుమ్ములాటల్లో ఉన్న బీజేపీకి అసెంబ్లీలో ఏం స్టాండ్ తీసుకోవాలో ఏకాభిప్రాయం లేదు… అష్టదిక్కులు… బీఆర్ఎస్‌తో దోస్తీ తప్పేట్టు లేదు, ఆ దోస్తీతో ఇప్పటి నుంచే జనంలో వ్యతిరేకత తప్పట్లేదు… ఫాఫం !!

talasani

మరీ కడాన… నవ్వొచ్చింది… తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటన ‘‘కాంగ్రెస్‌కు అంత ప్రేముంటే దళితుడిని సీఎంను చేయమనండి, మేం మద్దతునిస్తాం’ అని… దళిత సీఎం అని చెప్పి తెలంగాణ సమాజాన్ని దారుణంగా మోసగించింది తన బాస్ కేసీయార్… ఈరోజుకూ దళిత సమాజానికి సారీ చెప్పనిది కేసీయార్… పోనీ, సీనన్నా… ఓ సవాల్… బీఆర్ఎస్ పార్టీకి ఓ దళితుడిని అధ్యక్షుడిని చేయమని మీ బాస్‌కు సవాల్ విసురు…!! చేతనవుతుందా!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం కేసీయార్ ! ప్లాన్ ఎదురుతన్ని తెలంగాణ సమాజంలో అభాసుపాలు !!
  • సో, పిక్చర్ వెరీ క్లియర్… కన్నవాళ్లూ కసాయిలే ! 
  • నాయకులే కాదు – మీడియా కంపెనీలూ కండువాలు మార్చుకుంటయ్ !!
  • EPIC – బోల్డ్‌గా ఏదో చెప్పాలనుకుని- బోల్తాకొట్టిన కథాకథనాలు !!
  • వారమైనా కాలేదు – బిగ్‌బాస్ తిక్క ప్లానింగు – ఓ గట్టి కంటెస్టెంట్ ఔట్ !!
  • సినిమా బ్లాక్‌బస్టర్ ! హఠాత్తుగా కరోలీ బాబా ఇంటిపై పంచాయితీ !!
  • సర్దార్-2 … మిషన్ పెద్దదే… కానీ ఇంజన్‌లో దమ్ములేదు – ఇది కార్తి టాక్సిక్ !!
  • ‘‘పిరికి న్యాయమూర్తి అనిపించుకోవడంకంటే చావడానికే ఇష్టపడతాను’’
  • ప్రతి కథా ఇరుముడి కాలేదు – మారెమ్మలా తుస్సుమనొచ్చు కూడా!!
  • బిడ్డ అడిగిన బర్త్‌డే గిఫ్ట్ … బడ్జెట్ లెక్కలేసి బావురుమన్న తండ్రి!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions