Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బహుశా ఇలాంటి ‘ఘనత’ ప్రపంచంలో కేవలం కేసీయార్ పార్టీకే సాధ్యం !!

September 12, 2026 by M S R

.

నిజమే… ఎవరో మిత్రుడు ఆగ్రహంగా వ్యాఖ్యానించినట్టుగా..! తమ రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం తెలంగాణ ప్రయోజనాల్ని అడ్డుకునే పార్టీ బహుశా దేశంలో బీఆర్ఎస్ ఒక్కటేనేమో! పేరుకు వార్తల తెరపైకి వచ్చి లక్ష నీతులు చెప్పే కేటీయార్, హరీష్ రావు ఓ విధ్వంస రాజకీయాన్ని ప్లే చేస్తున్నారు!!

రాజకీయాల్లో గెలుపూఓటములు వస్తుంటాయి, పోతుంటాయి… కానీ ఏ రాష్ట్రమైనా సరే, తమ ప్రాంత ప్రయోజనాల దగ్గరకొచ్చేసరికి సంయమనాన్ని పాటిస్తాయి, విజ్ఞతను ప్రదర్శిస్తాయి… పెట్టుబడులు రావాలి, కంపెనీలు రావాలి, పది మంది ఉపాధి దొరకాలి అనే ప్రాధాన్యతను కనబరుస్తాయి… అది వివేచన, వివేకం కూడా..!

Ads

మాది ఉద్యమ పార్టీ అంటూ పదే పదే జైతెలంగాణ అని నినదించే బీఆర్ఎస్ (అంతకుముందున్న తెలంగాణ ఆత్మను పార్టీ పేరు నుంచే కత్తిరించుకున్న సూసైడల్ పార్టీ) తెలంగాణ, ప్రత్యేకించి హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం ఏమిటి..? అదీ తమ తర్కరహిత పొలిటికల్ ధోరణులతో..!

ఇదీ ఇప్పుడు తెలంగాణ సమాజంలో ప్రబలంగా వినిపిస్తున్న ప్రశ్న… నిజానికి ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు, సో వాట్..? మంచి సంకల్పమే కదా… దాన్ని రేవంత్ రెడ్డి అనే ప్రత్యర్థి కోణంలో ఎందుకు చూడాలి ఈ సోకాల్డ్ స్టేట్స్‌మెన్ హరీష్ రావు, కేసీయార్, కేటీయార్..? (స్టేట్స్‌మెన్ అంటే అదొక విస్తృ‌తమైన సబ్జెక్టు…)

కేసీయార్ మాట్లాడడు, ఈ రెండు గొంతులతో వినిపిస్తాడు తన ఎజెండాను, తన వామాచార రాజకీయాల్ని..! (మళ్లీ తన కుటుంబమే, ఇంకెవ్వడూ ఏమీ మాట్లాడొద్దు అనేది మరో డిబేటబుల్ పాయింట్)… హరీష్ రావు చెబుతాడు మేం అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అని…

ఈ ఇద్దరూ కలిసి ఫ్యూచర్ సిటీ ప్రతిపాదిత ప్రాంతాల్లో సంచరిస్తూ, ఎవడైనా ఇక్కడ పెట్టుబడులు పెడితే, ఏ కంపెనీ ఇక్కడికి వచ్చినా సరే, బహుపరాక్, ముందే ఆలోచించుకొండి అని బెదిరిస్తున్నారు… పక్కా తెలంగాణ వ్యతిరేక ధోరణి…

ఫాఫం… ట్రాజెడీ, ఐరనీ, పాథటిక్ ఏమిటంటే… ఇలా తెలంగాణ, హైదరాబాద్‌లోకి పెట్టుబడులకు మోకాలడ్డే ఈ పార్టీ ఇప్పటికీ తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటుంది… నిజానికి చంద్రబాబు దగ్గర నుంచీ తీసుకుందాం…

ఐటీపై తన కాన్సంట్రేషన్,, తన గొప్పతనం ఏమీ లేదు, హైదరాబాద్ మ్యాన్‌పవర్, జియో కండిషన్స్ అనుకూలించి చాలా కంపెనీలు వచ్చాయి… చంద్రబాబు గొప్పతనం ఏమీ లేకపోయినా, తను క్రెడిట్ తీసుకున్నా సరే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆ పెట్టుబడులను ఇలా బీఆర్ఎస్ తరహాలో అడ్డుకునే అనాగరిక, క్షుద్ర బెదిరింపులకు పూనుకోలేదు, సంయమనం పాటించాయి, దాన్నే విజ్ఞత అంటారు…

తరువాత వైఎస్ పీరియడ్‌లో హైదరాబాద్ మౌలిక వసతులు బాగా పెరిగి… లైక్ మెట్రో, గోదావరి వాటర్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు ఎట్సెట్రా… ఐటీ ఇంకా పెరిగింది… ఐనాసరే, ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడూ ఈ కేటీయార్, ఈ హరీష్ రావు దార్కా, కాద్రా రాజకీయం తరహాలో మోకాలడ్డలేదు…

రోశయ్య, కిరణ్ ఎట్సెట్రా వదిలేస్తే… ఇదే కేటీయార్ యాక్టింగ్ సీఎంగా తెలంగాణను ఉద్దరిస్తునన్ని రోజులూ కాంగ్రెస్ ఎప్పుడూ ఏ పెట్టుబడినీ వ్యతిరేకించలేదు… తరువాత ఫార్మా పెరిగింది… వర్తమానంలో హైదరాబాద్ డిఫెన్స్ పెట్టుబడుల అడ్డా… ఒక్కరోజులో సాధ్యం కాలేదు ఇది…

హైదరాబాద్ భౌగోళిక అనుకూలతలు… రేవంత్ రెడ్డి వచ్చినా ఆగలేదు, ఆగదు… పైగా దాన్ని మరింత గ్లోబలైజ్ చేయడానికి ఫ్యూచర్ సిటీ ప్రతిపాదించాడు… అక్కడ మండుతోంది బీఆర్ఎస్ ముఖ్యులకు… ఎవడైనా పెట్టుబడులకు ముందుకొస్తే బహుపరాక్ అని బెదిరిస్తున్నారు…

ఈ రాజకీయాన్నేనా తెలంగాణ సమాజం కోరుకుంది..? బీఆర్ఎస్‌ వామాచార తాంత్రిక, మాంత్రిక, క్షుద్ర పోకడల్ని పక్కన పెడితే… వేరే ఏ ఇతర పార్టీ ఇంత దారుణంగా ఆలోచించడం లేదు… ఇతర పార్టీలకు నైతికత, విజ్ఞత ఉన్నాయి కాబట్టే… ఒక హైటెక్ సిటీ, ఒక గచ్చిబౌలి, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఒక నియోపొలిస్, ఒక శంషాబాద్… నాలెడ్జ్ సిటీ సహా బోలెడు రూపుదిద్దుకున్నాయి..!!

ఈ నేల మాదిరో అని నినదించిన ఓ ఉద్యమ పార్టీ చివరకు ఎవడైనా ఇక్కడ పెట్టుబడులు పెడితే తాటతీస్తాం అని బెదిరిస్తున్న పార్టీ బహుశా ప్రపంచంలో ఇదొక్కటేనేమో..!! ఫాఫం కేసీయార్… ఆల్రెడీ దళిత వ్యతిరేక ధోరణి – తెలంగాణ ప్రయోజనాల వ్యతిరేక దొరతనం కూడానా..!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!
  • బహుశా ఇలాంటి ‘ఘనత’ ప్రపంచంలో కేవలం కేసీయార్ పార్టీకే సాధ్యం !!
  • డేటా సెంటర్లు వద్దు… కానీ AI ఫిల్టర్ల మోజు మాత్రం కావాలా?
  • పాకిస్థాన్ ప్రతీకార ఆశలపై నీళ్లు … గుమ్మరించింది ఇండియా కాదు, శ్రీలంక !!
  • చైత్ర ! బిగ్‌బాస్ పైత్యానికి బలి … 4 రోజులకే ఇద్దరు ఔట్ ఏమిట్రా !!
  • అతి పెద్ద మ్యూజిక్ లిటిగెంట్ – పాపం పద్మవిభూషణ్ పురస్కారం…
  • ప్చ్, సుమంత్‌కు మళ్లీ భంగపాటే – బహుశా అమ్మవారి శాపమేమో…
  • ఫాఫం కేసీయార్ ! ప్లాన్ ఎదురుతన్ని తెలంగాణ సమాజంలో అభాసుపాలు !!
  • సో, పిక్చర్ వెరీ క్లియర్… కన్నవాళ్లూ కసాయిలే ! 
  • నాయకులే కాదు – మీడియా కంపెనీలూ కండువాలు మార్చుకుంటయ్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions