.
2000 లావాదేవీ దాటితే యూపీఐ చెల్లింపు మీద చార్జ్… పేరుకు కేంద్రం ఏం చెబుతున్నా, వినియోగదారుడి మీద ఏమీ భారం లేదు, వ్యాపారులే చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నా, నెలకు లక్ష రూపాయల లావాదేవీలు లేని వ్యాపారులకు అదీ లేదని చెబుతున్నా… ఒక నిజం… ఏ వ్యాపారీ తన జేబు నుంచి ఏమీ పెట్టుకోడు…
ఏదో ఓరకంగా వినియోగదారుడిపైనే వేసేస్తాడు… అది వ్యాపార సూత్రం… ఆమధ్య వాణిజ్య సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో, చివరకు కర్రీ పాయింట్లు, ఛాట్ బళ్లలో కూడా రేట్లు పెంచారు… ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగినా రేట్లు తగ్గలేదు, తగ్గవు…. సేమ్, కరోనా సమయంలో అడ్డూఅదుపూ లేకుండా పెరిగిన మెడిసిన్స్ ధరలు మళ్లీ తగ్గలేదు… కేంద్రానికి ఓ నిఘా వ్యవస్థ లేదు, ఓ నిశిత విధానం కూడా లేదు…
Ads
సరే, 2000 దాటితేనే యూపీఐ బాదుడు కదా… సపోజ్, 10 వేల బిల్లు అయిందనుకుందాం ఏదో ఓ షాపులో… దాన్ని స్ల్పిట్ చేసి, రెండేసి వేలుగా చెల్లిస్తే..? అరె, ఇదేదో బాగుంది అనుకుంటున్నారా..? ఓసారి వివరంగా చెప్పుకుందాం…
అక్టోబర్ 15, 2026 నుంచి ₹2,000కు మించిన కొన్ని Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది… గరిష్ఠంగా ₹300 వరకు పరిమితి ఉంటుంది… వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే P2P లావాదేవీలకు ఈ ఛార్జీ ఉండదు… చిన్న వ్యాపారులకు కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి…
అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది… “వినియోగదారుడి నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయం. చార్జీ వ్యాపారే భరించాలి” అని ప్రభుత్వం చెబుతోంది. అంటే దుకాణదారుడు, హోటల్, వ్యాపారి తన జేబులోంచి ఆ డబ్బు చెల్లించాలన్నమాట…. కాగితంపై చూస్తే ఇది చాలా స్పష్టమైన సమాధానం.
కానీ మార్కెట్లో కాగితం మీదున్న లెక్కలకూ, కౌంటర్ దగ్గర జరిగే లెక్కలకూ మధ్య కొంత తేడా ఉంటుంది… ఒక వ్యాపారి మీద 0.4 శాతం ఖర్చు పడింది అనుకుందాం. అతను దాన్ని భరిస్తాడా? లేక తన మార్జిన్లో కలుపుకుంటాడా? లేక ధరలోనే ఏదో రూపంలో సర్దుబాటు చేసుకుంటాడా?
వ్యాపారులు తమ ఖర్చులను ధరల్లోకి బదిలీ చేసే అవకాశం మాత్రం ఉంటుంది… Moneycontrol కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది— మరి ₹10,000 బిల్లును ₹2,000 చొప్పున ఐదుసార్లు పంపితే? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో, వినియోగదారుల చర్చల్లో ఆసక్తికరమైన ప్రశ్న…
ఉదాహరణకు ₹10,000 బిల్లు వచ్చింది. ఒక్క UPI లావాదేవీగా ₹10,000 పంపితే MDR వర్తించే అవకాశం ఉంది… మరి ₹2,000 చొప్పున ఐదు లావాదేవీలు చేస్తే ప్రతి లావాదేవీ ₹2,000 గీత దాటదు కదా? గణితపరంగా చూస్తే ప్రశ్నకు అర్థం ఉంది…
Moneycontrol కథనం ప్రకారం…, పెద్ద చెల్లింపులను చిన్న లావాదేవీలుగా విడగొట్టడం ఒక workaroundలా కనిపించినా, NPCI, బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లు ఇలాంటి విధానాలను నిరోధించేందుకు safeguards పెట్టే అవకాశం ఉంది… పైగా వ్యాపారులకు reconciliation, cancellation, refund వంటి అంశాల్లో కూడా ఇబ్బందులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు…
అంటే రేపు ఒక షాపులో ₹10,000 బిల్లు చూసి— “₹2,000 చొప్పున ఐదుసార్లు QR స్కాన్ చేస్తా సార్!” అంటే వ్యాపారి, “అలా కుదరదు బాబూ… ఒక్కసారే పంపండి!” అని చెప్పే పరిస్థితి కూడా ఉండొచ్చు. కానీ దీన్ని అడ్డుకునే సిస్టం రానంతవరకు స్ల్పిట్ పేమెంట్స్ చేస్తే భారం పడకుండా చూసుకోవచ్చు… ఐతే అన్ని షాపులూ దీన్ని అంగీకరించకపోవచ్చు..!!
Share this Article