.
( గోపు విజయకుమార్ రెడ్డి ) … UPIపై MDR… అంటే చార్జీల బాదుడు… నెలకు సుమారు ₹1,500 కోట్ల కొత్త ఆదాయం..? ఎవరికెంత వస్తుంది? తెలంగాణపై ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉండొచ్చు?
దేశంలో UPI వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో, అక్టోబర్ 15, 2026 నుంచి పెద్ద మొత్తంలోని కొన్ని merchant UPI transactionsపై MDR అమల్లోకి రానుంది. అయితే ఇది సాధారణ UPI వినియోగదారుడిపై పడే charge కాదు.
Ads
Person-to-Person (P2P) payments పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. ₹2,000 వరకు merchant payments కూడా ఉచితమే… Small merchants (చిన్న వ్యాపారులకు) zero-MDR protection కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకారం సుమారు 96 % merchant transactionsపై MDR ప్రభావం ఉండదు.
అయితే మిగిలిన పెద్ద లావాదేవీల నుంచి ఒక కొత్త ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఈ revenue ఎంత ఉండొచ్చు? ఎవరికెంత వెళ్తుంది? PhonePe, Google Pay, Paytm వంటి apps కి ఎంత advantage ఉంటుంది? తెలంగాణకు ఎందుకు ప్రత్యేకంగా ఇది ముఖ్యమైన అంశం?

అయితే నెలకు కేంద్ర ప్రభుత్వానికి ఎంత MDR రావచ్చు..? అందుబాటులోని డేటా ప్రకారం, NPCI ఆగస్ట్ 2026 డేటా ప్రకారం పర్సన్స్ to మర్చంట్ ట్రాన్సక్షన్ వాల్యూ 0.4% సగటు అనుకుంటే… దాదాపు మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూ 9 లక్షల కోట్లకు గాను నెలకి సుమారు 1500 కోట్ల రెవిన్యూ… (ఇక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి సగటు తీసాను )… టాక్స్ అని పిలవకపోయినా దాదాపు ఓ కొత్త టాక్స్‌లాగే కలెక్ట్ చెయ్యబడుతుంది…
దీనిలో ముఖ్యంగా కింద చూపించిన టేబుల్ ప్రకారం రెవిన్యూ షేర్ వెళుతుంది.. 1) వీరు use చేసే బ్యాంకు 2) అవతలి వ్యక్తి use చేసే బ్యాంకు 3) మీరు use చేసే UPI ప్లాట్ ఫామ్. 4) PSP బ్యాంకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే UPI లేదా NPCI, Rupay, BHIM, IMPS లకు వెళ్తుంది.. డిటైల్డ్ గా క్రింది ఇమేజ్ చార్ట్ చూస్తే…, మంత్లీ, ఇయర్లీ ఎలా వెళ్తుందో తెలుస్తుంది…

అంటే దాదాపు కేవలం 1000 కోట్ల వరకు బ్యాంకులకే వెళ్తుంది. దీనిలో సింహభాగం SBI బ్యాంకు 14%.. అలాగే పేమెంట్ యాప్‌లకి ఎలా వెళ్తుందో చూద్దాం… పేటీఎం, గూగుల్ పే కలిపి దాదాపు 81% మార్కెట్ షేర్. అంటే ఈ రెండు కంపెనీలకి కలిపి నెలకి 250 కోట్లు, ఏటా 3000 వేల కోట్లు (పేటీఎంలో అమెరికన్ కంపెనీ వాల్ మార్ట్ 34% షేర్ హోల్డర్, గూగుల్ అనేది ఎలాగూ అమెరికన్ కంపెనీయే… అందుకే ప్రతిపక్షాలు US ఆర్ధిక ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది అంటున్నాయి… బ్యాంకులతో పాటు ఎండ్ బెనిఫిషరీస్ ఇవి )..

Share this Article