Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి గండరగండడు కూడా ఆ డైలాగ్ దగ్గర ఇరుక్కుపోయాడు!

September 18, 2026 by M S R

.

సంపూర్ణ రామాయణంలో, రావణపాత్రకు యస్వీయార్ అంగీకరించడమే ఓ విశేషం. రాజమాత పాత్ర కావాలని అడిగిన జమున కైక పాత్రకు ఒప్పుకోవడం, కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీకి మాత్రం రవికాంత్ నగాయిచ్ గారు ఒప్పుకోవడం, మూడూ రాముడిచ్చిన వరాలుగా భావించారు, బాపు రమణలు.

* * *
యస్వీయార్ గారి గురించి అందరూ భయపెట్టారు, బాపు రమణలను. ఏమనీ ! ‘ఆయన సురాహార దీక్షలో పడితే, ఇంతే సంగతులు. ఒకవేళ దీక్ష విరమించినా పదిరోజులు పాత్రలో మమేకం, మరో పదిరోజులు మైకమే. ‘ అని.
కానీ అలా ఏం జరగలేదు, వీరి విషయంలో మాత్రం. వారి బాల్యమిత్రుడిలా పసివాడిలాగా వారితో కలిసిపోయారు ఎస్ వీ యార్. అంతేకాదు ఉదయం ఆరుగంటలకే వచ్చి, పనికి వుసిగోల్పేవారు.

Ads

ఆ రోజుల్లో శోభనుబాబుకి నలభై, ప్రతినాయకుడు రంగారావుకు అరవై వేలు ఇచ్చారు పారితోషికం.

యస్వీయార్ గారు తన సంభాషణలను అలవోకగా, సునాయాసంగా చెప్పసాగారు. సెట్లో అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. ఒకసారి ఒక భారీ డైలాగు చెప్పి, అందరి మన్ననలూ అందుకుని, టీ తాగుతూ సిగరెట్టు పొగ విలాసంగా వదులుతూ… ‘ అదిరా సంగతి.. అదిరా ఎస్వీయార్ అంటే ! ఈ సో కాల్డ్ స్టార్స్ లో ఎవడైనా యెంత గొప్పవాడైనా ఈ రంగారావులా మరిచి పోకుండా, మాట తప్పకుండా చెప్పమన౦డిరా… ఛాలెంజ్. చెప్పలేరు. వాళ్లంతా నాముందు బలాదూర్ ! ‘ అనేసారు, ‘ అహంకారంగారావు ‘ పాత్రలో.

* * *
ఈ మాటలు వింటున్న బాపు రమణలకు, యూనిట్లో వారికీ భయంవేసింది. పైవాడు కూడా గమనించినట్లు వున్నాడు, ఆ పలుకులు.
ఇంకో టేకులో పైవాడు పాఠం చెప్పేసాడు. ‘ మహావీరా ! మంత్రవిద్యా విశారదా మారీచా ! నీకేల ఈ ముని మ్రుచ్చువృత్తి ? ‘ అదీ రంగారావు గారు చెప్పవలసిన డైలాగు. అది ఇబ్బంది పెట్టింది ఆయనను. మంత్ర విద్యా విశారదా దగ్గర ఇరుక్కుపోయారు. ప్రతిసారీ, ఆయన ‘ విధ్యా విశారథా ‘ అంటుండేవాడు. బాపు ఆయన దగ్గరకు వెళ్లి మెల్లగా, ‘ వత్తులు లేవు సర్ ‘ అనేవారు.

‘ వాట్ ! వత్తుల్లేకుండా డైలాగు ఏమిటీ ? సరిగా చూడండి, రావణుడు బ్రాహ్మణుడు కదా ! ‘
‘ అయినా సరే ! వత్తులు లేవు సర్ ‘ రమణ గారు. ఈసారి ఒక చోట వత్తు తీసి రెండోచోట అలానే వుంచి చెప్పారు. బాపు గారు మాత్రం అంతకుముందే అందరినీ హేళన చేసాడనే పంతం కొద్దీ, మళ్ళీ చెప్పమన్నారు. ఎంతకీ కుదరడం లేదు. టెన్షన్ పెరిగిపోతున్నది.

‘ సర్లెండి.’ అని బాపూ గారు సరిపెట్టుకుంటున్నట్లుగా అనేసరికి, ఈసారి రంగారావు గారికి పంతంవచ్చి, లేచి చిరాగ్గా మేకప్ రూమ్ లోకి వెళ్లారు.
సాయంకాలం అయింది. బయటకు రావడంలేదు.

* * *
‘ టిఫిన్ తెప్పించనా ! ‘ రమణ గారు.
‘ తిన్నానుగా తట్టెడు. టిఫినొద్దు. దమ్ములాగనీ ‘ అని ఘాటుగా దమ్ములాగారు. ‘ పొగరు తగదు. అహం దెబ్బకొట్టింది. రమణా సారీ ! ‘ అన్నారు ఎస్వీయార్. ‘ ఎస్ సర్ ! రాముడికి కోపం వచ్చింది, రావణాసురుడి మీద. ‘ రమణ గారు.
ఏమనలేక నవ్వేశారు ఎస్వీయార్. ‘ సరే టిఫిన్ తెప్పించు. అది తినివస్తే, టేకులు తినడం ఉండదేమో ! ‘ అన్నారు ఎస్వీయార్….. (ఇంకోతి కొమ్మచ్చిలోనిదే ఈ ఎపిసోడ్)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి గండరగండడు కూడా ఆ డైలాగ్ దగ్గర ఇరుక్కుపోయాడు!
  • రిపోర్టర్ చాకచక్యం! నిజాం నవాబు మరణవార్త అలా బయటికొచ్చింది!
  • ఇరాన్ వార్ సైడ్ ఎఫెక్ట్స్ – సౌదీకి చుక్కలు చూపిస్తున్న హుతీలు !
  • తెలంగాణ విముక్తిలో జోధ్‌పూర్? ‘షెకావత్’ మాటలకు అర్థమేంటంటే..!
  • రక్తికట్టని చరణ్ రీఎంట్రీ సీన్! బిగ్‌బాస్ టీమ్ పూర్ స్క్రిప్ట్ రైటింగ్!!
  • సొంతిల్లు లేని కేటీయార్ అవస్థ ఈ తెలంగాణ సమాజానికి పట్టదా!?
  • రేవంత్ బుల్‌డోజర్ దాడి! పెద్ద దొర గడీ ప్రహారీ గోడలకు బీటలు!!
  • ఇదెక్కడి చోద్యం రాజమౌళీ? డబ్బు కావాలి గానీ థాంక్స్ చెప్పవా..?!
  • 100 శాతం టారిఫ్ పిడుగు! ఇండియా- అమెరికా బంధాలకు విషమ పరీక్ష !!
  • సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్..! ఆశ తీరలేదు – కల నిజం కాలేదు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions