Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇరుముడి ! థియేటర్- ఓటీటీ వీక్షకుల వేర్వేరు స్పందనలు..!!

September 20, 2026 by M S R

.

థియేటర్ ప్రేక్షకులు వేరు- ఓటీటీ ప్రేక్షకులు వేరు… ఈ సందేహం చాలాసార్లు కలుగుతోంది… థియేటర్‌లో కూర్చున్న ఆ రెండున్నర గంటలు, ఆ వాతావరణం, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, బిగ్ స్క్రీన్ ఇంపాక్ట్ ప్రేక్షకుడిపై చూపే ప్రభావం వేరు… ఓటీటీలో ఫోన్‌లోనో, ఇంట్లో టీవీలోనో, హోం థియేటర్‌లోనో తాపీగా వెనక్కీ ముందుకూ కదుపుతూ చూస్తున్నప్పుడు కలిగే ప్రభావం వేరు…

అది ఆ సినిమా పట్ల విరుద్ధ అభిప్రాయాలను ఏర్పరుస్తోంది… థియేటర్లలో విడుదలైనప్పుడు వచ్చే రివ్యూలు (పెయిడ్, బయాస్డ్ ఉన్నా సరే) వేరు… ఓటీటీలోకి వచ్చాక అదే సినిమా మీద సోషల్ మీడియాలో వీక్షకులు (నాట్ రివ్యూయర్స్) భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు… ఇరుముడి మీద సోషల్ మీడియాలో కనిపించే ‘ఆఫ్టర్ ఓటీటీ రివ్యూలు’ దీనికి ఉదాహరణ…

Ads

స్థూలంగా పైకి కనిపిస్తున్న సీన్ ఏమిటి..? అనేకానేక వరుస ఫ్లాపులు, ఇంకా రవితేజకు కెరీర్ మిగిలి ఉందా అని అనుకునే దశలో ఇరుముడి తనకు కొత్త ఇన్నింగ్స్… వందల కోట్ల వసూళ్లు, సూపర్ హిట్ బొమ్మ… తన రొటీన్, రొడ్డకొట్టుడు, అనవసర ఎలివేషన్లు, మూస ప్రజెంటేషన్ల నుంచి బయటపడ్డాడు… మంచి పాత్ర పడింది, అందుకే జనం ఆదరించారు, రవితేజ మళ్లీ పుట్టాడు… థియేటర్లలో రిలీజైనప్పుడు మొదట్లో వినిపించిన అభిప్రాయాలు ఇవే…

నిజానికి ఇది దర్శకుడి ఘనతే… రవితేజ తన భ్రమలు, తన ఫ్లాప్ ఎంపికల నుంచి బయటికి లాక్కొచ్చి, ఒప్పించి, ఓ మలయాళ సినిమా తరహా ప్రపంచంలోకి తీసుకొచ్చాడు… సినిమా కూడా చాలాచోట్ల ఓ మలయాళ సినిమాలాగే అనిపిస్తుంది… రవితేజను అలా చూడటం కొత్త… అది ఫలించింది… కానీ సినిమా గొప్పదనీ, భిన్నమైనదనీ కాదు…

సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఓటీటీ వీక్షకుల స్పందన కూడా ఇదే… ‘‘అంత డప్పులు కొట్టారు, గొప్పలు చెప్పారు, ఏముంది ఇందులో… సగటు తెలుగు సినిమా కథ, కథనం, తాగడం, ఎవడిని పడితే వాడిని బాదడం, అదో హీరోయిజం, లాజిక్ లెస్ సీన్లు… అంతేకదా…’’ ఈ పోస్టులు కనిపిస్తున్నాయి ఎక్కువగా… వాటి కింద కామెంట్లు, స్పందన కూడా సేమ్…

నిజమే… థియేటర్‌లో సినిమా చూసినప్పుడు కలిగే అనుభూతి, ప్రభావం మనపై వేరేగా ఉంటోంది… ఓటీటీలో తాపీగా అదే సినిమా చూస్తున్నప్పుడు సినిమా పట్ల లోతైన, నిజమైన అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఉంటోంది… అదీ తేడా…

నిజంగానే ఇరుముడి చూడాల్సిందే అనే బాపతు సినిమా ఏమీ కాదు… మల్లెపూల పల్లకీ అనే పాట సినిమా విజయానికి పావుసగం కారణం… తరువాత నక్షత్ర అనే మలయాళీ చిన్నపిల్ల నటన, ఆ పాత్ర మరో పావుసగం కారణం… మిగతా ఏ అంశాలున్నా అవి మిగతా సగభాగంలోనివే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇరుముడి ! థియేటర్- ఓటీటీ వీక్షకుల వేర్వేరు స్పందనలు..!!
  • కనిమొళి థర్డ్ ఫ్రంట్ ప్రయాస – కేసీయార్ రెడీయా..? సాహసిస్తాడా..?
  • ‘‘ వసూళ్లు తప్ప విలువల్లేవు – నేనిక నటించను – ఇక చాలు ’’
  • ఎదుటివారి ప్రశంస మనకు మత్తు – అందుకే ఆడంబర ప్రదర్శనలు
  • అగడు పడ్డట్టు తెగ మింగారు! ఎవడి పాలైందిరో నా తెలంగాణ !!
  • సౌదీ మరింత చిక్కుల్లోకి! రెండు జెట్ ఫైటర్లను కూల్చిన హుతీలు!!
  • 20 వేల ఎకరాలు ఏం సరిపోతాయి ? ఇంకా ఇంకా కావాలి !!
  • పెళ్లానికి తెలీకుండా లవర్‌తో జాలీ విదేశీ ట్రిప్‌ ప్లాన్… కానీ..?
  • ‘పంచనామా’ కాదు… పాత యాంకర్ ఉదయభాను ఇజ్జత్ పంచనామా!
  • రాముడికన్నా లక్ష్మణుడు కాస్త పొడుగు ఉండకూడదా ఏం?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions