.
ఏశనాగుల కట్ట మీద అనే పాట ఎంత సూపర్ హిట్టో చెప్పుకున్నాం కదా… అదొక ఐటమ్ సాంగ్… కానీ దానికి పూర్తి భిన్నమైన లోతైన, ఉద్వేగపూరితమైన పాట మరొకటి ఉంది రాబోయే ప్యారడైజ్ సినిమాలో… రెండు రాసిందీ కాసర్ల శ్యామే… ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్క’ అనే పాటలో మంచి బరువైన పదాలు పడ్డయ్… అభినందనలు…
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ట్వీట్ కనిపించింది హఠాత్తుగా… ఓ వీడియో జతచేశాడు… అందులో సంగీత దర్శకుడు అనిరుధ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమై ‘మీకు ఓ సర్ప్రైజ్’ అంటూ ఓ పాట పాడాడు… కాకపోతే తన తెలుగు ఉచ్ఛరణ స్పష్టంగా లేక, ఆ పదాలు సరిగ్గా వినిపించలేదు… సరే, ఏదో ఓ సర్ప్రైజ్ ప్రచారం కోసం అనుకుందాం…
Ads
నిజానికి ఈ పాట సినిమాలో పాడింది మధుశ్రీ… ఆమె మరో పాట కూడా పాడినట్టుంది సినిమాలో… ఈ సమ్మక్క పాట గురించి చెప్పుకుందాం…
పచ్చిది నీ పేగు సమ్మక్క
కుట్టుకుంటాందే ఆకల్ని సమ్మక్క
పిచ్చిది నీ గుండె సమ్మక్క
కొట్టుకుంటాందే కొడుకుకై సమ్మక్క
కండ్లల్ల కన్నీళ్ళు సమ్మక్క
నీ రొమ్ముల్లకెట్లొచ్చే సమ్మక్క
ఇంకిందె రక్తము సమ్మక్క
పొద్దు గుంకిందె గుడిసెల్ల సమ్మక్క
నడిశేటి శవమైతివే
సమ్మెట పోట్లకు సమ్మక్క
సొమ్మసిల్లిన నిప్పువే సమ్మక్క
సావు సాటుకొచ్చి సమ్మక్క
సాదుతున్నవే బతుకును సమ్మక్క
బురదల నీ కాళ్ళు సమ్మక్క
బుదగరిస్తుంటె కాలాన్ని సమ్మక్క
నీ ఒళ్ళు కొలిమైందే సమ్మక్క
అడియాసే నీ బలమైందే సమ్మక్క
నీ పాడె నువ్ మోస్తివే
….. కన్నీళ్లు రొమ్ముల్లోకి రావడం, సొమ్మసిల్లిన నిప్పు, కాలాన్ని బుదగరించడం, నీ పాడే నువ్వు మోస్తివే, నీ ఒళ్లు కొలిమైందే, పొద్దుగుంకిందే గుడిసెల… సమ్మక్క అనే పాత్ర స్థితిపై రాసిన పాట అనుకుంటా… ఖచ్చితంగా బాగుంది పాట… రాను రాను సినిమా పాటల్లో సాహిత్య విలువలు, ప్రమాణాలు, ఎమోషన్స్ లుప్తమైపోతున్న దురవస్థలో ఇలాంటి పాటలే ఓ ఊరట, ఓ సాంత్వన..!!
Share this Article