Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?

September 29, 2026 by M S R

.

Gurram Seetaramulu …. “ఇదారా, మీ అమ్మ నిన్న రాత్రి నా తాన పన్నది రెండు రూపాయలు ఇచ్చిన”…

డియర్ శ్రీకాంత్ ఓదెలా, యే పరిశోధన ఆధారంగా సవారీలు వ్యభిచారం చేసారని నిర్దారిస్తావ్ ? బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల వారసులు రోడ్డు మీద అడుక్కుని అయినా తింటారు కానీ వ్యభిచారం చెయ్యాల్సిన ఖర్మ వాళ్లకు పట్టదు.

Ads

ఇది సినిమా కదా, సినిమాను సినిమాగానే చూడాలి, గుడ్డు మీద ఈక పీకవద్దు, పోకవద్దు,  సాలార్‌లో kgf లో, యానిమల్‌లో హింస లేదా అనే వలస నొక్కులు వద్దు ఇక్కడ.
ఒక పేరుకీ, ఈ మట్టికీ ఉన్న బంధం గురించి మాట్లాడుకుందాం. గడప ముందు రెండు రాళ్ళు పెట్టి, సాగిలపడే సంస్కృతి తెలంగాణది, అది నిర్వికార భావన…

గోడ మీద గింత పసుపు, దాని మీద గింత కుంకుమ, ఇందులో నాస్తిక. హేతువుకు కూడా అర్ధం కాని ఒక విశ్వాసం ఉంటది.
పారడైజ్ సినిమాలో ఎంత తెలుగు తనం ఉంది, తెగువ తనం ఉంది, తెలంగాణతనం ఉంది. ఎంత జారతనం, నెరజాణతనం, ఒడ్డూ పొడవు ఒంపు సొంపులు… ఈ గోల నాకనవసరం…

కావాలని చేస్తున్న ప్రచారం… అసలు సవారీలకు కేసీఆర్‌కు, ntr కు యేం సంబంధం? మోకాలికి బోడి గుండుకు ఉన్నంత బంధం.
కేవలం బాపు కనబడ్డాడు కాబట్టే విమర్శ ..
మీకు అందరికే అదే యావ..

నా బాధ తల్లీ కొడుకుల మధ్య వైరం, శీలాన్నే ప్రమాణంగా, కేవలం వినికిడి మాటల మీద తల్లిని ద్వేషించే కొడుకు గురించి.
సరే, వల్గారిటీనే వ్యాపారంగా చేసుకుని బ్రతకడం నేర్చిన వెండితెరకు బిడ్డ అరకొర దుస్తులు వేసుకుంటే తల్లి షూట్ చేసే నైజం మా నిజాం ఏలుబడిలో లేదు .

హిజ్రాలు కూడా బహిరంగ స్థలాలలో పెళ్ళిళ్ళలో డాన్స్ చేసినా వారెంట్ లేకుంటా అరెస్ట్ చేసి రెండేళ్ళు లోపల వేసే చట్టం ఉంది (1919 THE HYDERABAD EUNUCHS ACT. ఈ చట్టం 2023 వరకు తెలంగాణలో అమలులో ఉంది)

బిడ్డ వ్యభిచారం చేస్తుంటే తల్లి వీడియో తీయడం వలస కోస్తా చిలకలూరిపేటలోనో, పెద్దాపురంమేళాలోనో చూసి ఉంటావు. అది దిగజారిన సమాజాల గోల.
క్రిమినల్ ట్రైబ్‌లో సవారీలే కాదు బాలసంతు, బుడబుక్కల, దాసరి, దొమ్మర, మేదరి, నక్కల, పర్ది, పంబాల, మాల, మాదిగ, డక్కలి కూడా ఉన్నారు.
నువ్వేదో పెద్ద పరిశోధన చేసి కుళ్లబొడిసింది ఏమీ లేదు.

సమ్మెట పోట్లు తిన్న సమ్మక్క పచ్చిపేగు వ్యథలు, కండ్లల్ల కన్నీళ్లు రొమ్ముల్లకు రావడం, నడిచిన శవం, ఇంకిన రక్తం చూసి నేనే కాదు, యావత్ తెలంగాణ నీ వాక్యాలను, భావ వ్యక్తీకరణ చూసి సిగం ఊగింది.

కేవలం ఆ పాట తెర మీద చూడడం కోసమే పదిహేను వందలు పెట్టి సినిమా బెన్ ఫిట్ షో చూసా. సినిమాకు అన్ని పైసలు పెట్టడం అంత సిగ్గులేనితనం లేదనుకో.

సమ్మక్క అంటే తెలంగాణకు నిలువెల్లా పూనకం.
ఆమె రాణినా, దొరసానినా, మాకనవసరం

మా రెక్కల్లో డొక్కల్లో, మా రక్తంలో, మా మూలుగ బొక్క మజ్జలో బాగం. ఆమె కాకతీయులను ఎదిరించిందా ?
సాగిలపడ్డదా ? అనే వెతుకులాట కూడా మాకు అవసరం లేదు.
సమ్మక్క అంటే మాకు ఒక కంక బొంగు, కుంకుమ భరిణె, పుట్ట మన్ను, మాలిన్యం ఎరగని, భాషకు అందని, భావానికి లొంగని అతీత శక్తి.

సమ్మక్క దగ్గరకు పోతే సకలవాదాలు సాగిల పడతాయి.
సకల రోగాలు పారిపోతాయి, సకల సంకుల సమరాలు సమసి పోతాయి.
శతాబ్దాలుగా సమ్మక్క అంటే బొట్టు, బోనంకున్నంత పవిత్రత
.
సమ్మక్క అంటే అడవి సిగం వూగుద్ది . ఆకాశం పొంగి పోతది. నెమళ్లు నాట్యం ఆడతాయి. అది ఆ పేరుకు ఉన్న మహిమ.
సమ్మక్క అంటే మా తల్లిరా
మా అక్క ఆడవిడ్డ …. (ఆడబిడ్డ, అడవిబిడ్డ)

తెలంగాణ సినిమాని, త్యాగాన్ని, పౌరుషాన్ని కలను, కళలను, ఎప్పుడు ఎలా ఎందుకు కాపాడుకోవాలో మాకు తెలుసు
సమ్మక్క పేరు పెట్టి ఆమె దుఃఖాన్ని చెప్పావు సరే
కానీ రూపాయి రొట్టెకు పైట పరిచేదారా గాడిదా,
సిగ్గు ఉండాలి, అరె నానీ, శ్రీకాంత్ అసలు ఎవర్రా మీరు
ఇదార మీ ఇలవరస..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions