Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!

September 29, 2026 by M S R

.

చంద్రబాబు ఎవరు?
జవాబులు: 1. తమిళ్ష్ సినిమాలో ప్రతిభావంతుడైన హాస్యనటుడు.
2. తనకు తాను పాడుకున్న గాయకుడు.
3. మహానటి మన సావిత్రి పతనానికి మూలకం, ప్రేరకం, ప్రోత్సాహకం అయిన వ్యక్తి.

జెమినీ గణేస(శ)న్ వల్ల సావిత్రికి ఏ హాని జరగలేదు; చాల మేలు జరిగింది. ఇది సరైన తెలివిడి; తెలుగు సినిమా పత్రికల మేధా పాత్రికేయులకూ, ఎవరో చెప్పిన ఏదో విని అదే నిజమనుకునే తెలుగువాళ్లకూ మించిన వాస్తవం ఇది.

Ads

నాకు బాగా చిన్నప్పుడే ఈ విషయం తెలుసు. నాకే కాదు చెన్నైలో సరైన వివరాలు తెలిసిన వాళ్లు కొందరు ఎరిగిన విషయమే ఇది. చంద్రబాబు- సావిత్రి గురించి ప్రస్తుతానికి ఇంతకంటే చెప్పే ఆలోచన, అవసరం లేదు నాకు.

చంద్రబాబు… westernized out look ను దక్షిణాదికి తెచ్చిన తొలి లేదా తొలిదశ ప్రతిభావంతమైన నటుడు చంద్రబాబు. Spastic comedyను దక్షిణాదికి తెచ్చిన తొలి లేదా తొలిదశ ప్రతిభావంతమైన నటుడు కూడా చంద్రబాబే.

chandrababu

Yodelling… దక్షిణాది గానంలో ఈ Yodellingను కూడా ప్రత్నించింది చంద్రబాబే.
Yodellingను విజయవంతం చేసింది పీ.బీ. శ్రీనివాస్. (ఈ విషయంగా వికీపీడిఅ పండితులు ఉద్రేక పడవలదు. వికీపీడిఅను, AIను విజ్ఞాన సర్వస్వం, ప్రామాణికం అనుకునే బుద్ధి మాంద్యుణ్ణి కాను నేను)

చంద్రబాబు … మొత్తం దేశంలోని హాస్యనటుల్లో తన కాలంలో గొప్ప హాస్యనటుడు. తెలుగు, కన్నడం, మలయాళంలోనే కాదు హిందీలో కూడా చంద్రబాబు సమకాలీనుల్లో ఎవ్వరూ చంద్రబాబు అంత గొప్ప హాస్య నటుడు లేడు.

“మన రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం కన్నా చంద్రబాబు గొప్ప హాస్యనటుడా?” తెలుగు మధ్యతరగతి ముందు వెనకా ఆలోచించకుండా నాపైకి విజృంభిస్తుంది. ‘మన రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం కన్నా చంద్రబాబు గొప్ప హాస్యనటుడు’ అన్నది ‘తెలివిడి’ వల్ల వచ్చే సరైన సమాధానం.

నాగేష్ మరో తమిళ్ష్ హాస్యనటుడు. అన్ని రకాలుగానూ చంద్రబాబుకన్నా గొప్ప. ఆ నాగేష్ కూడా తన సమకాలీనుల్లో ఇతర హాస్య నటుల కన్నా గొప్ప నటుడు. మరి మన రాజబాబు మాట ఏమిటి? మధ్యతరగతి దాడికి తెగబడుతుంది. మరోసారి … తన సమకాలీనుల్లో ఇతర హాస్య నటుల కన్నా గొప్ప నటుడు నాగేష్.

చంద్రబాబు … డైలాగ్ డెలివరీ, డాన్స్, expression, adoptability, polished performance, body language, spastic comedy పరంగా గొప్ప నటుడు చంద్రబాబు.

Baila dance… సింహళ లేదా శ్రీలంక జానపద నృత్య సంప్రదాయం Baila dance. ఈ Baila danceను మన దేశ సినిమాలో ప్రవేశపెట్టింది చంద్రబాబు. దేశ స్యూపర్ స్టార్ గ్రేట్ అమితాబ్ కూడా ఈ Baila dance కొన్ని పాటల్లో చేశారు. (లావారీస్ సినిమాలోని “మేరే అంగ్‌నే మేన్ …” పాట)

చంద్రబాబు, జే.పీ. చంద్రబాబు (1927-1974) ఒక దశలో తమిళ్ష్ సినిమా వ్యాపార రీత్యా పండడానికి అవసరమైన ఇంధనం అయ్యారు. ఎ.వి.యమ్. సంస్ధ సినిమాల విజయాలకే చంద్రబాబు దిక్కు అయ్యారు.

విలాసవంతమైన అనైతిక జీవనం; తనకు మించినది లేదు అనుకునే నైజం, అత్యంత బీదరికం నుంచి వచ్చినా ఉచ్చస్థాయికి వచ్చేసరికి కన్ను మిన్ను కానరాక ప్రవర్తించడం, విచ్చలవిడి శృంగార, మద్య జీవనం వెరసి చంద్రబాబు పతనం. చివరి రోజుల్లో దయనీయంగా బతికారు చంద్రబాబు.

చంద్రబాబు దేశ సినిమాలో ఒక గొప్ప హాస్యనటుడు అన్నది మాత్రం నిక్కచ్చైన నిజం. Baila dance చేస్తూ, తానే పాడుతూ చంద్రబాబు చేసిన అభినయం ఇక్కడ ఇస్తున్నాను…. రోచిష్మాన్
9444012279

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions