Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్లడీ రోమియో – కాదు, బ్లడ్ రోమియో – మరో బ్లడీ ప్యారడైజ్ !!

October 8, 2026 by M S R

.

మాస్ హీరో అనిపించుకోవాలంటే… ఓ మానవాతీత శక్తిగా ఫైట్లు చేయడం, తెర మీద నెత్తురు పారించడం, మానవ దేహాల్ని చెల్లాచెదురుగా తురిమిపడేయడం, శవాల కుప్పల్ని ప్రదర్శించడం… ఇదే అనుకుంటున్నాడు నేచురల్ స్టార్ అని గతంలో పిలవబడిన నటుడు నాని… ఇక్కడ హీరో అనడం లేదు, ఎందుకంటే, తన భ్రమలు, తన ఆలోచనలు ఏమాత్రం హీరోయిక్ కాదు కాబట్టి… ఏవో పిచ్చి భ్రమల్లో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి…

అదేంటి..? ప్రతి సౌత్ హీరో ఆ పిచ్చి భ్రమల్లోనే ఉన్నాడు కదా, ఏవో అతీంద్రియ శక్తులున్నట్టుగా రౌడీలను, విలన్లను తిరుముతున్నారు కదా అంటారా..? నాని గత ఇమేజ్ వేరు… ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో సంపాదించుకున్న చెడ్డ పేరు వేరు… నో, నో, తెరకు వేల లీటర్ల నెత్తురు పులిమిన ది ప్యారడైజ్ మస్తు వసూళ్లు తెచ్చింది కదా అంటారా..?

Ads

వసూళ్లు వేరు- సినిమా నాణ్యత వేరు… యాక్షన్, వయెలెన్స్ ప్యారడైజ్‌లో ఎంత బీభత్సంగా చూపించారో మనం గతంలోనూ చెప్పుకున్నాం… వయోలెన్స్ మాత్రమే మాస్ సక్సెస్ అనుకుంటే, అంతకుమించిన భ్రమ మరొకటి లేదు… మన తెలుగు ముసలి స్టార్ హీరోలు కేవలం వయెలెన్స్‌ను నమ్ముకుని చేసిన సినిమాలు పత్తాకు లేకుండా చతికిలపడ్డ ఉదాహరణలు బోలెడు… ఐనా నాని మాత్రం దాన్నే నమ్ముకున్నాడు పాపం…

తను కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు తీస్తాడు నిర్మాతగా మాత్రమే… ఎవరో హీరో, ఎవరో దర్శకుడు… తను మాత్రం రగ్‌డ్, రఫ్, రస్టిక్ లుక్‌తో ఏవో పిచ్చి పాత్రలు చేస్తుంటాడు… ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… త్వరలో తన మరో సినిమా బ్లడీ రోమియో రానుంది… ఈ బ్లడీ అనే పదం బ్లడ్‌కు వర్తింపజేసుకుంటే సరి… బ్లడీ నాని…!!

నిజానికి ఇది ఎప్పుడో రావాలి… సుజిత్ దర్శకుడు… తన నాణ్యత ఏమిటో పాపం ఓజీలో చూశాం కదా… ఇక ఈ నాని నటించే కొత్త సినిమాలో వయోలెన్స్ ఉంటుందట, కానీ పరిమితుల్లో ఉంటుందట… నాని స్వయంగా చెబుతున్నాడు… అంటే బ్లడీ రోమియో కూడా బ్లడ్ రోమియా అన్నమాట…

bloody romeo

ఇది యూనిక్ పాత్ర అట, స్టైలిష్ అట, చమత్కారం అట… ఎవరైనా ఏ సినిమాకైనా, ఏ పాత్రకైనా చెప్పేది అదే కదా… పైన ఫోటోలో లుక్ చూడండి, ప్లస్ వయోలెన్స్… అంటే మరో బ్లడీ ప్యారడైజ్ అన్నమాట… కాకపోతే చెఫ్‌గా కనిపించే గ్యాంగ్‌స్టర్… ఇందులో ప్రీతి ముకుందన్ హీరోయిన్ అట… నాని అన్నాక ప్రతి సినిమాకు ఓ కొత్త హీరోయిన్ ఉండాలిగా… ప్రీతి ముకుందన్ అంటే మంచు కన్నప్ప కథానాయిక..! భక్తి సినిమాలో అశ్లీలపు ఆరబోత అనే విమర్శలూ వచ్చాయి కదా ఆమె మీద..!!

ఓజీ యూనివర్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తో OG-2 మూవీ చేయనున్నాడట సుజిత్… దానికంటే ముందు నానితో ‘బ్లడీ రోమియో’ సినిమా పట్టాలెక్కించనున్నాడట… సో, ప్రేక్షకులూ మరో బ్లడీ ప్యారడైజ్‌కు రెడీ అయిపొండి, అసలే స్టార్ మాస్ మహా నటుడు జడల నాని గారు నటించబోయే బ్లడీ చిత్రం మరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నూకలు బాకీ ఉంటే… యముడే దిగొచ్చినా ప్రాణాలు తీయలేడు !!
  • బ్లడీ రోమియో – కాదు, బ్లడ్ రోమియో – మరో బ్లడీ ప్యారడైజ్ !!
  • నకిలీ బతుకులు … BRS సోషల్- ఫేక్ ప్రచారాలపై బిగ్‌టీవీ ఫైర్..!!
  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions