.
ఎస్… వుమెన్ సెలబ్రిటీలపై ఆన్లైన్ వేధింపులు, బూతులు, ట్రోలింగ్, జుగుప్సాకర కామెంట్లు… నానారకాలుగా దాడి చేసే వెధవలకు కొదవ లేదు సోషల్ మీడియాలో… ఫేక్ పేర్లు, ఫేక్ ఖాతాలతో నోటికొచ్చినట్టు పేలుతుంటారు… చాలామంది ఈ సోషల్ పోకిరీలకు భయపడి, తమ ఖాతాలనే రద్దు చేసుకున్నారు… మనకు తెలుసు…
కానీ… సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి భార్య వీణశ్రీవాణి అలా భయపడలేదు… చెప్పుచ్చుకుని కొట్టినట్టుగా సమాధానం ఇచ్చింది… బాగుంది, ఎవరో ఒకరు ఇలా ధైర్యంగా ఇదే సోషల్ చెప్పు తీసుకుని కొట్టినట్టు ట్రోలర్లకు బదులిస్తూ ఉంటేనే, మిగతా వాళ్లూ ధైర్యం తెచ్చుకుంటారు… అవసరమైతే సైబర్ క్రైమ్ ఫిర్యాదులు చేస్తారు, ఆ ఖాతాల ఓనర్లకు గుణపాఠం చెబుతారు…
Ads
తన మీద అసభ్యంగా కామెంట్ చేసిన, ఓ మెసేజులో రోత ప్రశ్న వేసిన ఓ మూర్ఖ నెటిజనుడికి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది శ్రీవాణి… (గతంలో వేణుస్వామిని పనిగట్టుకుని ఓ సినిమా జర్నలిస్టుల సిండికేట్‌ను కూడా ఆమె ఓ వీడియో ద్వారా ప్రశ్నించింది… భర్తకు తోడుగా నిలిచింది…) ఆ నెటిజనుడికి ఆమె జవాబు చెప్పిన తీరు బాగుంది, ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది… గుడ్…

జరిగింది ఏమిటంటే..? ఓ నెటిజనుడు ఆమెకు ఓ మెసేజ్ పెట్టాడు… ‘‘మీరు నిజంగా ఇంకా శీలవతేనా..? మీ ఆయన మీద ఒట్టు వేసి చెప్పు’’… ఇదీ వాడి ప్రశ్న… శీలం అంటే వాడికి తెలిసిందేమిటో మనకు తెలియదు గానీ… ఆ చీప్ మెసేజ్ చూశాక ఆమె ఓ వీడియో పెట్టింది సోషల్ మీడియాలోనే…
‘‘అది చూశాక మొదట బాధేసింది… కోపం వచ్చింది, వెంటనే బ్లాక్ చేశాను కానీ, ఛ, స్క్రీన్ షాట్ తీసి ఉండాల్సింది… అవునురా, అవును, నేను శీలవతిని కాదు… నేను ఒక పర్ఫెక్ట్ మహిళను… తొమ్మిది నెలలు బిడ్డను మోసి, కనే సమయంలో సిజేరియన్ తప్పదనీ, క్రిటికల్ అనీ వైద్యులు చెబితే ఆపరేషన్ కు ఓకే చెప్పాను…
ఆ సమయంలో ఐసీయూలో నా చుట్టూ ఉన్నవాళ్లలో అనస్తీషియన్ మగాయన, డాక్టర్ మగాయన, కంపౌండర్లు మగాళ్లు… నా శీలాన్ని చూపిస్తూ నా బేబీకి నేను జన్మనిచ్చానురా… నాలాంటోళ్లు ప్రపంచంలో కోట్ల మంది… అందులో మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ పెళ్లాం కూడా ఉన్నారు… ఛ, కరోనా సమయంలో చాలామంది మంచోళ్లు చనిపోయారు, కానీ నీలాంటి వెధవలు మిగిలిపోయారు… వేలాడుతున్నారు…
మీలాంటోళ్లతో ఏం ఉపయోగంరా దేశానికి..? ఆడవాళ్లం కష్టపడుతున్నాం, సాధిస్తున్నాం… కనీసం మమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు కదరా… అలాగే వెధవలుగా ఉండిపోతే, మిమ్మల్ని సమాజం అలాగే గుర్తుంచుకుంటుంది… మిమ్మల్ని ఎవరూ మార్చలేరు…’’ భలే జవాబు చెప్పారు మేడమ్ అని ఆమెను చాలామంది అభినందించారు… అవును, ఎవరో ఒకరు ధైర్యంగా చెప్పు పట్టుకోవాల్సిందే..!!
https://www.facebook.com/reel/1775609743743101
Share this Article