Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రిచ్ – రిచర్ – రిచెస్ట్ ! బీఆర్ఎస్ ఖజానాకు అడ్డగోలు ధనకళ !!

October 18, 2026 by M S R

.

కేసీయార్ అండ్ కో తెలంగాణ మీద పడి, అనధికారికంగా ఎంత సంపాదించారనేది చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్లు చాలారోజులు కిందామీదా పడితే తప్ప ఆ లెక్కలు తేలకపోవచ్చు… కానీ అధికారికంగా పార్టీ కోసం చేసిన వసూళ్లలో మాత్రం దేశంలోనే రికార్డు… ఫార్ములా వన్ వంటి చాలా బాగోతాలకు క్విడ్‌ప్రోకో కింద కోట్లకుకోట్లు వచ్చి పడ్డాయి…

ఒక దశలో ‘యాంటీ బీజేపీ కూటమి బాధ్యతలు ఇవ్వండి, అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు నేను భరిస్తాను’ అన్నాడంటే… ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా ఎదిగిందంటే… ఏ రేంజ్‌లో వ్యవహారాలు సాగాయో అర్థం చేసుకోవచ్చు… ఓ వార్త కనిపించింది… బీఆర్ఎస్ ఖజానాలో ఇప్పుడు రూ.1,509 కోట్లున్నాయనీ… బ్యాంకుల్లో ఉన్నవే రూ.1,431 కోట్లు అని దాని సారాంశం…

Ads

కాదు, రేవంత్ రెడ్డి ఆరోపణ కాదు… 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈసీకి ఆ పార్టీ సమర్పించిన యాన్యువల్​ ఆడిట్ రిపోర్టే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందట… పార్టీకి లాంగ్​టర్మ్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లు రూ.1,237 కోట్లు ఉండగా, వడ్డీలే రూ.97 కోట్ల దాకా వస్తున్నాయట… ఇతర ప్రాంతీయ పార్టీలు కుళ్లుకుని, బాబ్బాబూ, మాకూ ఆ చిట్కాలు నేర్పించవా అని బతిమిలాడే సిట్యుయేషన్ వచ్చేట్టుగా ఉందన్నమాట…

brs

గతంతో పోలిస్తే ఈ ఏడాది పార్టీ ఖజానాకు కొంత నష్టం వచ్చింది… అధికారం లేదు కాబట్టి క్విడ్‌ప్రోకోలు ఆగాయి కదా… ఐనా సరే, 1500 కోట్లకు కాస్త అటూ ఇటూ ఆస్తులు అలా మెయింటెయిన్ చేస్తున్నారు… పార్టీ ఆడిట్​ రిపోర్టులో వెల్లడించిన దాని ప్రకారం… బ్యాంకుల్లో ఫిక్స్​డ్​ డిపాజిట్లు, లోన్లు, ఆదాయం, స్థిర, చరాస్తులు కలిపి లెక్కేస్తే, నికర మొత్తం రూ.1,509,42,68,576 లెక్క తేలిందట…

– మొత్తం రూ.1,509 కోట్ల ఆస్తుల్లో… నగదు రూపంలోనే రూ.1,431 కోట్లున్నాయి..

– ఏడాది కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న షెడ్యూల్డ్ బ్యాంక్ ఫిక్స్‌‌‌డ్ డిపాజిట్లు ఏకంగా రూ.1,237.80 కోట్లు…

– కరెంట్ అకౌంట్లు, క్యాష్​ బ్యాలెన్స్​ (బీవోబీ), ఎస్బీఐ తదితర బ్యాంకు అకౌంట్లలో రూ.188.31 కోట్లు…

– పార్టీ భవనాలు, స్థలాలు, ఆఫీస్​ల విలువ రూ.66.26 కోట్లు… ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఫర్నిచర్ రూ.12.38 కోట్లు కాగా… జిల్లాల్లోని పార్టీ ఆఫీస్​ల విలువ రూ. 14.30 కోట్లు…

పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి, జాతీయ పార్టీగా చేశారు కదా… మహారాష్ట్రలో పార్టీ ఆఫీసులు తెరిచారు… పూణె 11.73 కోట్లు, నాగపూర్ 6.97 కోట్ల విలువ చూపించారు… ఇవి గాకుండా హైదరాబాద్ కోకాపేట, ఢిల్లీ పార్టీ ఆఫీస్, జిల్లాల్లో భూములు, వాహనాల విలువలు అదనం…

ప్రస్తుతం క్విడ్‌ప్రోకో ఆదాయం రాకపోయినా… బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ వస్తోంది… ఇప్పటికీ కొన్ని కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇస్తున్నాయి… పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి లెజిస్లేటివ్ పార్టీ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు…

అందుకే ఖర్చు దగ్గర వెనకాడటం లేదు… పార్టీ ఆఫీసుల నిర్వహణ, టీన్యూస్, నమస్తే తెలంగాణ, పార్టీ సోషల్ మీడియా విభాగాలు, బినామీ ఖాతాలతో నడిపే సోషల్ ప్రచారాలు, పార్టీ కార్యక్రమాల ఖర్చులు కలిసి తడిసి మోపెడవుతున్నా సరే… అధికారిక, అనధికారిక సంపాదన లెక్కలేనంత ఉండటంతో పెద్ద ఫరక్ పడటం లేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిచ్ – రిచర్ – రిచెస్ట్ ! బీఆర్ఎస్ ఖజానాకు అడ్డగోలు ధనకళ !!
  • తప్పుడు కేసుతో నష్టం విలువ ఎంత..? మరి న్యాయం మాటేమిటి..?
  • జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!
  • ఇడిసిపెట్టలేదు- ఒడిసిపట్టలేదు… హరీష్- కేటీయార్ క్షుద్ర రాజకీయం !
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • నా చిన్నప్పటి ప్రియురాలు… ఈరోజుకూ కలలో పలకరిస్తుంది…
  • ప్రహార్ ! బాలీవుడ్ మరో మేలిమి కథ ! కసబ్ విచారణలో కొత్త కోణాలు !!
  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions