Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తప్పుడు కేసుతో నష్టం విలువ ఎంత..? మరి న్యాయం మాటేమిటి..?

October 18, 2026 by M S R

.

Ashok Kumar Vemulapalli … ఎన్న విలై… ఎన్న అంటే ఎంత… విలై అంటే ధర లేదా విలువ… అంటే సినిమా టైటిల్‌కు అర్థం ధర ఎంత..?
మనిషి పరువుకు విలువ ఎంత?
కొన్ని సినిమాలు కన్నీళ్లు పెట్టిస్తాయి.. మరికొన్ని మనసును కదిలిస్తాయి. కానీ కొన్ని సినిమాలు మన సమాజం, న్యాయవ్యవస్థ తీరును ప్రశ్నిస్తాయి. తమిళ చిత్రం ‘ఎన్నావిలై’ అలాంటి ఓ బలమైన భావోద్వేగ కథనం.

రామేశ్వరంలో సముద్రంలో చేపలు పడుతూ జీవించే తవసుముత్తు.. సముద్రంలో దొరికిన ఓ ఆభరణాన్ని నిజాయితీగా పోలీసులకు అప్పగిస్తాడు. కానీ అతని నిజాయితీయే అతనికి శాపమవుతుంది. ఓ కానిస్టేబుల్ అతన్ని దొంగతనం కేసులో ఇరికిస్తాడు. చేయని నేరానికి అరెస్టు.. జైలు జీవితం.. టీవీలు, సోషల్ మీడియాలో దొంగగా ప్రచారం.. చివరకు అతని కుటుంబం కూడా సమాజం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి!

Ads

ఆ ఆభరణం వెనుక ఉన్న అసలు నిజం బయటపడే వరకు తవసుముత్తు పడిన నరకయాతన వర్ణనాతీతం. చివరకు ఓ సినీ ప్రముఖురాలు కోర్టులో నిజం చెప్పడంతో అతను నిర్దోషి అని తేలుతుంది.
కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది!

enna vilai

తవసుముత్తు తరఫు న్యాయవాది కోర్టులో నిలబడి అడిగే ప్రశ్న ఒక్కటే.. నిర్దోషిని దోషిగా చిత్రీకరించి, అతని పరువును బజారుకీడ్చిన వ్యవస్థకు బాధ్యత లేదా? పోయిన పరువుకు విలువ ఎంత?

తప్పుడు కేసులో ఇరికించిన కానిస్టేబుల్ పాత్ర నుంచి, ఆరోపణలను ముందుకు తీసుకెళ్లిన ప్రాసిక్యూషన్ వరకు.. ప్రతి ఒక్కరి బాధ్యతను ప్రశ్నించే న్యాయవాది వాదనలు ప్రేక్షకుడిని కదిలిస్తాయి. నిర్దోషిగా విడుదల చేయడం మాత్రమే న్యాయం కాదు.. సమాజం ముందు అతని గౌరవాన్ని తిరిగి నిలబెట్టడం కూడా న్యాయంలో భాగమేనని సినిమా బలంగా చెబుతుంది.

ఇక సోషల్ మీడియా గురించి సినిమాలో వచ్చే భావన మరింత ఆలోచింపజేస్తుంది. ఒక రోజులోనే సోషల్ మీడియా ఒకరిని హీరోను చేయగలదు.. అదే వేగంతో జీరోను కూడా చేయగలదు. క్షణాల్లో తీర్పులు చెప్పే ఈ ప్రపంచంలో నిజం తెలుసుకునే ఓపిక మాత్రం ఎంతమందికి ఉంది?

పరువు నష్టం కేసులు, తప్పుడు ఆరోపణలు, మీడియా కథనాలు, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం.. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్న విషయాలే. కానీ ఒక మనిషి నిర్దోషి అని తేలిన తర్వాత, అతనిపై పడిన మచ్చను చెరిపే బాధ్యత ఎవరిది? అతని కుటుంబం అనుభవించిన అవమానానికి పరిహారం ఏమిటి?

‘ఎన్న విలై’ అడిగే ప్రశ్నలు ఇవే. ఆభరణానికి విలువ కట్టగలం.. నిధికి విలువ కట్టగలం.. కానీ ఓ మనిషి ఆత్మగౌరవానికి, అతని కుటుంబం కోల్పోయిన పరువుకు విలువ కట్టగలమా?
నిజం బయటపడటంతో కేసు ముగియవచ్చు. కానీ అవమానంతో గాయపడిన మనసుకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది?

న్యాయం అంటే నిర్దోషిని విడుదల చేయడం మాత్రమే కాదు.. అతని మీద పడిన మచ్చను తొలగించి, కోల్పోయిన గౌరవాన్ని తిరిగి నిలబెట్టడం కూడా!
ఓ సామాన్యుడి కన్నీటి కథగా మొదలై, వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి చేరిన ‘ఎన్న విలై’.. ఆలోచింపజేసే, మనసును కలచివేసే భావోద్వేగ చిత్రం… …. అశోక్ వేములపల్లి (NETFLIX ) లో ఉంది ఈ సినిమా )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తప్పుడు కేసుతో నష్టం విలువ ఎంత..? మరి న్యాయం మాటేమిటి..?
  • జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!
  • ఇడిసిపెట్టలేదు- ఒడిసిపట్టలేదు… హరీష్- కేటీయార్ క్షుద్ర రాజకీయం !
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • నా చిన్నప్పటి ప్రియురాలు… ఈరోజుకూ కలలో పలకరిస్తుంది…
  • ప్రహార్ ! బాలీవుడ్ మరో మేలిమి కథ ! కసబ్ విచారణలో కొత్త కోణాలు !!
  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions