Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫ్రాన్స్ బొద్దింకలు తగులబెట్టేస్తున్నాయి… ఇండియా బహుపరాక్…

October 18, 2026 by M S R

.

Nàgaràju Munnuru …….. == ఫ్రాన్స్ తగలబడుతుంది ==
మొహానికి నల్లని ముసుగులు ధరించిన అల్లరిమూకలు, దోపిడీదారులు ఫ్రాన్స్ వ్యాప్తంగా నగరాల్లో బీభత్సం సృష్టిస్తున్నారు. వ్యాపార సముదాయాల్లోకి చొరబడి దోపిడీ చేస్తున్నారు. చారిత్రక కట్టడాలకు నిప్పు పెడుతున్నారు.

బోర్డోలోని లూయిస్ విట్టన్, మార్సెయిల్‌లోని హెర్మెస్ వంటి విలాసవంతమైన దుకాణాలను ఖాళీ చేస్తున్నారు. మరోవైపు, నల్లని దుస్తులు ధరించిన అల్లరిమూకలు పోలీసులతో ఘర్షణ పడుతూ పారిస్‌లోని అధికార కేంద్రాల వైపు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Ads

ఫ్రాన్స్‌లోని 143 ఏళ్ల చారిత్రక లిమోజెస్ నగర పాలక భవనానికి వామపక్ష-ఇస్లామిక్ అనుబంధ అల్లరిమూకలు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. టౌలౌస్‌లో జోన్ ఆఫ్ ఆర్క్ విగ్రహానికి హిజాబ్ తొడిగి, దాని పక్కన పాలస్తీనా జెండాను ఉంచారు.

అదే సమయంలో, దేశవ్యాప్తంగా అల్లరిమూకలు పాలస్తీనా జెండాలను పట్టుకుని తిరుగుతున్నారు. ఇవి విద్యార్థుల నిరసనలు కావని, సోషలిస్ట్, కమ్యూనిస్ట్, ఇస్లామిక్ పార్టీల మద్దతు, నిధులతో జరుగుతున్న అల్లర్లని నిపుణులు అంటున్నారు.

ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా వీధుల్లో 550,000 మంది అల్లరి మూకలు ఉన్నాయని, వీరిలో పారిస్‌లో సుమారు 110,000 మంది ఉన్నారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ వెల్లడించగా, అనధికార వర్గాలు మాత్రం ఈ సంఖ్య దాదాపు 800,000గా పేర్కొన్నారు. వీరిలో సుమారు 400 మందిని అరెస్టు చేశారు, వీరిలో విద్యార్థులు ఎవరూ లేరు, అందరూ పెద్ద వయస్సు వారే.

ఫ్రాన్స్ లోని మార్సెయిల్‌లో, బూషెస్-డు-రోన్ ప్రిఫెక్ట్, జాక్వెస్ విట్కోవ్స్కీ నగరాల్లో సుమారు 7000 నుండి 8000 మంది దోపిడీదారులు హెర్మెస్ బోటిక్, ఎస్ఎఫ్ఆర్ స్టోర్, బట్టల దుకాణాలు, ఇంకా ఇతర డజన్ల కొద్దీ దుకాణాలను దోచుకున్నారు. తమ దుకాణాన్ని లూటీ చేయవద్దని ఒక మహిళా యజమానురాలు నిరసనకారులను వేసుకున్నప్పటికీ వారు ఆమెను పక్కకు తోసి దుకాణంలోకి చొరబడి దోచుకోవడమే కాకుండా దుకాణాన్ని ధ్వంసం చేసిన వీడియోలో కనబడింది.

france

అల్లరి మూకలు, వ్యూ-పోర్ట్‌లోని మేయర్ కార్యాలయం చెక్క తలుపులను పగులగొట్టి లోపల ఉన్న మరియాన్నె విగ్రహాన్ని పడగొట్టారు, ఫర్నిచర్‌ను పగలగొట్టారు, మరియు ఒక గోడపై వృత్తంలో ‘A’ అనే అరాచకవాద చిహ్నాన్ని స్ప్రే పెయింట్‌తో గీశారు.
“ఇదే విప్లవం, బాస్టిల్‌ను స్వాధీనం చేసుకుందాం!” అనే నినాదాలు చేశారు.
కానెబియెర్‌లోని ఒక మున్సిపల్ పోలీస్ స్టేషన్‌ను కూడా ధ్వంసం చేశారు, దాని లోపల పొగ బాంబులు విసిరారు.

బోర్డోలో, దోపిడీదారులు వాణిజ్య వీధుల వెంబడి ఉన్న లూయిస్ విట్టన్ స్టోర్, యాపిల్ స్టోర్, డెకాథ్లాన్, ఇతర రిటైలర్లపై దాడి చేశారు; జిరాండ్ ప్రిఫెక్ట్ అధికారిక నివాసాన్ని దోచుకున్నారు.
లిమోజెస్‌లో, ముసుగులు ధరించిన బృందాలు 19వ శతాబ్దపు టౌన్ హాల్‌లోకి బలవంతంగా ప్రవేశించి, దానికి నిప్పంటించి ధ్వంసం చేశాయి. గంటల గోపురం కూలిపోయింది, పశ్చిమ భాగం మినహా పైకప్పు కింది అంతస్తులపై పడింది, మరియు భవనం ముఖభాగంలో మూడింట రెండు వంతులు నాశనం అయ్యింది.

ఈ భవనం ఫ్రాన్స్ రక్షిత స్మారక చిహ్నలలో ఒకటి. ఇది దాదాపు పూర్తిగా ధ్వంసం కావడంతో, లోపల ఉన్న చారిత్రక అలంకరణ వస్తువులు – హెన్రీ-పాల్ మోట్ చిత్రాలు, జీన్-జోసెఫ్ వీర్ట్స్ చేసిన పైకప్పు, గోడల అలంకరణలు, అర్బైన్ బూర్జువా అందించిన కానుకలతో సహా ధ్వంసమైనట్లు తెలుస్తుంది.

ఇక పారిస్ నగరంలో మాస్కులు, గాగుల్స్ ధరించిన అల్లరి మూకలు ప్లేస్ డి లా రిపబ్లిక్ సమీపంలో రాళ్లు, బాణసంచా విసిరారు; పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులతో ప్రతిస్పందించారు.
అల్లరిమూకలు పారిస్ వీధుల్లో కార్లను తగులబెట్టారు. 300 మందికి పైగా అల్లరి మూకలు దిగువ చాంప్స్-ఎలిసీస్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉండటం వల్ల పోలీసులు ఆ ప్రాంతాన్ని మూసివేశారు.

పారిస్ మేయర్ ఇమ్మాన్యుయెల్ గ్రెగోయిర్ పారిస్ వీధులన్నీ పద్ధతి ప్రకారం ధ్వంసం చేయబడ్డాయని వర్ణించారు. లియోన్‌లో పర్యాటక కార్యాలయాన్ని తగలబెట్టారు.
చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసి, వ్యాపార సంస్థలను దోచుకున్న వారిపై “విచారణ జరిపి, శిక్ష విధిస్తామని” మరియు “అరాచకానికి కారకులైన వారికి” వ్యతిరేకంగా ఫ్రాన్స్ నిలబడుతుందని మాక్రాన్ పోస్ట్ చేశారు.

అసలు విషయం ఏమిటంటే ఫ్రాన్స్ విద్యాలయాల్లో సరిపడా టీచర్లు లేరని మొదట నిరసనలు ప్రారంభించారు. కానీ ఈ నిరసనల్లో ఎక్కడ విద్యార్థులు లేరు. వారి పేరుతో ఫ్రాన్స్ లోకి వలస వచ్చిన ఇస్లామిక్ దేశస్థులు విద్వంసం చేయడం మొదలు పెట్టారు. వీళ్ళు విద్యార్థులు కాదు, నేరస్థులు కూడా కాదు, తీవ్రవాదులు.

తాము సురక్షితంగా ఉన్నాం అనుకుంటున్న బావిలో కప్పలు మరిగే నూనెలో పడేవరకు మేల్కొనరు. దేశం ప్రశాంతంగా ఉన్నంత వరకే మన ఆస్తులు, ప్రాణాలకు రక్షణ. ఈ విషయంలో ప్రపంచం ఎంత తొందరగా మేల్కొంటే అంత తక్కువ నష్టంతో బయటపడుతుంది. ఉదాహరణకు కావాలంటే పోలాండ్ దేశాన్ని చూసి నేర్చుకోవచ్చు….



Pardha Saradhi Upadrasta …. 
Happiness Index France = 35 India = 116
Passport Index France = 2 India = 84
Human Freedom Index France = 33 India = 110
Democracy France = 26 India = Flawed
Press Freedom France = 25 India = 157
Freedom of looting Luxury Stores France = 1 India = Delhi Police



ఈ రెండు పోస్టులు చాలు కదా… మన దేశంలోనూ ఏం జరగాలని విచ్ఛిన్నకర శక్తులు ప్లాన్ చేస్తున్నాయో… తిరగబడండి అని ఆర్మీకి థృవ్ రాఠీ పిలుపు, బంగ్లాదేశ్ ఆదర్శమన్న నేహా బోరా, ఉద్యమం ఆగదన్న దీప్కే, రెజీమ్ చేంజ్ కోసమే అని తేల్చేసిన ప్రశాంత్ భూషణ్… సుప్రీం కోర్టుకే రాహుల్ ఝలక్కులు… సేమ్, నీట్ సాకుతో స్టార్ట్… సీఈసీ పేరుతో పెట్రోల్… వీథుల్లో అల్లర్లకు ప్లాన్… ఫ్రాన్స్‌ను చూసైనా అర్థం చేసుకుందాం…

పర్టిక్యులర్‌గా న్యాయ వ్యవస్థ, మీడియా అర్థం చేసుకోవాలి… అంతా బాగున్నప్పుడు ఫ్రీడం, ప్రాస్పరిటీ విలువ అర్థం కాదు సమాజానికి… ఇండియాలోనూ బొద్దింకల సపోర్టర్స్  యూరప్‌లోని ఇతర దేశాలకూ అల్లర్లను విస్తరింపజేయాలనే ప్రయత్నాలు… మన పక్కనే నేపాల్, బంగ్లాదేశ్ గత పరిణామాలు… మన సమాజానికి పాఠాలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫ్రాన్స్ బొద్దింకలు తగులబెట్టేస్తున్నాయి… ఇండియా బహుపరాక్…
  • జియో ఐపీఓ పూర్తవగానే… మస్క్ ‘స్టార్‌లింక్’కు గ్రీన్ సిగ్నల్?
  • రిచ్ – రిచర్ – రిచెస్ట్ ! బీఆర్ఎస్ ఖజానాకు అడ్డగోలు ధనకళ !!
  • తప్పుడు కేసుతో నష్టం విలువ ఎంత..? మరి న్యాయం మాటేమిటి..?
  • జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!
  • ఇడిసిపెట్టలేదు- ఒడిసిపట్టలేదు… హరీష్- కేటీయార్ క్షుద్ర రాజకీయం !
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • నా చిన్నప్పటి ప్రియురాలు… ఈరోజుకూ కలలో పలకరిస్తుంది…
  • ప్రహార్ ! బాలీవుడ్ మరో మేలిమి కథ ! కసబ్ విచారణలో కొత్త కోణాలు !!
  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions