Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్షరధామ్‌లో వికలమైన మనసు… ఇదుగో ఇక్కడ కుదుటపడింది…

October 19, 2026 by M S R

.

ఇదే న్యూజెర్సీ… వందల ఎకరాల్లో విస్తరించిన, అద్భుతమైన వాస్తు నిర్మాణంతో విలసిల్లుతున్న అక్షరధామ్ స్వామి నారాయణ్‌ను చూశాక వికలమైన మనసు ఇదే న్యూజెర్సీలోని బ్రిడ్జి వాటర్ వెంకటేశ్వరుడి గుడి చూశాక  చక్కబడింది… పిట్స్‌బర్గ్ బాలాజీ టెంపుల్ తరువాత ఇదే పెద్ద గుడి అని చెప్పారు అక్కడ… నిజమే… మరెందుకు నచ్చిందంటే..?

మొన్న చెప్పుకున్నాం కదా, అక్షరధామ్ ఎందుకు నచ్చలేదో… ఆది దేవతలు శక్తి, త్రిమూర్తులను పక్కకు తోసేసి… తొలుత వైష్ణవుడే అయిన స్వామి నారాయణ్ అనే ఓ భక్తుడిని క్రమేపీ దేవుడిని చేశారు… సుప్రీం గాడ్ అన్నారు… ultimate soul అని పేరు పెట్టారు… గర్భగుడిలో ఈ స్వామి నారాయణుడు కొలువు దీరితో హిందూ ఆది దేవతలు చిన్న చిన్న అరల్లో సర్దుకున్నారు పాపం…

Ads

వీసమెత్తు స్పిరిట్యుయల్ వైబ్స్ లేవు… సరే, ఎవరి నమ్మకాలు వాళ్లవి, మనకు నచ్చనంతమాత్రాన ఎవరికీ నచ్చొద్దని అనలేం కదా… మరి ఈ బ్రిడ్జి వాటర్ టెంపుల్..? ప్రధానంగా వెంకటేశ్వర స్వామి గుడి… కానీ దేవతలందరి భక్తులూ రావాలి కదా…

bridgewater temple

శివుడున్నాడు… రామకృష్ణులున్నారు… శ్రీదేవి, భూదేవి, గణుషుడు, ఆంజనేయుడు… చివరకు అయ్యప్ప… తప్పదు కదా, నవగ్రహాలూ కొలువు తీరాయి… నిజానికి ఇవి కాదు కనెక్ట్ కావడానికి వేరే కారణాలున్నాయి… అక్షరధామ్ చూసిన చిరాకు మొత్తం పోవడానికి…

అక్కడ సిబ్బందిలో ఎక్కువ శాతం తెలుగు వాళ్లు… అర్చకులకూ తెలుగు తెలుసు… వచ్చేది కూడా ఎక్కువ తెలుగు భక్తజనమే… సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు… వందల మంది మహిళలు హన్మకొండ పద్మాక్షి గుట్ట దగ్గరకు వచ్చినట్టే… పట్టుచీరెలు, చేతుల్లో బతుకమ్మలతో వచ్చారు… ఆడారు… పాడారు… (ఏమో, తెలంగాణతనం నిండుగా కనిపించి గుడి హఠాత్తుగా కనెక్టయిందేమో)…

bridge water

దసరా కదా… బొమ్మల కొలువు పెట్టారు… గిఫ్ట్ షాపులో ధరలు గానీ, ప్రసాదాల ధరలు గానీ పెద్దగా లేవు – అర్చనకు గానీ పెద్ద ఫీజుల్లేవు… చివరకు క్యాంటీన్‌లో రేట్లు కూడా రీజనబుల్… అక్షరధామ్ క్యాంటీన్‌లో రుచి తక్కువ- (విమానాల్లో పెట్టే ఫుడ్ టైప్)… పతంజలి మార్క్ షాపులు, అడ్డగోలు రేట్లు… కానీ బ్రిడ్జి వాటర్‌ గుడి చాలా బెటర్…

bridgewater temple

ప్రతి పండక్కి ఏదో ఓ ఈవెంట్ చేస్తారట… వచ్చిన ప్రతి భక్తుడికీ ఏదో ఓ ప్రసాదం పెడతారు… వాలంటీర్లు… ఎస్, ఇది మామూలుగా కనిపించే గుడి… అక్షరధామ్ మార్క్ పటాటోపం, పాలరాతి మెరుపులు, శిల్ప విన్యాసాలు లేవు… కానీ ఇక్కడ తెలుగుతనం ఉంది…

భక్తి ఉంది… ప్రదక్షిణ ఉంది… అభిషేకం ఉంది… అర్చనలున్నాయి… హారతి ఉంది… శఠగోపం, తీర్థం సహా పక్కా మనకు తెలిసిన ఆగమం కనిపించింది..!! ఈ దేవుడు నచ్చాడు..!! ఈయన మనిషిగా పుట్టి సుప్రీం దేవుడు కాలేదు స్వామి నారాయణుడిలాగా… ఆ స్వామి నారాయణుడే మనిషిగా పుట్టాడు కదా..!! తేడా అర్థమైంది కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అక్షరధామ్‌లో వికలమైన మనసు… ఇదుగో ఇక్కడ కుదుటపడింది…
  • web-fraud-lottery… ఈ యూరో లింకుల్ని నమ్మకండి – అంతా డ్రామా !!
  • ఒక రష్మిక, ఒక పీవీ సింధు – ఈ మట్టికి కొత్త కోడళ్లు – అవమానించకండి
  • ఆ ముళ్ళదారి తెలియకుండా- ఆమె పాదాల మచ్చలపై తీర్పులొద్దు!
  • నాడు అల్లు అర్జున్ అరెస్టు – మరి ఎంవీఎస్‌ఆర్ దుర్ఘటనపై ..?!
  • ఫ్రాన్స్ బొద్దింకలు తగులబెట్టేస్తున్నాయి… ఇండియా బహుపరాక్…
  • జియో ఐపీఓ పూర్తవగానే… మస్క్ ‘స్టార్‌లింక్’కు గ్రీన్ సిగ్నల్?
  • రిచ్ – రిచర్ – రిచెస్ట్ ! బీఆర్ఎస్ ఖజానాకు అడ్డగోలు ధనకళ !!
  • తప్పుడు కేసుతో నష్టం విలువ ఎంత..? మరి న్యాయం మాటేమిటి..?
  • జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions