Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామాయణ ! ఓ సినిమా మాత్రమే కాదు – ఓ భారీ గ్లోబల్ పందెం !!

October 20, 2026 by M S R

.

నవీన్ కుమార గౌడ… అలియాస్ యశ్… టాక్సిక్‌తో భంగపడ్డాడు… ఇప్పుడిక రామాయణ్ సినిమాతో పెద్ద గేమ్ ఆడబోతున్నాడు… 4 వేల ఖర్చు అని చెప్పబడుతున్న ఈ సినిమాకు యశ్ సహనిర్మాత… రావణ పాత్రలో నటించినందుకు రెమ్యునరేషన్ కాదు, ఏకంగా సౌత్ ఇండియా రైట్స్ తీసుకున్నాడని ఇండస్ట్రీలో టాక్…

ఒక్క తెలంగాణ, ఏపీలో మాత్రం దిల్ రాజు ప్లస్ తను కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తారట… టాక్సిక్‌తో నెత్తికి చేతులు పెట్టుకున్న దిల్ రాజుకు కాస్త పరిహారం ప్లస్ అడ్జస్ట్‌మెంట్ అన్నమాట… తమిళనాడు, కన్నడ ఏరియాల్లో ఎవరితో కలిసి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడో స్పష్టత లేదు కానీ కేరళలో ఏవీఏ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది… ఓ భారీ పందేనికి రెడీ అయిపోయాడు ఇలా యశ్…

Ads

జస్ట్, కేవలం రెండు భక్తి పాటలున్న ఓ సాదాసీదా సినిమాకే ఇరుముడి సినిమాకే జనం భారీగా తరలివచ్చారు… పలుచోట్ల అద్దె వాహనాలు మాట్లాడుకుని మరీ వచ్చారు… అలాంటిది ప్రస్తుత భక్తి ట్రెండ్‌లో ఇక అవతార్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రామాయణాన్ని చూపిస్తే… ఆ రేంజ్ గ్రాఫిక్స్‌తో రాముడి కథను కొత్తగా చెబితే ఇక తిరుగేముంది..? ఇదీ యశ్ నమ్మకం…

yash

దంగల్ తీసిన దర్శకుడు… పేరొందిన హాలీవుడ్ చిత్రాలకు గ్రాఫిక్స్ గట్రా వృత్తి నైపుణ్యాల్ని అందించిన మల్హోత్రా నిర్మాత… (The odessy, instrastellar, Dune వీళ్లే VFX చేసింది…) ఇప్పటికి రిలీజైన ట్రెయిలర్లలో గ్రాఫిక్స్ నాణ్యత తెలుస్తూనే ఉంది… అంతేకాదు, గ్లోబల్ ఇండియన్ సినిమా పేరుతో… అన్నిచోట్లా ప్రమోషన్లు చేస్తున్నారు… ఆల్రెడీ హాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తెలిసిన నిర్మాతే కాబట్టి అలవోకగా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు…

రణవీర్, సాయిపల్లవి, యశ్ విరివిగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు… హాలీవుడ్‌లో దాదాపు 30 నిమిషాల ఎడిటెడ్ వర్షన్ చూపించారట… తరువాత 12 నిమిషాల ఫీడ్ బాలీవుడ్ ప్రముఖులకు (ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్) ముంబైలో ప్రత్యేకంగా చూపించారు, చప్పట్లు పడ్డాయట… 7 నిమిషాల బిట్ కీలకమైన హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ముఖ్యులకు చూపిస్తున్నారు…

ramayan

ప్రధానంగా గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే కాదు… అనిరుధ్ రవిచందర్‌తో బలమైన పోటీ కారణంగా రెహమాన్ ఈ సినిమాకు తన సర్వశక్తులూ వినియోగించాడనీ, బీజీఎం, పాటలు అన్ని భాషల్లోనూ బాగా కుదిరాయనీ అంటున్నారు… ఆస్కార్ అవార్డుల లాబీయింగ్ బాగా తెలిసిన నిర్మాత కాబట్టి రామాయణ్‌కు ఆస్కారం’ కూడా ఉన్నట్టే…

ఇంకో విషయం ఏంటంటే… షూటింగ్ టైంలోనే IMAX ఫార్మాటులో తియ్యడం గ్లోబల్ ఆడియన్స్ కోసం… ఇది మన చరిత్ర, ఇది మన సంస్కృతీ, ఇది మన ఎమోషన్, ఇది మన జీవన విధానం… అని ప్రపంచానికి చెప్పే సినిమాగా ఉండాలని నిర్మాత సంకల్పం…

saipallavi

ఇక్కడే ఇంకోమాట… జీ5లో జయమ్ము నిశ్చయమ్మురా అనే ఓ చిట్‌చాట్ షో వస్తుంది కదా, జగపతిబాబు హోస్ట్… సాయిపల్లవితో చాట్ ప్రసారం జరుగుతుంటే ఊహించని రీతిలో వ్యూస్ పెరిగి, ఓ దశలో స్ట్రీమింగ్ స్లో అయిపోయిందట ఆ తాకిడికి… నిజంగా సాయిపల్లవి మోస్ట్ లక్కీయెస్ట్ సీత పాత్ర దక్కడం… అసలు ఆ షోలో ‘మంచి ప్రశ్నలు’ కూడా ఏమీ లేవు… కానీ ఈరోజుకూ సాయిపల్లవి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణకు ఆ తాకిడి ఓ నిదర్శనం… సో, అన్నీ మంచి శకునములే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రామాయణ ! ఓ సినిమా మాత్రమే కాదు – ఓ భారీ గ్లోబల్ పందెం !!
  • వీ6వెలుగు Vs బీఆర్ఎస్ ! KCR కొండపోచమ్మ నీటిమళ్లింపు రాద్ధాంతం !!
  • అక్షరధామ్‌లో వికలమైన మనసు… ఇదుగో ఇక్కడ కుదుటపడింది…
  • web-fraud-lottery… ఈ యూరో లింకుల్ని నమ్మకండి – అంతా డ్రామా !!
  • ఒక రష్మిక, ఒక పీవీ సింధు – ఈ మట్టికి కొత్త కోడళ్లు – అవమానించకండి
  • ఆ ముళ్ళదారి తెలియకుండా- ఆమె పాదాల మచ్చలపై తీర్పులొద్దు!
  • నాడు అల్లు అర్జున్ అరెస్టు – మరి ఎంవీఎస్‌ఆర్ దుర్ఘటనపై ..?!
  • ఫ్రాన్స్ బొద్దింకలు తగులబెట్టేస్తున్నాయి… ఇండియా బహుపరాక్…
  • జియో ఐపీఓ పూర్తవగానే… మస్క్ ‘స్టార్‌లింక్’కు గ్రీన్ సిగ్నల్?
  • రిచ్ – రిచర్ – రిచెస్ట్ ! బీఆర్ఎస్ ఖజానాకు అడ్డగోలు ధనకళ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions