.
ఇడుపు కాయితం టైటిల్, కథానాయికగా నాగదుర్గ, లీడ్ రోల్‌కు ప్రియదర్శి ఎంపికల దగ్గర నుంచి… తెలంగాణ కథా నేపథ్యం- ఆత్మ దాకా… ప్రతి విషయంలోనూ మోస్తున్న తెలంగాణ ప్రేమికులు కూడా ఇప్పుడు సిగ్గుతో, బాధతో తలవంచుకునే ధోరణి కనిపిస్తోంది…
హేమిటో, కొత్తగా పెళ్లయిన జంట కారు దిగి, ఇంటి గడప దగ్గరే, అమ్మలక్కల ఎదుట ఓ పుస్తె మెడలో వేయడం ఏమిటో… ఆ వెంటనే పెళ్లి భోజనాల దావత్‌లో గ్లాసుల్లో మందు పోయడం ఏమిటో… మిత్రుడు Kumar Kowtam రాసిన ఓ పోస్టు ఓసారి చదవండి… తెలంగాణ కల్చర్ అంటే మందు తాగుడు, మటన్ తినుడేనా..? తెలంగాణను ఇలాగేనా ప్రొజెక్ట్ చేయడం..?
Ads

నాది గోదావరిఖని/ మంథని. ఇడుపు కాయిదం సీనిమాలో పాట సూశినంక నాకే కలుక్కుమన్నట్టైంది..
తెలంగాణ కల్చర్ అందరికి తెల్శేతట్టు సీన్మలు తీస్తే ముందుగాలు ముర్శేది తెలంగాణోల్లే. కాని తెలంగాణ అంటే మందు తాగుడు, మటన్ తినుడే అన్నట్టు సూపెడితే ఎట్లా?
యే సీన్మల సూసినా.. బొక్కలు తిని మెడలేసుకున్నట్టు మొత్తం అవ్వే సూపెడుతున్నరు. ఎన్నెన్నో మంచి పద్దతులు, ఆచారాలు ఉండంగ మందు, మటన్కే పడి చస్తరన్నట్టు సూయించుట్ల అబ్సెషన్ ఏందో అర్దమైతలే !
పుట్టినప్పటి సంది పెండ్లి భోజనాలల్ల నీల్లకు బదలు మందు కలిపి పోసుడైతే నేనైతే ఏడా సూడలే.. ఫంక్షన్లైతే కొన్ని చోట్ల కొంతమంది వాళ్ల తాకత్ ను బట్టి దావత్ల మందు పెడ్తరు గాని అందరు పెట్టరు. ఒక వేళ పెట్టినా సీన్మలో సూయించినంత లేకిగైతే ఉండది. తెలంగాణ సంప్రదాయమంటే మందు, మటన్, బోటి.. లోప్క తాగుడు.. పీక్క తినుడు బస్ గంతేనా ఇగ ..?
నిజాలు తీయకపోయిన మంచిదే గాని నిందలేస్తట్టైతే తీయకుర్రి. మన ఆచారాలు, మన మర్యాదలు, మన కట్టుబొట్టు, మన సంస్కృతి, మన ఆత్మగౌరవం ఎట్లుంటదన్నది సూపెట్టుర్రి మంచిదే. కాని గిట్ల మందునే , మాంసాన్నే హైలెట్ చేసుడైతే మంచిగనిపిస్తలేదు .
తెలంగాణ కల్చర్ను, ట్రెడిషన్స్ ని ప్రమోట్ చేస్తున్నమనే భ్రమల మందు గిలాసలు, మటన్ , బోటి ప్లేట్లకే అద్దుకోకుర్రి. నవ్వేటోల్ల ముందు బోర్లవడ్డట్టు తక్వ చేయకుండ్రి ..
మీకు పుణ్యం ఉంటది..
Share this Article