.
శతృఘ్న్ సిన్హా బిడ్డ సోనాక్షి సినిమా… మస్తు ఖర్చు పెట్టి తీశారు… బాలీవుడ్ అంటేనే బోలెడంత మార్కెట్… పేరు ‘తు హై మేరీ కిరణ్‘… వసూళ్లు తెలుసా..? మొదటి రోజు 14 లక్షలు… రెండో రోజు 10 లక్షలు… మూడో రోజు 10 లక్షలు… అంతే…
పిచ్చిది బొద్దింకల ఆందోళనలకు మద్దతు పలికింది కదా… అందుకే, ఆమె ధోరణికి నిరసనగానే జనం ఛీత్కరించారు… ఆ ప్రభావమే ఈ దారుణ వసూళ్లు… మంచిగైంది… అలాగే కావాలి….. ఇలాంటి పోస్టులు, పోస్టర్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి…
Ads
బొద్దింకల్ని ప్రేమించినందుకే నిజంగా జనం ఆమెను ఛీకొట్టారా..? నిజం చెప్పాలంటే… సినిమా ఓ నాసిరకం… ఆమె శతృఘ్న సిన్హా బిడ్డ అయితేనేం..? ఎవరయితేనేం..? సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే తిప్పికొడతారు… ఇక్కడ కూడా జరిగింది ఇదే…
పాత ఫోన్.. కొత్త చిక్కులు! సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ Tu Hai Meri Kiran కు కరణ్ రావల్ దర్శకత్వం… టైటిల్ వినగానే 1990లలో షారుఖ్ ఖాన్ నటించిన Darr గుర్తుకు రావడం సహజం… ఆ సినిమాలో ఏకపక్ష ప్రేమతో అమ్మాయి వెంటపడే వ్యక్తి కథను ఉత్కంఠభరితంగా చూపించారు… ఇక్కడా అలాంటి ఛాయలే ఉన్నా, దర్శకుడు దానికి కాలాన్ని దాటే ఫోన్ సంబంధం అనే కొత్త అంశాన్ని జోడించాడు…
2026లో జీవిస్తున్న కిరణ్ (సోనాక్షి సిన్హా)కు ఒక పాత ఫ్లిప్ ఫోన్ దొరుకుతుంది… దాని ద్వారా 2016లో ఉన్న సమర్ (జహీర్ ఇక్బాల్)తో ఆమెకు సంబంధం ఏర్పడుతుంది… పదేళ్ల కాలవ్యవధిలో ఉన్న ఇద్దరి జీవితాలు ఒక ఫోన్ ద్వారా కలవడం.. ఆ పరిచయం క్రమంగా ప్రమాదకరమైన మలుపు తీసుకోవడం కథలోని ప్రధానాంశం…
కిరణ్ వివాహిత… సమర్ మాత్రం ఆమెపై మోజు పెంచుకున్న వ్యక్తి… అతడి ప్రవర్తన సాధారణ ప్రేమికుడిలా ఉండదు… ఆమెను రహస్యంగా చిత్రీకరించడం వంటి పనులతో అతడి అసలు స్వభావం బయటపడుతుంది… అయితే బాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి వ్యక్తులను కొన్నిసార్లు ప్రేమికులుగా చూపిస్తూ, వారి తప్పులకు సైతం సమర్థనలు వెతుకుతుంటారు… ఈ సినిమాలోనూ మొదట సమర్ ప్రవర్తనలోని ప్రమాదకరమైన కోణం కనిపించినప్పటికీ, ఆ తర్వాత కథ అతడికి సాకులు వెతికే దిశగా వెళ్లిపోతుంది…
కథ కొత్తదే.. కథనం తడబడిందే! కాలాన్ని దాటి రెండు వ్యక్తుల మధ్య సంబంధం ఏర్పడటం అనేది ఆసక్తికరమైన కథాంశమే. ఇలాంటి కథల్లో ప్రేక్షకుడికి ఆశ్చర్యం కలిగించాలి. ఏం జరగబోతోందో తెలుసుకోవాలనే ఉత్కంఠను పెంచాలి. కానీ ఆ మలుపులన్నింటికీ ఒక క్రమం ఉండాలి. తెరపై ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ప్రేక్షకుడు పదేపదే బుర్ర గోక్కోవాల్సి వస్తే మాత్రం అది థ్రిల్లర్ గొప్పతనం కాదు.. కథనంలోని గందరగోళం!
ఈ సినిమాలోనూ గతం, వర్తమానం మధ్య కథ వేగంగా అటూ ఇటూ తిరుగుతూ ప్రేక్షకుడిని అలసటకు గురిచేస్తుంది… ఒక దశలో కథలోని ఉత్కంఠ కంటే, ఈసారి ఇంకేం గందరగోళం సృష్టిస్తారో అనే ప్రశ్నే ఎక్కువగా మిగులుతుంది…
అంటే కథలో కొత్త పాయింట్ లేదని కాదు. ఆ పాయింట్‌ను నమ్మదగిన రీతిలో, ప్రేక్షకుడికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడంలోనే సమస్య ఉంది… మంచి కథావస్తువు దొరికినంత మాత్రాన మంచి సినిమా తయారవదు… దానికి పకడ్బందీ స్క్రీన్‌ప్లే, పాత్రల ప్రవర్తనలో సహజత్వం, మలుపులకు సరైన కారణాలు ఉండాలి… అవే లోపిస్తే ఆసక్తికరమైన ఆలోచన కూడా తెరపై తేలిపోతుంది…

నటీనటులు ఏం చేయగలరు? సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ గతంలో Double XL సినిమాలో కలిసి నటించారు. ఈసారి మాత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌లో ప్రధాన పాత్రలు పోషించారు. సోనాక్షి పాత్ర ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకున్న మహిళది. జహీర్ పాత్ర ఆమెపై మోజుతో హద్దులు దాటే వ్యక్తిది.
అయితే నటీనటులు ఎంత ప్రయత్నించినా, పాత్రల స్వభావాన్ని సరిగ్గా నిర్మించలేకపోతే వారి శ్రమకు తగిన ఫలితం దక్కదు. కిరణ్ భర్తగా అంకిత్ గుప్తా, ఆమె తండ్రిగా పూర్ణేందు భట్టాచార్య, సమర్ తల్లిగా జరీనా వహాబ్ వంటి నటులు ఉన్నప్పటికీ, బలహీనమైన రచన ముందు వారి పాత్రలూ పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి…
ముఖ్యంగా స్టాకింగ్‌ను ప్రేమగా చిత్రీకరించే బాలీవుడ్ ధోరణిపై ఈ కథ ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఒక వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడనే కారణంతో మరో వ్యక్తి అతడి వేధింపులను భరించాల్సిన అవసరం లేదు. ఏకపక్ష ప్రేమకు అవతలి వ్యక్తి అంగీకారం తప్పనిసరి. ఈ కోణాన్ని బలంగా చెప్పగలిగితే సినిమా సామాజికంగానూ ప్రభావం చూపేది. కానీ కథనం ఆ దిశగా నిలకడగా సాగలేదు.
నిరసనల ప్రభావమా.. సినిమా లోపాలా? ఇప్పుడు అసలు ప్రశ్న దగ్గరకు వద్దాం. సోనాక్షి సిన్హా వైఖరిపై వచ్చిన వివాదం ఈ సినిమా వసూళ్లను దెబ్బతీసిందా?
సినిమా విడుదలైన తొలి రోజుల్లో దీని వసూళ్లు మరీ పేలవం… దీనికీ ఆమె రాజకీయ వైఖరిని లింక్ చేస్తూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు సినిమా వైఫల్యాన్ని వివాదంతో ముడిపెట్టాయి… కానీ సినిమా కథ, కథనం, ప్రేక్షకుల స్పందన, బుకింగుల పరిస్థితి, సినిమా ప్రదర్శనల సంఖ్య, ప్రచారం, పోటీగా విడుదలైన చిత్రాలు.. ఇలా అనేక అంశాలను పరిశీలించాలి…
ఒకవేళ బొద్దింకలకు సపోర్ట్ చేసే ప్రతివారినీ సమాజం ఛీత్కరిస్తుంది అనేదే నిజమైతే… పెద్ద బొద్దింక ప్రకాశ్ రాజ్ నటిస్తున్న మహేశ్ బాబు- రాజమౌళి కాంబో వారణాసిపై ఆ ప్రభావం ఉంటుందా..? ప్రకాశ్ రాజ్ బొద్దింకలకే గురువు కదా..!!
ఒకటి మాత్రం నిజం… ఆమెకు ఎవడూ చాన్సులు ఇవ్వడం లేదు… దాంతో ఆమే నిర్మాతగా మారింది… మొగుడిని హీరోగా చేసింది… దెబ్బ తిన్నది…
.
Share this Article