Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ‘రామయణం’లో నాకు నచ్చిన నటుడు- వివేక్ విద్యుత్‌జిహ్వుడు!!

November 7, 2026 by M S R

.

‘రామాయణం సినిమా మీద నెగెటివ్, పాజిటివ్, న్యూట్రల్, ప్రాపగాండా… ఏవేవో సమీక్షలు, కథనాలు సరే గానీ… నీకు బాగా నచ్చిన ఆఫ్ స్క్రీన్ అంశమేమిటి’ అనడిగాడు ఓ మిత్రుడు… ‘ఉంది… నాకు హిందీలో నచ్చే నటుడు వివేక్ ఒబెరాయ్ పాత్ర… తన దాతృత్వం’ అన్నాను… మెచ్చుకోలుగా తలూపాడు మిత్రుడు… ఎందుకు..?

తను పోషించిన పాత్ర విద్యుత్‌జిహ్వుడి పాత్ర… అంటే శూర్పణఖ భర్త పాత్ర… సొంత చెల్లెలి భర్త అయినా సరే రావణుడు తనను హతమారుస్తాడు… కారణాలు ఏమైనా సరే… ఇండియన్ సినిమాలో అసలు ఆ పాత్రే కనిపించేది కాదు రామాయణం బేస్డ్ మూవీస్‌లో… సీరియళ్లలో కూడా…

Ads

పేరుకు అది చిన్న పాత్రే… కానీ ఓ ప్రాధాన్యం ఉన్న పాత్రే రావణాయణంలో… దాన్ని పోషించాడు వివేక్ ఒబెరాయ్… అంతేకాదు, ‘ఈ మహాయజ్ఞంలో నేను భాగస్వామిని అవుతున్నందుకు ఆనందంగా ఉంది… నాకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ వద్దు… నాకు ఎంత ఇవ్వాలనుకున్నారో, ఆ మొత్తాన్ని కేన్సర్‌తో పోరాడే పిల్లల కోసం ఇవ్వండి’ అని ఏడాది ముందే ప్రకటించాడు…

దానికితోడు తనకు 50 ఏళ్లు నిండుతున్నాయి కదా, ఆ సందర్భంగా తను స్వయంగా మరో  50 మంది కేన్సర్ బాధిత పిల్లలకు అండగా నిలుస్తున్నాడు… చికిత్స ఖర్చులు భరిస్తున్నాడు… ఈ వెండితెర విద్యుత్ జిహ్వుడు గొప్పోడు… పిల్లికి బిచ్చం పెట్టని స్టార్ హీరోల ప్రపంచంలో ఇతను ఖచ్చితంగా నిజమైన స్టార్…

vivek oberoi

4000 వేల కోట్ల సినిమా… తను కోరుకుంటే బాగానే పారితోషికం వస్తుంది… కానీ తను వద్దనుకున్నాడు… పైగా తనది చిన్న పాత్రే కావచ్చుగాక… దానికి ఎన్నో రెట్లు పెద్ద మనస్సు… ఏ రావణుడు తనను సంహరించగలడు..?

వివేక్‌కు ఇది కొత్తేమీ కాదు… క్యాన్సర్ బాధితుల కోసం పనిచేసే క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ వంటి సంస్థలతో గతంలోనూ కలిసి పనిచేశాడు… అంటే ఇది సినిమా ప్రచారం కోసం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు… చాలాకాలంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలకు మరో అడుగు…

ఈ సినిమా కేవలం ఒక చిత్రం మత్రమే కాదని, భారతీయ సంస్కృతి, విలువల కోసం జరుగుతున్న మహాయజ్ఞమని అభివర్ణించాడు వివేక్. అందులో విద్యుత్‌జిహ్వ పాత్ర పోషించడం తను ఓ చిన్న సమిధ అన్నాడు…

సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి ఇదే అత్యంత భారీ ప్రాజెక్టు…  సో, వందలాది మంది పని, వేల కోట్ల అంచనాలు, భారీ పారితోషికాలు, బాక్సాఫీస్ లెక్కలు చర్చకు వస్తుంటాయి… కానీ అదే సినిమాలో నటించిన ఒక నటుడు తన పారితోషికాన్ని వ్యక్తిగత ఆదాయంగా కాకుండా కొందరు చిన్నారుల ప్రాణాలు నిలబెట్టే అవకాశంగా చూడటం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రణ్‌బీర్‌ నోట తెలుగు పలికింది! బ్రహ్మ AI నేర్పిన ‘డబ్బింగ్ కళ !!
  • రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనే లైవ్ బీజీఎం..!!
  • …. చివరకు మంత్రి ‘అక్షింతల’తో దత్తత వివాదానికి శుభం కార్డ్..!!
  • ఈ సీరియల్ కిల్లర్ ఓ క్రైమ్ రిపోర్టర్ – ఆ పత్రికకు ఎడిటర్- పబ్లిషర్…
  • ఈ ‘రామయణం’లో నాకు నచ్చిన నటుడు- వివేక్ విద్యుత్‌జిహ్వుడు!!
  • ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?
  • స్టార్ హీరోలకు దీటైన ‘మహాశక్తి’ … ఇలాంటి సినిమాలతోనే ‘కొడిగట్టేది’…
  • వీడియోకాన్ – దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద దివాలా కేసు !
  • రామాయణ సినిమా మాత్రమే కాదు… ఈ మహాభారతం ఘనత కూడా చదవండి!
  • మరీ అంత ‘సీన్’ లేదు ! సో సో… అక్కడక్కడా బాగున్నట్టు అనిపిస్తుంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions