.
అర్థరాత్రి ఈ వార్త విభ్రమ కలిగించింది… పవన్ కల్యాణ్, తన మూడో భార్య అన్నా లెజినోవా పరస్పర సమ్మతితో విడాకులు తీసుకుంటున్నట్టు చేసిన ఉమ్మడి ప్రకటన అది… మొదట నమ్మబుద్ది కాలేదు… తరువాత నిజమేనని మీడియా చెప్పింది… మరెందుకు విభ్రమ అంటే..? ఇది తన వ్యక్తిగతమే కావచ్చుగాక, కానీ తను ప్రజాజీవితంలో ఉన్నాడు…
వ్యక్తిగత జీవితంపైనా జనం దృష్టి ఉంటుంది, అంచనాలు ఉంటాయి, విశ్లేషణ ఉంటుంది… పాలక స్థానంలోని వ్యక్తి పది మందికీ ఆదర్శంగా కనిపించాలనే భావన సమాజంలో ఉంటుంది… సమాజంపై ప్రభావం చూపే కేరక్టర్ కాబట్టి… పైగా సినిమా సెలబ్రిటీ, సో, పది మందీ ఇలాంటి పోకడల్లో తనను అనుసరించొద్దుననే ఓ సాధారణ కాంక్ష సమాజం నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది…
Ads

నాకు తెలిసి పవన్ కల్యాణ్ వీరభిమానులకూ ఎక్కడో కలుక్కుమంటుందేమో బహుశా… పైకి అనకపోవచ్చు, కానీ ఎందరు..? అనే ప్రశ్న తప్పకుండా తనకు ఓ మరక… ఖచ్చితంగా… ఆ సంయుక్త విడిపోయే ప్రకటనలో చివరలో రాశారు, మా ప్రైవసీని గౌరవించండి అని… కానీ పవన్, జనం నీకు వోట్లేశారు, నిన్ను నమ్మారు, ఆదర్శంగా ఉండు అని కోరారు, నువ్వు ప్రజాజీవితంలో ఉన్నావు, నీకు సమాజం తక్కువేమీ చేయలేదు- తక్కువేమీ ఇవ్వలేదు… కానీ నువ్వు..?
మొదట్లో వామపక్ష, బహుజనవాదం, ఆదర్శాలు, అభ్యుదయగీతాలు వినిపించావు… తరువాత హఠాత్తుగా సనాతన ధర్మం అన్నావు… సరే, రాజకీయాల్లో ఇప్పుడు సిద్ధాంతాలెక్కడివి, రాద్ధాంతాలు, శుష్క నినాదాలు తప్ప అనుకుని చాలామంది జాలిపడి, మొదట్లో నీ పొలిటికల్ జర్నీ గురించి ఆసక్తిగా గమనించినవాళ్లు కూడా ఇక నీ రాజకీయ ప్రయాణం గురించి ఆలోచించడమే మానేశారు… అలాగే నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా…

అదేమిటి..? ఇది వ్యక్తిగతం కదా అంటావేమో… నీపై అభిప్రాయాన్ని వ్యక్తీకరించే సమాజం నోళ్లు కట్టేయలేవు కదా… మొదట్లో పక్కా ఆంధ్రా, మీ అమ్మాయినే (Intra state) పెళ్లి చేసుకున్నావు… వదిలేశావు… సరే, వ్యక్తిగతం… తరువాత రేణు దేశాయ్, ఈమెది వేరే రాష్ట్రం (Inter state)… చాన్నాళ్లు సహజీవనం, తరువాత తప్పనిసరై, జనం కోసం, జనం చూడటం కోసం పెళ్లి చేసుకున్నావు…
మధ్యలోనే రష్యన్ మహిళ అన్నా లెజినోవాతో ప్రణయం, పరిణయం (Inter national)… (విశ్వమానవుడు?)… రెండో భార్య రేణుకు విడాకులు ఇచ్చినా సరే, నాకు ఎన్నాళ్లీ వనవాసం అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటోంది పదే పదే… అలా నీ సర్కిల్ నుంచి వేధింపులు..? ఇప్పుడు ఈ మూడో పెళ్లికీ మూడాకులు… నిన్ను వ్యతిరేకించే జనం ఓ ప్రశ్న సంధించే చాన్సుంది వెటకారంతో…

First one Intra State, Second one Inter state, Third one Inter national… What next..? ఇంకెవరు, ఇంకెందరు..? ఇది వెటకారమే కావచ్చుగాక, కానీ అందులో విమర్శ, జాలి, ఆగ్రహం ఉంది… దీన్ని నువ్వెలాగూ సీరియస్గా తీసుకోవు… కానీ ప్రజాజీవితంలో ఉన్నప్పుడు కొంత నైతికతను సమాజం కోసమైనా చూపాలని జనం భావిస్తారు కదా… ఎహె, ఇందులో అనైతికం ఏముంది..? నచ్చేలేదు, విడిపోయారు, అంతే కదా అంటారేమో కొందరు… కానీ ఎవరికీ నువ్వు ఎందుకు నచ్చడం లేదు..? ఎవరినీ నువ్వు ఎందుకు నచ్చడం లేదు..?
భారతీయ వ్యవస్థలో పెళ్లికి ఓ సముచిత స్థానం ఉంది… ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, చేసుకోవాలి, రాజీపడాలి, సర్దుకుపోవాలి, కలకాలం గౌరవంగా కలిసి బతకాలి… నువ్వు నినదించే సనాతన ధర్మం కూడా బహుశా అదే చెబుతున్నదేమో… కానీ ఇదేమిటి..? సో వాట్, సమాజంలో లక్షల మంది విడిపోతున్నారు కదా అంటారేమో… ఇక తప్పనిసరై, వేరే మార్గం లేక, విడిపోవడమే దిక్కనిపించినప్పుడు వోకేనేమో… కానీ ఎందరితో..?

కొన్నాళ్లుగా, అంటే 2023 నుంచీ వింటున్నదే… ఈ రష్యన్ భార్యతోనూ పడటం లేదు, ఆమె అసంతృప్తిగా ఉంది అని… కానీ ఇప్పుడు నువ్వే తేల్చి చెప్పేశావు… ఈ వికెట్ కూడా పడిపోయిందని..! అన్నట్టు… ఒక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి భాగస్వామి, పార్టీ అధినేత, స్టార్ హీరో వ్యక్తిగత జీవితంపై కూడా సమాజానికి ఆసక్తి, దృష్టి ఉంటాయి… ష్, ఎవరూ మాట్లాడొద్దు అంటే ఎలా నలుగురు పిల్లల జెనెటిక్ తండ్రీ..? (మూడో భార్యకూ పవన్ కల్యాణ్ విడాకులు ఇస్తున్న వార్త నిజమేనని, ఆ సంయుక్త ప్రకటన నిజమేనని నమ్ముతూ…)
https://www.facebook.com/reel/2600727350413871
వేణుస్వామి 2023లోనే చెప్పాడు, మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లున్నాయి పవన్ కల్యాణ్ జాతకంలో అని..!!
Share this Article