Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?

November 12, 2026 by M S R

.

డీఎంకే ఎంపీ, కరుణానిధి బిడ్డ కనిమొళి ఓ ట్వీట్ చేసింది… ‘‘ కళ్లకురుచి జిల్లా కలెక్టర్ జేఈ పద్మజ (IAS) కు స్థానిక టీవీకే ఎమ్మెల్యే సి. అరుళ్ విగ్నేశ్ వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపాడు, అంతేకాకుండా తాగిన మైకంలో అనుమతి లేకుండా కలెక్టర్ నివాసానికి వెళ్లి వేధించాడు… ఆ ఘటన తర్వాత కలెక్టర్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిని (PSO) కేటాయించారు’’

… అబ్బే, ఆమె నివాసం దగ్గర సీసీటీవీ కెమెరాలుంటయ్, భద్రత ఉంటుంది, నేనెలా వెళ్తాను అని విగ్నేశ్ ఏదో కవర్ చేసుకున్నాడు కానీ తమిళ రాజకీయాల్లో ఇదొక కలకలం… అవసరమైతే విచారణ జరిపించుకొండి అని సవాల్ కూడా విసిరాడు… కానీ సీఎం కార్యాలయం జరిగింది తెలుసుకుని, ఎమ్మెల్యేను హద్దు మీరితే బాగుండదు అని హెచ్చరించినట్టు తమిళ మీడియా రాసుకొచ్చింది… (ఆమె 2016 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారిణి… తమిళనాడు సివిల్ సర్వీసెస్ నుండి ఐఏఎస్‌కు పదోన్నతి)…

Ads

విగ్నేశ్ తొలిసారి ఎమ్మెల్యే… టీవీకే నుంచి సీఎం విజయ్ ఎవరికిపడితే వాళ్లకు టికెట్లు ఇచ్చాడనే విమర్శ ఉన్నదే… తన ఫ్యాన్స్, చివరకు తన కారు డ్రైవర్ తండ్రికి కూడా… ఎవరు ఎలాంటివాళ్లో, ఎవరి నడత ఏమిటో కూడా పట్టించుకోకుండా టికెట్లు ఇస్తే, తన హవాలో చాలామంది ఎన్నికైపోయారు… కానీ జనానికి తలనొప్పులు అయిపోయారు…

padmaja ias

మరో ఎమ్మెల్యే బద్రుద్దీన్ ముస్తఫా నిర్వాకం తెలుసు కదా… మధుర మీనాక్షి గుడి కుంభాభిషేకం సమయంలో ఏకంగా ఆలయ గోపురాలు ఎక్కాడు… అదేమంటే నేను లోకల్ ఎమ్మెల్యేను అని దబాయించాడు… దీనిపై మద్రాస్ హైకోర్టు 2026 అక్టోబర్ చివరలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది…

టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రతిపక్షాలు ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ఆఫర్ చేశాయని ఇంకో ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు… డిప్యూటీ స్పీకర్ ఎం. రవిశంకర్ ఓ పౌరుడిపై దాడి చేశారన్న మరో ఆరోపణ… ఎమ్మెల్యేలపై ఇలాంటివే ఫిర్యాదులు… 

దీనికితోడు పార్టీ నాయకులు కూడా… నాగపట్నం జిల్లాకు చెందిన పార్టీ నిర్వాహకుడు ఒకరు చెన్నై నుండి సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు మాదకద్రవ్యాలు (Drugs) రవాణా చేసే స్మగ్లింగ్ ముఠాకు సూత్రధారిగా తేలడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది… ఈ వ్యవహారం బయటపడగానే పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది…

దీనికితోడు సీఎం విజయ్ మొదటిసారి అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుని వచ్చే 13కు ఆరు నెలలు… అంటే ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టేందుకు చాన్స్ ఉంది… డీఎంకే ఆల్రెడీ కారాలు మిరియాలు నూరుతోంది… అవిశ్వాసానికి రెడీ అయిపోతోంది… అన్నాడీఎంకే నుంచి ఆరుగురు టీవీకేలోకి ఫిరాయించారు, ఇద్దరు ఉపఎన్నికల్లో గెలిచారు, కానీ మరో నాలుగు సీట్లు ఖాళీ… అనర్హత వేటుపై విచారణ నడుస్తోంది…

ఏళ్లుగా డీఎంకే కూటమిలో ఉన్న పార్టీల వైఖరి ఇంకా తెలియదు… ఈ ప్రభుత్వం కూలడం ఖాయం, మధ్యంతరానికి రెడీ అయిపొండి అని స్టాలిన్ పార్టీ నేతలకు చెబుతున్నాడు… దీంతో విజయ్ నవంబరు 11న మహాబలిపురంలోని ఓ రిసార్టులో అత్యవసర రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు… ముఖాముఖి ఒక్కొక్కరితో భేటీ అయ్యాడు…

ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై మందలింపులే గాకుండా, అవిశ్వాసం గనుక ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో వ్యూహరచన… ‘‘ప్రతి ఎమ్మెల్యే కదలికలపై నిఘా ఉంది, అధికార దుర్వినియోగానికి పాల్పడినా లేదా వివాదాల్లో చిక్కుకున్నా కఠిన చర్యలు ఉంటాయి” అని విజయ్ హెచ్చరించాడు… కానీ గట్టిగా వ్యవహరిస్తే ఎవరు పార్టీ వీడిపోతారో తెలియదు, అసలే అవిశ్వాసం కత్తి వేలాడబోతోంది… ఇదీ తమిళనాడు తాజా స్థితి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?
  • పక్కా అర్హుడు! ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవి ఆశించి ఉంటే తప్పేముంది…!
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • *మైనస్ పాయింట్స్‌గా చెప్పబడుతున్నవన్నీ నిజానికి ప్లస్ పాయింట్సే*
  • ఆస్కార్ బరిలోకి ‘రామాయణం’… రాజమౌళి ఆర్ఆర్ఆర్ బాటలోనే!
  • సహస్రకంఠ రావణుడిని సీత చంపుతుంది ! అదే అద్భుత రామాయణం !!
  • ఏవేవో కవరింగులు-! నీ జ్ఞాపకాల దొంతర ‘నిజాయితీ’గా లేదమ్మా..!
  • Pyre … మీకు వీలైతే మేం కూడా వెళ్లిపోకముందే చచ్చిపొండి..!!
  • ఇజ్రాయిల్ రాజకీయాల్లో మలుపు? జాతీయ ప్రభుత్వం ఏర్పాటు?
  • తొమ్మిది పెళ్లిళ్ల ‘భరణం’ కేటుగత్తె..! మొత్తానికి ముసుగు తొలిగింది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions