.
ఎప్పటిలాగే బీఆర్ఎస్ తనకు అలవాటైన ధోరణిలో కొక్కిరింతలకు దిగినా సరే… రేవంత్ రెడ్డి తను సంకల్పించిన పాఠశాల విద్యావిధానంలోని మార్పులను తప్పకుండా అమలు చేస్తే భవిష్యత్తులో జనం తనను చిరకాలం యాదికి ఉంచుకుంటారు, అది గ్యారంటీ… తనే చెప్పాడు నిన్న, కార్పొరేట్ఎప్పటిలాగే బీఆర్ఎస్ తనకు అలవాటైన ధోరణిలో కొక్కిరింత కాలేజీలు ఒత్తిళ్లు తెచ్చినా సరే తలొగ్గబోననీ, ప్రత్యేకించి స్కూలింగ్ మార్చేస్తాననీ ఘంటాపథంగా చెప్పాడు… గుడ్, అదే మంచిది… రాష్ట్రానికి కూడా..!
నిజానికి ఇంటర్ బోర్డు రద్దు, 7+4+4 విద్యావిధానం డ్రాపవుట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే కాదు… 18 రాష్ట్రాల్లో ఉన్న స్కూలింగ్ విధానానికీ, జాతీయ విద్యావిధానానికీ కో-టర్మినస్ చేయడమే… అంతేకాదు, 10+2 స్కూల్‌లోనే పూర్తయ్యాక, నేరుగా నైపుణ్యం పెంపు దిశలో ఏటీసీలకు (ATCs – Advanced Technology Centres) లేదా వృత్తి కళాశాలలకు పంపించడం వల్ల… ఇప్పటిదాకా టెన్త్ కాగానే జరుగుతున్న 40 శాతం భారీ డ్రాపవుట్లను తగ్గించడానికి వీలుంటుంది… ఆ డ్రాపవుట్లలో ఎక్కువగా బాలికలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలే ఉంటున్నాయి… దాన్ని తగ్గించడం తెలంగాణకు ప్రస్తుతం ఓ సామాజిక అనివార్యత… దాన్ని రేవంత్ రెడ్డి గుర్తించడం అభినందనీయం… పనిలోపనిగా సీబీఎస్ఈ ఆంగ్ల మాధ్యమం కూడా వర్తమాన అవసరం…
Ads
వాస్తవానికి గత ఏడాదే ఇది ఆరంభం కావాలి… కానీ రేవంత్ రెడ్డి వేగాన్ని, సంకల్పాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు అందుకోలేక, చేతకాక, సరైన కసరత్తు చేయక ఓ ఏడాది లేటవుతోంది… ఈ కొత్త విధానంలో ఇక ఇంటర్ మీడియెట్ అనే కోర్సే ఉండదు… బోర్డు కూడా ఉండదు… నిజానికి ఎప్పుడో ఈ పనిచేయాల్సింది… కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యారంగానికి సంబంధించి ఓ దశ, ఓ దిశ, ఓ ముందుచూపు, ఓ ప్రణాళిక దిక్కులేక… కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు లొంగి…. ఈ సంస్కరణలను కనీసం ఆలోచించలేదు…
ఇప్పటికీ ఎవరెవరో వ్యతిరేకిస్తారు, కానీ రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు… ఇది ‘పీవీ మీద అక్కసుతో తీసుకున్న నిర్ణయం, పీవీ ఆనవాళ్లను చెరిపేయడం’ అనే అర్థరహిత విమర్శలను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన పనిలేదు… పక్కా అధ్యయనం తరువాత తీసుకొస్తున్న సంస్కరణలే ఇవన్నీ… కాలంతోపాటు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యావిధానం మారాలి, సంస్కరించబడాలి…
ఈ కొత్త విధానంలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, 4 వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్… 5 నుంచి 8 వరకు సెకండరీ, 9 నుంచి 12 వరకు సీనియర్ సెకండరీ… ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలోనూ ఓ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు కదా, నాబార్డు రుణం గనుక వస్తే మరో 300 స్కూళ్లు నిర్మించబడతాయి… ఆల్రెడీ జూనియర్ కాలేజీలు ప్లస్ హైస్కూళ్లు కలిసి ఉన్నవి ప్లస్ మోడల్ స్కూళ్లు కూడా కలిపితే… ప్రతి మండలానికి ఓ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటవుతుంది…
ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్ ఉద్యోగుల ఆందోళనల్ని, ప్రస్తావించే సమస్యల్ని చర్చల ద్వారా కొలిక్కి తీసుకురావడం పెద్ద సమస్యేమీ కాదు… ఉచిత రవాణా, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నభోజనం ద్వారా ఇప్పటికే ప్రభుత్వ బడికి పిల్లల నమోదు పెరుగుతోంది… తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కాన్సెప్టు విజయవంతం చేస్తే నిజంగా ఓ పేద కుటుంబానికి ‘నిజమైన విద్యాదానం’ చేసినట్టే..!!
Share this Article