Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మొదట్లో ఎన్టీయార్‌నే తిరస్కరించారు ఆ దేవుళ్ల పాత్రల్లో..!

November 13, 2026 by M S R

.

ఎహె, ఆమె సీత ఏమిటి..? చింపిరిజుత్తు, పొట్టిరూపం… ఐనా హవ్వ, తను రాముడు ఏమిటి..? బీఫ్ తినేవాడు, పైగా ఫెయిర్ కలర్ దేహమేమిటి..? అసలు స్పిరిట్యుయల్ వైబ్స్ లేవు… ప్చ్, శూర్పనఖగా అంత అందగత్తె ఏమిటి..? ఛ, రాంగ్ కాస్టింగ్… అస్సలు నప్పలేదు… ఇలాంటి విమర్శలు వస్తున్నాయి కదా… ఓ విషయం గుర్తొచ్చింది…

మనం ఇన్‌ఫోసిస్ సుధామూర్తిని చాలా విషయాల్లో మెచ్చుకుంటుంటాం కదా, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, రచనలు, నిరాడంబరత ఎట్సెట్రా… ఓసారి రాముడి వేషంలో ఎన్టీయార్ విగ్రహం చూసి, తొలిసారి రాముడు ఎలా ఉంటాడో అర్థమైంది అని కామెంట్ చేసిందట, ఎక్కడో చదివినట్టు గుర్తు…

Ads

అందరూ అన్నీ యాక్సెప్ట్ చేయాలని లేదు, తిరస్కరించాలనీ లేదు… నిజానికి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, మహా విష్ణువు అనగానే ఎన్టీయార్ గుర్తొస్తాడు సగటు తెలుగువాడికి… అంతగా పాపులర్… ఐతే మొదట్లో తననూ తిరస్కరించారు… సో, జనం కొందరిని రిజెక్ట్ చేసినా, తరువాత యాక్సెప్ట్ చేయొచ్చు… ఏదీ స్థిరం కాదు, జనాభిప్రాయం చంచలం…

కొందరిని తినగ తినగ వేము అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తుంటారు… సరే, ఇదంతా వోకే గానీ… ఎన్టీవోడిని రాముడిగా, కృష్ణుడిగా మొదట్లో అస్సలు తెలుగు ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పే ఓ పోస్టు ఆసక్తికరంగా అనిపించింది ‘— భరద్వాజ్ చదలవాడ —’ వాల్ మీద… చదవండి…



కృష్ణుడిగా NTR ను ఆడియన్స్ తిరస్కరించారా? నేటికీ రాముడిగా, కృష్ణుడిగా NTR ఫోటోలే తెలుగువారి పూజాగదుల్లో కొలువై ఉంటాయి. ఆయా పాత్రలకు ఇంతగా కీర్తి గడించిన NTR, తొలిసారి కృష్ణుడు పాత్రలో కనిపించగానే ఆ తరం ప్రేక్షకులు కోపంతో తెరలు చించారని ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్ట్ మోహన్ కుమార్ ‘జ్యోతిచిత్ర’లో రిపోర్ట్ చేశారు. కానీ వారు రాసిన కథనం అర్థసత్యం మాత్రమే!

అసలు విషయం ఏమిటంటే… NTR ను కృష్ణుడిగా ప్రేక్షకులు తిరస్కరించిన చిత్రాలు ఒకటి కాదు, రెండు ఉన్నాయి.

1. ఇద్దరు పెళ్ళాలు (1954): NTR, CSR, జమున ప్రధాన పాత్రలుగా నాగూర్ సినీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎఫ్. నాగూర్ స్వీయ దర్శకత్వంలో 1954లో విడుదలైన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. ఇందులో జమున పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే “మదిలో హాయి కలలే వేయి” అనే డ్రీమ్ సాంగ్‌లో ఎన్టీఆర్ తొలిసారిగా కృష్ణుడిగా కనిపిస్తారు.

అయితే కృష్ణుడిగా NTR కిరీటం, ఆహార్యంతో పాటు శారీరక భాష (Body Language) తదితర అంశాలు ఈ చిత్రంలో ప్రేక్షక రంజకంగా లేకపోవడంతో కొన్ని ఊర్లలో వీక్షకులు అసహనానికి గురయ్యారు. కృష్ణుడిగా NTR ఫెయిల్యూర్ అని కూడా విమర్శలు వచ్చాయి. సినీ పండితులు ‘మెడ పట్టిన మాధవుడు’ అని అపహాస్యం కూడా చేశారు.

ntr(ఇద్దరు పెళ్లాలు సినిమాలో ఎన్టీయార్)

2. సొంత ఊరు (1956): అయితే NTR పట్టు వదలకుండా 1956లో ESN మూర్తి దర్శకత్వంలో, ప్రముఖ గాయకులు ఘంటసాల తన తమ్ముడు సదాశివుడును నిర్మాతగా పరిచయం చేస్తూ ‘ఘంటసాల ప్రొడక్షన్స్’ పై రాజసులోచన, షావుకారు జానకి, NTR ప్రధాన పాత్రలుగా నిర్మించిన ‘సొంత ఊరు’ చిత్రంలో రెండోసారి కృష్ణుడిగా కనిపిస్తారు.

ఈ చిత్రంలో కథా సందర్భానుసారం సాగే ఒక అంతర్నాటకంలో NTR ప్యాంట్, షర్ట్, మీసాలతో పాటు కృష్ణుడి కిరీటం ధరించి కనిపిస్తారు. (అయితే సినిమా కథలో భాగంగానే ఆ నాటకాన్ని చూస్తున్న ప్రేక్షక పాత్రధారులు కోపంతో రాళ్లు విసురుతారు).

ఈ రెండు చిత్రాలలో NTR ను కృష్ణుడిగా ప్రేక్షకులు నిరాదరించడం ఆయనకు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

కానీ, పారేసుకున్న చోటే తిరిగి సంపాదించుకోవడం తెలిసిన NTR, ‘మాయాబజార్’ చిత్రంతో పౌరాణిక పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అంతేకానీ, నిజ జీవితంలో ఎక్కడా ప్రేక్షకులు థియేటర్లలో తెరలు చించిన విషయం కానీ, రాళ్లు విసిరిన విషయం కానీ రికార్డ్ కాలేదు! కాబట్టి మోహన్ కుమార్ గారు రాసిన రిపోర్ట్ అర్థసత్యంగా మిగిలిపోయింది.

చరిత్రను చదవడమే కాదు... క్రాస్ చెక్ చేయడం కూడా ముఖ్యమే!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొదట్లో ఎన్టీయార్‌నే తిరస్కరించారు ఆ దేవుళ్ల పాత్రల్లో..!
  • రామాయణం హంగామా వెనుక కనిపించని ఓ కీలక వ్యక్తి… అశ్విని అయ్యర్!
  • …. అన్నట్టు విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ అనగానే గుర్తుకొచ్చింది… .
  • పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్… విశ్వనగరంలో అత్యాధునిక రవాణా!
  • ఆ ఒక్కడి ఆ బలహీనత- చైనా హానీట్రాప్- కుప్పకూలిన ‘బ్లూచిప్’…
  • G O A T … అనగా మేక, అనగా బకరా… అనగా తెలుగు ప్రేక్షకుడు..!!
  • పాపం రెహమాన్ ! కచేరీలకు ఆదరణ కరువు ! చుట్టూ బోలెడు నెగెటివిటీ !!
  • Overhauling Telangana’s Schooling: A Bold Step Toward Educational Equity
  • పాఠశాల విద్య సంస్కరణలు- బీఆర్ఎస్‌కు చేతకానిది, రేవంత్ సంకల్పించినది!
  • 3200 కోట్ల మంది హిందూ దేవతలట… మమత పార్టీ ఎంపీ పిచ్చి కూతలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions