Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకేలాంటి పాట ఒకేలాంటి సందర్భాల్లో రెండు సినిమాల్లో…

November 19, 2026 by M S R

.

Bharadwaja Rangavajhala…. ఒకేలాంటి పాటలు…
ఒకేలాంటి పాట ఒకేలాంటి సందర్భాల్లో రెండు సినిమాల్లో వాడడం … భలే ఉంటుంది కదా…
తూర్పు వెళ్లే రైలు అనే బొమ్ముంది కదా … అందులో …
ఓ పాటుండుద్ది …ఆరుద్ర రాశారు.

జ్యోతి అనే అమ్మాయికి…
ఒసేవ్ నువ్వు ఆ మోహన్ అనే కుర్రాడ్ని ప్రేమిస్తున్నట్టుండావు .. కూసింత చూసుకో అని ఆమె మనసు హెచ్చరిస్తూ …
నేపధ్యంలో పాడే గీతం గుర్తుంది కదా …
గుర్తులేకపోతేనేం నేను గుర్తు చేస్తా కదా …

Ads

‘‘ఏమిటిది . ఏమిటిది .
ఏదో తెలియనిదీ.
ఎప్పుడూ కలగనిదీ.
ఏమిటిది
హత్తుకున్న మెత్తదనం
కొత్తకొత్తగా ఉందీ
మనసంతా మత్తుకమ్మీ
మంతరించినట్లుందీ
నరనరాన మెరుపుతీగ నాట్యం చేసేస్తోంది
నాలో ఒక పూలతేనె నదిలా పొంగుతోంది.పొంగుతోంది
ఏమిటిదీ.
ఈడు జోడు కుదిరింది.
తోడు నీడ దొరికిందీ.
అందానికి ఈనాడే అర్ధం తెలిసొచ్చిందీ
పెదవి వెనుక చిరునవ్వు దోబూచులాడిందీ.
చిలిపి చిలిపి తలపు తలచి సిగ్గు ముంచుకొస్తోందీ..’’
ఇది ఆ పాట …
అయిపోయింది కదా …

ఇట్టాటి సందర్భానికే ఈ సినిమా విడుదలకు ఓ పాతికేళ్ల ముందు విడుదలైన కన్నెమనసులులో ఓ పాట రాశారు దాశరథి కృష్ణమాచార్యుల వారు.
అది ఆత్రేయేమో అని నేను తెగ కన్ఫూజ్ అయిపోతా ఉంటాను. …

‘‘హాయీ హాయీ హాయీ ఏమిటిది?
ఏం జరిగిందీ ?
ఇది అది అని చెప్పరానిదీ … ఏమిటిది?
ఎన్నెల తెలుసు ఎండా తెలుసునమ్మా …
ఎన్నెల్లో ఎండా ఎల్లా ఉందమ్మా అని సాగుద్ది …

అసలు నాకు ఈ పాటలో కనెక్ట్ అయిన లైన్ ఇదే …
ఎన్నెల్లో ఎండా ఎల్లా ఉందమ్మా ?
దాశరథి ఏం రాశాడండీ?
అబ్బ, మనసు మెలితిరిగేది
ఈ పాటలో పెత్యేకమేటంటే …
ఓ పురుషగాత్రం అమ్మాయీ నువ్వు పేమలో పడ్డట్టుండావు కూసింత నిజంలాగే అనిపిస్తోందని నిర్ధారణలు చెప్తుంది ..
ఆ నిర్దారణలు చెప్పే పురుషగాత్రం ఆదుర్తి గారి కాడ అసిస్టెంట్ డైరక్టర్ గా పన్జేసిన టి.కృష్ణ అనే కుర్రాడిది.
అయిపోయింది కదా …

ఇదే కన్నెమనసుల్లో …
ఇంకో కన్నెమనసు పాట ఆత్రేయ రాసినట్టున్నారు …
వలపులో వద్దు వద్దు వద్దు వద్దంటు పడ్డానులే … అని …
పడి నడుం విరిగిందన్నట్టుగా సాగుద్దా పాట …
అది వేరు సంగతి …

same song

అయితే ఈ తూర్పువెళ్లే రైలు పాటకీ … కన్నెమనసులు పాటకీ మాత్రం చాలా పోలికలు కనిపిస్తాయి.
మరి బాపు రమణలు కోరి అట్టా రాపించుకున్నారేమో?
అంటే కన్నెమనసులు కథ ముళ్లపూడి వారిదే కదా …
అదీ కత, ఇప్పుడీ రెండు పాటలూ ఇనండి …
మీకే తెలుసుద్ది …
ఇంకో విచిత్రమేమనగా ఈ రెండు పాటలూ కూడానూ మేడం జనరల్ సుశీల గారే పాడడం …
కన్నెమనసులు పాట కంపోజ్ చేసింది మహదేవన్ అయితే తూర్పువెళ్లే రైలుకు బాలసుబ్రహ్మణ్యం కదా సంగీతం ..
అదీ సంగతి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకేలాంటి పాట ఒకేలాంటి సందర్భాల్లో రెండు సినిమాల్లో…
  • Qatar Vs Indigo… వోల్వో బస్సు దిగి ఎర్ర బస్సు ఎక్కినట్టు..!
  • చాణక్యుడిగా రణ్‌వీర్.. చంద్రగుప్తుడిగా యశ్.. నిజమైతే మరో సంచలనమే!
  • వందేళ్ల నాటి తమిళ భక్తి పాట- గ్రామీ అవార్డుకు పరిశీలన…
  • ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!
  • The son who stole his mother’s night…
  • అమెరికాలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజల పరుగులు!
  • ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…
  • సకల తీర్థాల్లో మునిగి పుణ్యం చేసుకున్న ఆ సొరకాయ చివరికి..?!
  • ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు- రాముడి వారసులు మాత్రం సైలెంట్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions