Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్ పాలనకు కేవలం 6.5 రేటింగ్ మాత్రమే ఎందుకంటే..?

November 21, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి ఓ మీడియా చిట్‌చాట్‌లో తన పాలనకు తాను పదికి 6.5 మార్కులు వేసుకుంటానని నిజాయితీగా చెప్పాడు… మిగతా పదవీకాలంలో ఇది మొత్తం భర్తీ చేసి, పదికి పది మార్కులు సాధిస్తానని కూడా ధీమాగా చెప్పాడు… గుడ్… కానీ తనకు ప్రస్తుతం తక్కువ మార్కులు వేసుకునే పరిస్థితికి తనకన్నా తన మంత్రుల టీమ్, కొందరు ఉన్నతాధికారులే కారణం… కేసీయార్ రుద్ది పోయిన మహా బురద కడగటానికే ఎక్కువ టైమ్ పోతోంది..,. అది మరో కారణం…

ఉదాహరణలు చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి నాగార్జునసాగర్- పల్నాడు వాటర్ గ్రిడ్ ఇష్యూ చూద్దాం… తాము పదవిలో ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు, తక్కువ కృష్ణాజలాలకు అంగీకారం వంటి ఇష్యూల్లో కేసీయార్ నిర్వాకం- జగన్ కోసం చేసిన దుర్మార్గాలు పక్కన పెడితే… ఈ పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించి అదే బీఆర్ఎస్ ఏదేదో మాట్లాడేస్తోంది… ఇదొక పారడాక్స్…

Ads

అక్కడ జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా… తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడంలో పోటీపడతారు… కానీ నాగార్జునసాగర్‌కు పొక్క కొడుతుంటే, అదీ డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని ఆంధ్రాకు తరలించే భారీ నిర్మాణాలు చేపడుతుంటే, ఏపీ ప్రభుత్వం ఏకంగా జీవోలు ఇచ్చేస్తుంటే, కేంద్రం ఆర్థికసాయం చేస్తుంటే… తెలంగాణ సాగునీటి శాఖ ఏం చేస్తోంది..?

ఇప్పటికీ ఆ శాఖలో కాళేశ్వరం ఘనులే రాజ్యమేలుతున్నారు… ఇప్పటికీ హరీష్ రావే వాళ్లకు మంత్రి… కటువుగా ఉన్న సరే నిజం అదే.., అసలు మంత్రికి తన శాఖ మీద ఏమైనా పట్టుందా..? 8 నెలలుగా పనులు సాగుతుంటే దిగువ స్థాయిలో ఒక్కరూ గమనించలేదా..? పైకి సమాచారం ఇవ్వలేదా..? అదే జరిగితే తెలంగాణ సాగునీటి శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలి… మంత్రి దాకా…

ఒకవేళ మంత్రికి ఈ పల్నాడు వాటర్ గ్రిడ్ విషయం తెలిసీ… ఏ యాక్షన్ తీసుకోకపోతే అది మరింత ద్రోహమే అనిపించుకుంటుంది… ఒకవైపు అంతర్రాష్ట్ర జలవివాదాలపై మడమ తిప్పకుండా పోరాడాల్సిన దురవస్థలో… కొత్తగా ఈ వాటర్ గ్రిడ్లు కట్టేసుకుంటుంటే…  8 నెలలుగా ఎవ్వరూ గమనించలేదా..? పాలన యంత్రాంగం చేష్టలుడిగిందా..? ఉద్దేశపూర్వకంగా ఆంధ్రాకు సాయపడే కుట్రలు సాగుతున్నాయా ఆ శాఖలోనే..? చాలా సీరియస్ ల్యాప్స్…

మీడియా బయటపెడితే తప్ప ఈ సమాచారం తెలియలేదు తెలంగాణలో ఎవరికీ… బయటపడ్డాక ఏదో తూతూమంత్రంగా దిగువ స్థాయిలో ఒకరిద్దరికి షోకాజులు, కృష్ణా మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయడం తప్ప సీరియస్ యాక్షన్ ఏముంది..? హఠాత్తుగా ఇద్దరు సీఈలు లాంగ్ లీవులో ఎందుకు వెళ్లారు..?

nsp

పల్నాడు వాటర్ గ్రిడ్ రహస్యంగా ఏమీ చేయడం లేదు చంద్రబాబు… 3 ఇన్‌టేక్ వెల్స్, 20 ట్యాంకులు అట… పనులు జోరుగానే సాగుతున్నాయి… కేఆర్ఎంబీలో అంతా ఆంధ్రా చెప్పినట్టే నడుచుకునేవాళ్లున్నారు… ఇన్నిసార్లు సీఎం సమక్షంలో కూడా సమీక్షలు జరిగాయి కదా, ఉన్నతాధికారులు గుడ్డిగా ఏవేవో నివేదికలు ఇస్తున్నారు తప్ప పల్నాడు వాటర్ గ్రిడ్ వంటి సీరియస్ ఇష్యూ తన నోటీసుకు ఎందుకు తీసుకురాలేదు..?

ఒకరిద్దరి మీద సీరియస్ యాక్షన్ ఉంటే తప్ప ఇలాంటి సిట్యుయేషన్లు చక్కబడవు… 22ఏ రావణ కాష్టం కావచ్చు, 10 ప్లస్ 2 విద్యావిధానం కావచ్చు, రేవంత్ రెడ్డికి తక్షణం కావల్సింది ‘మంచి పాలన సలహాదారులు’... అప్పుడే 6.5 రేటింగ్ నుంచి ఎదిగేందుకు చాన్స్ ఉంటుంది... కటువుగా ఉన్నా నిజం ఇదే...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ పాలనకు కేవలం 6.5 రేటింగ్ మాత్రమే ఎందుకంటే..?
  • “నో.. నో.. పి.వి. ఈజ్ ఓకే” అందామె! కానీ ఏడేళ్ల తరువాత..?
  • ఈఎన్ఈ రిపీట్ కాలేదబ్బా- అసలు ఈ తరుణ్ భాస్కర్‌కేమైంది..?
  • రాధిక ఆప్టే వెటకారం… బాలయ్యపైనా..? మేనరికాలపైనా..? కీర్తి వివరణ దేనికి.?
  • తమిళ ‘కార్తీకదీపం’ వెలిగించడానికి మోదీ లేదా షా మధురై వెళ్తారా..?
  • Largest Statue Of A Bird… ఈ జటాయువు స్మారకం గురించి మీకు తెలుసా..?
  • అంతా అతను చెప్పినట్టే జగన్ అడుగులు … భారతి చేతికి పగ్గాలు …
  • కాంగ్రెస్‌ను కాదని… ఇండి కూటమి ప్రాంతీయ పార్టీల సపరేట్ బాట !!
  • పాపం సాయిపల్లవి..! తోడుగా శ్రీలీల ఉన్నా ప్రయోజనం ఓ గుండు సున్నా!!
  • ‘అమ్మ’కు వీడ్కోలు! ఎంతటి కఠోర సన్యాసమైనా ఆ ఒక్క పేగుబంధమే!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions