.
హఠాత్తుగా కొన్ని బంధాలు తెరపైకి వస్తాయి… రకరకాల ప్రచారాలు, వ్యాఖ్యానాలు జోరుగా సాగుతుంటాయి… తమిళనాడులో తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు… అదేమిటంటే..? త్రిష-విజయ్-ఉదయనిధి ముక్కోణ ప్రేమ… లేదా ప్రేమ త్రికోణం…
ఆ ప్రచారం ఏమిటంటే..? కరుణానిధి- జయలలిత- MGR ప్రేమ త్రికోణం ఇప్పుడు పునరావృతం అవుతోంది… Vijay- Trisha – Udhayanidhi – ఈ బంధాలు తిరిగి పాత త్రికోణ ప్రేమ వంటి చరిత్రనే లిఖించబోతోందా..? ఇవి ప్రేమ రాజకీయాలా..? రాజకీయ ప్రేమలా..?
Ads
అసలు విజయ్ – త్రిష- ఉదయనిధి ముక్కోణ ప్రేమ కథే విజయ్ రాజకీయ ప్రవేశానికి కారణమా..? అప్పట్లో కరుణానిధి- జయలలిత- ఎంజీఆర్ త్రికోణంపై మణిరత్నం ఓ సినిమాయే తీశాడు తెలుసు కదా… ఇరువర్… అందులో సినిమా ప్రపంచం రాజకీయ అధికారాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూపించాడు…
సేమ్, ఆ pattern ఇపుడు recreate అవుతున్నట్టుగా ప్రచారాలు కనిపిస్తున్నాయి… ప్రేమ వారి వారి వ్యక్తిగత విషయమే అయినా, అది రాజకీయాలను, తద్వారా ప్రజాజీవితాలను ప్రభావితం చేస్తున్నందువల్ల ఈ ప్రచారాలకు పాపులారిటీ కూడా వస్తోంది…
నిజానికి ఎంజీఆర్- జయలలిత నడుమ ప్రేమబంధం నిజమో కాదో తెలియదు… ఆమె అతన్ని ఆసరాగా చేసుకుని రాజకీయాల్లో ఎదగాలని అనుకుంది… అది కొనసాగింది… కానీ కరుణానిధి, జయలలిత నడుమ ప్రేమబంధం అనేది అబద్ధం అనేవాళ్లే ఎక్కువ… వాళ్లిద్దరూ మొదటి నుంచీ రాజకీయ ప్రత్యర్థులు… వ్యక్తిగత వైరం కూడా ఉండేది అంటారు…

Trisha – Vijay – Udhayanidhi… మళ్లీ అదే చరిత్ర పునరావృతమవుతోందా? విజయ్- త్రిష బంధం ఇప్పుడు బహిరంగమే… కలిసే తిరుగుతున్నారు ఫంక్షన్లకు… ఈ కారణంగానే విజయ్ భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది, ఏమనుకున్నదో మళ్లీ వెనక్కి తీసుకుంది… ఎవరి బతుకు వాళ్లదే ప్రస్తుతానికి… మరి ఈ ప్రచారాల్లోకి హఠాత్తుగా ఉదయనిధి ఎందుకు వచ్చాడు..?
పాత జయలలితతో త్రిషను ఎందుకు పోలుస్తున్నారు..? తన తాత కరుణానిధి పాత్రను ఉదయనిధి పోషిస్తున్నాడా ఇప్పుడు..? సోషల్ మీడియాలో భలే ప్రచారాలు, గాసిప్స్ కనిపిస్తుంటాయి ఇలా… జయలలితను పురట్చి తలైవి అని బిరుదు ఇచ్చినట్టుగా ఇప్పుడు త్రిషకు ఇళయ పురట్చి తలైవి అనే బిరుదు ఇచ్చారు ఈమధ్య…
అంతా జయలలిత జీవితంలాగే త్రిష జీవితమూ… నిజానికి త్రిష ఈరోజుకూ రాజకీయ నాయకురాలు కాదు… వద్దమని ఉందేమో తెలియదు గానీ… విజయ్- త్రిష బంధం వోకే, కానీ ఉదయనిధితో..? ఇతను చురుకైన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, స్టాలిన్ ఆర్థిక సామ్రాజ్యానికి- డీఎంకే పార్టీకి వారసుడు… ఒకప్పుడు నటుడు, నిర్మాత… ఇదే త్రిషతో కూడా నటించాడు…
తనకు పెళ్లయింది… సినిమా రంగానికే చెందిన కిరుతిక (కృత్తిక) తన భార్య, సంతానం కూడా… అఫ్కోర్స్, విజయ్ కూడా అంతే కదా… ఇద్దరు ఎదిగిన పిల్లలు తనకు… ఉదయనిధితో వైరం ఉండే అవసరం గానీ, అతన్ని సాధించడానికి త్రిష విజయ్ను ముందుకు తోస్తున్నట్టు గానీ సోషల్ మీడియా ప్రచారాల్లో ఆధారాలు గానీ, బలపరిచే విశ్లేషణలు గానీ ఏమీ కనిపించవు… కానీ త్రికోణంపై ప్రచారం మాత్రం సాగుతూ ఉంటుంది…!!
Share this Article