Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్త ట్విస్ట్! సుప్రీంకు జోసెఫ్ విజయ్ సర్కారు తప్పుడు నివేదిక?

November 26, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta …  దీపం వెలిగించకూడదన్న నిర్ణయంలో అర్చకుల ప్రమేయం ఉందని కలెక్టర్ చెప్పింది నిజమేనా? అర్చకుల లేఖతో అసలు విషయం బట్టబయలు!
తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంలో మరో కీలక పరిణామం!

తమ పేర్లను దుర్వినియోగం చేసి, దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అర్చకులు ముందుకు రాలేదని కలెక్టర్ పేర్కొనడాన్ని స్థానిక అర్చకులు తీవ్రంగా ఖండించారు.

Ads

కార్తీకదీపం
 అర్చకులు సంతకాలతో విడుదల చేసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్న అంశాలు:
ఈ ఏడాది కార్తీక దీపం విషయంలో తాము ఎలాంటి లేఖను ఆలయ అధికారులకు ఇవ్వలేదు. దీపస్తంభం వద్ద దీపం వెలిగించే అంశంపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. తమను సంప్రదించకుండానే, తమ పేర్లను చేర్చి ఆలయ బోర్డు ప్రకటన విడుదల చేయడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని తెలిపారు.

మరి కలెక్టర్ సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరణలో అర్చకుల పేర్లను ప్రస్తావించడానికి ఆధారం ఏమిటి?
చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించవచ్చని ప్రభుత్వం భావించిందా? న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా, అర్చకుల అభిప్రాయాలను సాకుగా చూపించే ప్రయత్నం చేసిందా?

tiruparakundram
ఇప్పుడు అర్చకుల సంతకాలతో కూడిన లేఖ ఈ వాదనల విశ్వసనీయతపైనే తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సుప్రీంకోర్టు ముందు సమర్పించిన వివరణలో అర్చకుల పేర్లను ఎలా ఉపయోగించారు? అసలు వాస్తవాలు ఏమిటి? దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.

ధర్మాన్ని, సంప్రదాయాలను, న్యాయస్థాన ఆదేశాలను మించిన అధికారం ఎవరికీ లేదు!
మురుగన్ కొండపై ధర్మమే గెలవాలి!
వేల్! వేల్! మురుగన్!
— ఉపద్రష్ట పార్ధసారధి



తిరుపరన్‌కుండ్రంలో కార్తీక దీపస్తంభం వద్ద దీపం వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు, తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను సమగ్ర నివేదిక కోరాడు…

రాజ్యాంగంలోని 167 (బి) అధికరణం ప్రకారం, గవర్నర్ కోరినప్పుడు రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి అందించాల్సి ఉంటుంది…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఊగే మోదుగు పూలూ, త్యాగమూ… సారంగపాణీ… దాశరథి కృష్ణమాచార్యా…
  • కొత్త ట్విస్ట్! సుప్రీంకు జోసెఫ్ విజయ్ సర్కారు తప్పుడు నివేదిక?
  • ముసలోడే గానీ… మహా కర్కోటకుడు! ఓ భారీ రాక్షస ముఠా బద్దలు !!
  • పాప స్కూల్లో చేరితే బ్రేకింగ్ న్యూసా..? సెలబ్రిటీ ఆరాధనలో ‘అతి’…!
  • ఆకాశంలో ఒక తార… ఇది మన పాలకొల్లు జాహ్నవి కథేనా..?
  • ‘‘గాంధీ ఇంటిపేరు సుగంధీ నుంచి… రాజీవ్ కూలిపని చేసేవాడు’’
  • ఈ ఇద్దరు నటడాక్టర్లు కలిసి ఎంత షో చేసినా… చివరకు బొమ్మ ఫ్లాపే..!!
  • తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!
  • జోసెఫ్ విజయ్ తెలివైన డ్రామా- ఏకంగా సుప్రీంకోర్టుకే బురిడీ…
  • రాహుల్ చెప్పబోయే పేర్లు ఎవరివి..? గుర్తొస్తున్న చంద్రస్వామి పాత కథ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions