Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు కేంద్రం పరిష్కారం చూపిందా?

November 28, 2026 by Rishi

.

🚨 డీలిమిటేషన్ వివాదం.. 131వ రాజ్యాంగ సవరణ నుంచి 132వ సవరణ వరకు ఏమి మారింది ? ఎందుకు దక్షిణాది పార్టీలు సంతృప్తి పొందాయి.!

దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు కేంద్రం పరిష్కారం చూపిందా?

Ads

దేశ రాజకీయాల్లో కీలక చర్చకు దారితీసిన అంశం డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన).

🔴 అసలు మొన్న ఏప్రిల్ లో పార్లమెంట్లో ఆమోదం పొందని 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఏముంది?

1️⃣ జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునర్విభజనకు మార్గం సుగమం చేయడం.
2️⃣ లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 550 నుంచి 850కి పెంచే ప్రతిపాదన.
3️⃣ 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన.
4️⃣ మహిళలకు 33% రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం.

⚠️ దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరం ఏమిటి?

తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించాయి. కానీ జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలు పునర్విభజిస్తే, జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు లభించే అవకాశం ఉంది. దీంతో జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాల జాతీయ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమైంది.

🟢 నవంబర్ 27, 2026 న కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన తాజా 132వ సవరణ ప్రతిపాదనలో ఏముంది?

▪️ ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లో 50% పెంపు.
▪️ రాష్ట్రాల వారీగా సీట్ల నిష్పత్తిని 2051 వరకు freeze నసాగించే ప్రతిపాదన.
▪️ నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ఉపయోగించడం.
▪️ మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేయడం.
▪️ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు.

అంటే.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించిన ప్రధాన అభ్యంతరాన్ని పరిష్కరించే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది.

ఇక్కడి ఇమేజ్ లో డేటా చూస్తే వివిధ ఫార్ములా ల ప్రకారం ఎన్ని సెట్లొస్తాయో వేసి ఉంది. కొన్ని approximate అయినా అవి ఒక pattern చూపిస్తాయి. 2027 జనాభా గణన ప్రకారం కనుక చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తప్పకుండా నష్టపోతాయి

చాలా మంది వాదించింది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 80 ఉన్నాయి. అక్కడ ఎవరు గెలిస్తే వారే అధికారంలోకి వస్తున్నారు కదా అని. ఈ వ్యత్యాసము ఎప్పుడూ ఉంది కదా? 1951 లో మొదటి సారి నియోజకవర్గ పునర్విభజన చేసినప్పుడే ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా, విస్తీర్ణం ఉన్న రాష్ట్రం. అప్పటి నుండే వారికి 86 వున్నాయి. 1951 తొలి లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌కు 86 స్థానాలు ఉండేవి.
1967 నుంచి 1999 వరకు ఎక్కువ ఎన్నికల్లో 85 స్థానాలు ఉన్నాయి.
2000లో ఉత్తరప్రదేశ్ విభజన తరువాత ఉత్తరాఖండ్‌కు 5 స్థానాలు కేటాయించారు.
2004 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌కు 80 స్థానాలు వచ్చాయి.
2008 డీలిమిటేషన్ ఆర్డర్‌లో కూడా 80 స్థానాల కేటాయింపు నిర్ధారించబడింది.

మధ్యలో ఉత్తరప్రదేశ్ ను 4 చిన్న రాష్ట్రాలుగా విడగొడదాము అనే ప్రతిపాదన కూడా వచ్చింది. ముందుకు పోలేదు. 70 ఏళ్లుగా ఉన్న వ్యత్యాసాన్ని ఏమి చేస్తాము? ఏదో ఒక రూపేణా రాష్ట్రాల మధ్య ప్రస్తుత స్థానాల నిష్పత్తిని కొనసాగించే ప్రతిపాదన ఈ 50% ప్రతిపాదన ద్వారా జరిగింది.

మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యతను కాపాడటం కూడా అంతే ముఖ్యం!

— ఉపద్రష్ట పార్ధసారధి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు కేంద్రం పరిష్కారం చూపిందా?
  • ఉప్పూనిప్పూ కలయిక! హరీశ్ తదుపరి అడుగులపై మళ్లీ చర్చ!!
  • మధురై కార్తీకదీపం… ఇద్దరే ఇద్దరు… ఆరిపోకుండా చూశారు…
  • నేలపై మెతుకులు ఏరుకున్న ‘పెళ్లి భోజనం’! దిక్కుమాలిన పెళ్లి జాతర!!
  • పాకిస్థాన్ ఎడారుల్లో తెలుగు బంధువులు!
  • నెట్‌ఫ్లిక్స్ పాకిస్థానీ కంటెంట్ వివాదం! కేంద్రం ఊరుకోవాలా..?!
  • యూపీ సభా? బహిరంగసభా? డీలిమిటేషన్‌ పర్వంలో ఓ ఉపకథ!!
  • ఇండస్ట్రియల్ పాలసీ 2.0 … గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 కొత్త పాలసీలు!!
  • మీరు బహుశా ఈ సినిమా గురించి విని ఉండకపోవచ్చు!
  • మహేశ్ బాబు లుక్‌కు ఎఐ నగిషీలు- సిక్స్ ప్యాక్ ప్రయాసలు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions