Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్కా, నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్కా..!!

September 22, 2026 by M S R

.

ఏశనాగుల కట్ట మీద అనే పాట ఎంత సూపర్ హిట్టో చెప్పుకున్నాం కదా… అదొక ఐటమ్ సాంగ్… కానీ దానికి పూర్తి భిన్నమైన లోతైన, ఉద్వేగపూరితమైన పాట మరొకటి ఉంది రాబోయే ప్యారడైజ్ సినిమాలో… రెండు రాసిందీ కాసర్ల శ్యామే… ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్క’ అనే పాటలో మంచి బరువైన పదాలు పడ్డయ్… అభినందనలు…

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ట్వీట్ కనిపించింది హఠాత్తుగా… ఓ వీడియో జతచేశాడు… అందులో సంగీత దర్శకుడు అనిరుధ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమై ‘మీకు ఓ సర్‌ప్రైజ్’ అంటూ ఓ పాట పాడాడు… కాకపోతే తన తెలుగు ఉచ్ఛరణ స్పష్టంగా లేక, ఆ పదాలు సరిగ్గా వినిపించలేదు… సరే, ఏదో ఓ సర్‌ప్రైజ్ ప్రచారం కోసం అనుకుందాం…

Ads

నిజానికి ఈ పాట సినిమాలో పాడింది మధుశ్రీ… ఆమె మరో పాట కూడా పాడినట్టుంది సినిమాలో… ఈ సమ్మక్క పాట గురించి చెప్పుకుందాం…



కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్క నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్క 🧿

kandlalla kanneellu sammakka nee rommulaketlocche sammakka..

Emotion of my #TheParadise 🫶🏼 pic.twitter.com/J8Zs1Yhlr3

— Srikanth Odela (@odela_srikanth) September 21, 2026



పచ్చిది నీ పేగు సమ్మక్క
కుట్టుకుంటాందే ఆకల్ని సమ్మక్క
పిచ్చిది నీ గుండె సమ్మక్క
కొట్టుకుంటాందే కొడుకుకై సమ్మక్క

కండ్లల్ల కన్నీళ్ళు సమ్మక్క
నీ రొమ్ముల్లకెట్లొచ్చే సమ్మక్క
ఇంకిందె రక్తము సమ్మక్క
పొద్దు గుంకిందె గుడిసెల్ల సమ్మక్క
నడిశేటి శవమైతివే

సమ్మెట పోట్లకు సమ్మక్క
సొమ్మసిల్లిన నిప్పువే సమ్మక్క
సావు సాటుకొచ్చి సమ్మక్క
సాదుతున్నవే బతుకును సమ్మక్క

బురదల నీ కాళ్ళు సమ్మక్క
బుదగరిస్తుంటె కాలాన్ని సమ్మక్క
నీ ఒళ్ళు కొలిమైందే సమ్మక్క
అడియాసే నీ బలమైందే సమ్మక్క
నీ పాడె నువ్ మోస్తివే

….. కన్నీళ్లు రొమ్ముల్లోకి రావడం, సొమ్మసిల్లిన నిప్పు, కాలాన్ని బుదగరించడం, నీ పాడే నువ్వు మోస్తివే, నీ ఒళ్లు కొలిమైందే, పొద్దుగుంకిందే గుడిసెల… సమ్మక్క అనే పాత్ర స్థితిపై రాసిన పాట అనుకుంటా… ఖచ్చితంగా బాగుంది పాట… రాను  రాను సినిమా పాటల్లో సాహిత్య విలువలు, ప్రమాణాలు, ఎమోషన్స్ లుప్తమైపోతున్న దురవస్థలో ఇలాంటి పాటలే ఓ ఊరట, ఓ సాంత్వన..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్కా, నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్కా..!!
  • మై జాల్ముడి ఖా రహాథా… ఈమధ్య ఇంత నవ్వొచ్చిన స్కిట్ వేరే లేదు..!!
  • వైజాగ్ బీచ్ మురి మిక్చర్ ! ఈ కరకరల రుచికీ ఓ చరిత్ర ఉంది !!
  • రైతు బిడ్డగా చెప్పుకుంటే అదేమైనా నేరమా..? సిగ్గుచేటు యవ్వారమా..?
  • తోడబుట్టినోళ్లనూ నమ్మేట్టు లేదు! అక్క అంబికపై నటి రాధ క్రిమినల్ కేసు!
  • మరిక ‘ఉమ్మడి పౌరస్మృతి’ అనడం దేనికి..? సెలెక్టివ్ పౌరస్మృతి అనాలి!!
  • Cricketer Shami – యూపీ రాజకీయాల్లో స్టార్ పేసర్ షమి !!
  • ఓ ఆరోగ్యకరమైన చర్చ – ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు !?
  • రాహుల్… నీకూ తల్లి ఉంది… కనీసం నీ డర్టీ టీమ్‌ను మార్చుకో…
  • Immortal – సరుకులన్నీ బాగానే ఉన్నయ్ … వంట కుదరలేదు, అంతే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions